Krishna Water: తమిళనాడు సరిహద్దుకు చేరుకున్న కృష్ణా జలాలు
ABN , Publish Date - May 22 , 2025 | 11:31 AM
కృష్ణా నది జలాలు తమిళనాడు రాష్ట్ర సరిహద్దుకు చేరుకున్నాయి. కండలేరు డ్యాం నుంచి విడుదల చేసిన నీరు సాధారణంగా ఐదారు రోజుల్లో రాష్ట్ర సరిహద్దులకు చేరుతుంటాయి. అయితే.. ప్రస్తుతం వేసవి కారణంగా కాలువ పూర్తిగా ఎండిపోవడంతో కొంత సమయం పట్టింది.
చెన్నై: కండలేరు రిజర్వాయర్ నుంచి ఈ నెల 5న విడుదలైన కృష్ణా జలాలు(Krishna Water) బుధవారం రాష్ట్ర సరిహద్దుకు చేరుకున్నాయి. తొలుత 500 ఘనపుటడుగులుగా విడుదల చేసిన నీటిని క్రమంగా 850 ఘనపుటడుగులకు పెంచారు. కండలేరు డ్యాం(Kandaleru Dam) నుంచి విడుదల చేసిన నీరు సాధారణంగా ఐదారు రోజుల్లో రాష్ట్ర సరిహద్దులకు చేరుతుంది.
ఈ వార్తను కూడా చదవండి: Pavan Kalyan: 26న చెన్నైకి పవన్ కల్యాణ్
ప్రస్తుతం వేసవి కారణంగా కాలువ పూర్తిగా ఎండిపోవడం, ఆంధ్ర రాష్ట్రంలోని రైతులు సాగునీరు తరలిస్తుండడంతో, రాష్ట్ర సరిహద్దులకు కృష్ణా జలాలు నిర్ణీత కాలంలో చేరుకోలేదు. ఈ విషయమై దృష్టి సారించి ఆంధ్ర రాష్ట్ర అధికారులు, సాయిగంగ కాలువలో విడుదల చేసిన కృష్ణా జలాలు అక్రమంగా తరలించరాదని రైతులను హెచ్చరించారు. దీంతో, బుధవారం ఉదయం 7 గంటల ప్రాంతంలో కృష్ణా జలాలు రాష్ట్ర సరిహద్దు ప్రాంతమైన ఊత్తుకోట సమీపంలోని తామరైకుప్పం జీరో పాయింట్‌కు చేరుకున్నాయి.

అక్కడ నుంచి 25 కి.మీ దూరంలో ఉన్న పూండి జలాశయానికి గురువారం వేకువజాముకు చేరుకునే అవకాశముంది. ప్రస్తుతం రాష్ట్ర సరిహద్దుకు 50 ఘనపుటడుగుల నీరు వస్తోందని, రాబోయే రోజుల్లో నీటి రాక పెరిగే అవకాశముందని ప్రజాపనుల శాఖ అధికారులు తెలిపారు. కాగా, 35 అడుగులతో 3.231 టీఎంసీల సామర్థ్యం కలిగిన పూండి జలాశయంలో ప్రస్తుతం 1.361 టీఎంసీల నీటి నిల్వలుండగా, జలాశయానికి సెకనుకు 210 ఘనపుటడుగుల వరద నీరు వచ్చి చేరుతుంది.
ఈ వార్తలు కూడా చదవండి.
భారీ షాక్ ఇచ్చిన బంగారం, వెండి ధరలు.. చివరకు..
కాళేశ్వరం బ్యారేజీల మరమ్మతు ప్రణాళికలేవి
Read Latest Telangana News and National News