Covid: పెరుగుతున్న కరోనా.. మాస్క్ ప్లీజ్
ABN, Publish Date - May 23 , 2025 | 10:26 AM
రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. నిన్న ఒక్కరోజే 66 కేసులు నమోదయ్యాయి. దీంతో వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. అలాగే ప్రతిఒక్కరూ మాస్క్ ధరించాలని సూచిస్తున్నారు.
- కేసులతో ఆరోగ్యశాఖ అప్రమత్తం
చెన్నై: జ్వరం, జలుబు, గొంతునొప్పి, దగ్గు, ఒళ్లునొప్పులతో ఆస్పత్రులను ఆశ్రయించేవారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. ఇదే సమయంలో రాష్ట్రంలో 66 కరోనా కేసులు నమోదయ్యాయనే గణాంకాలు ఆందోళనకు గురి చేస్తున్నాయి. దీంతో బహిరంగ ప్రాంతాల్లో మాస్కులు ధరించాలని రాష్ట్ర ఆరోగ్యశాఖ ప్రజలకు విజ్ఞప్తి చేసింది. 2019లో ప్రారంభమైన కరోనా వ్యాప్తి ప్రపంచంలోని అన్ని దేశాలను గడగడలాడించింది.
ప్రస్తుతం సాధారణ స్థితి నెలకొన్నా అక్కడక్కడా కరోనా కేసులు నమోదవుతుండగా, ఈ వైరస్ ప్రాణాంతకం కాదని వైద్యనిపుణులు అంటున్నారు. ఈ నేపథ్యంలో, కొద్దిరోజులుగా దేశంలోని పలు రాష్ట్రాల్లో కరోనా కేసులు నమోదవుతున్నాయి. దేశవ్యాప్తంగా 257 మంది కరోనా లక్షాణాలతో చికిత్స పొందుతున్నట్లు వార్తలు వచ్చాయి. వారిలో అధికంగా కేరళ రాష్ట్రంలో 95 మంది, తమిళనాడు(Tamil Nadu)లో 66, మహారాష్ట్రలో 56 మంది,
కర్ణాటకలో 13 మంది, పుదుచ్చేరిలో 10 మంది కరోనా లక్షణాలతో చికిత్స పొందుతున్నారు. ఈ విషయమై రాష్ట్ర ఆరోగ్య శాఖ అధికారులు మాట్లాడుతూ.. రాష్ట్రంలో కరోనా వ్యాప్తి ఉందని, కానీ తీవ్రమైన హాని కలిగించే అవకాశం లేదన్నారు. బహిరంగ ప్రాంతాల్లో మాస్క్ ధరించడంతో పాటు నివారణ చర్యలు పాటించాలన్నారు. జ్వరం, ఊపిరితిత్తుల సమస్యలతో బాధపడుతున్న వారు వైద్యుడిని సంప్రదించి చికిత్స పొందాలని అధికారులు సూచించారు.
ఈ వార్తలు కూడా చదవండి.
బాబోయ్ మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు..
సీఎం ఓఎస్‌డీని అంటూ మెయిల్స్, కాల్స్
Read Latest Telangana News and National News
Updated Date - May 23 , 2025 | 10:26 AM