Hyderabad: సీఎం ఓఎస్‌డీని అంటూ మెయిల్స్, కాల్స్
ABN , Publish Date - May 23 , 2025 | 05:53 AM
ముఖ్యమంత్రి కార్యాలయంలోని అధికారుల పేరుతో నకిలీ ఈమెయిల్ ఐడీలు, వాట్సాప్ ఖాతాలను సృష్టించి డబ్బులు డిమాండ్ చేస్తున్న వ్యక్తిని హైదరాబాద్ సైబర్ క్రైం అధికారులు గురువారం అరెస్ట్ చేశారు.
ఘరానా మోసగాడి అరెస్ట్
హైదరాబాద్ సిటీ, మే 22 (ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి కార్యాలయంలోని అధికారుల పేరుతో నకిలీ ఈమెయిల్ ఐడీలు, వాట్సాప్ ఖాతాలను సృష్టించి డబ్బులు డిమాండ్ చేస్తున్న వ్యక్తిని హైదరాబాద్ సైబర్ క్రైం అధికారులు గురువారం అరెస్ట్ చేశారు. అతడిని శ్రీకాకుళం జిల్లా నర్సన్నపేటకు చెందిన రంజీ మాజీ క్రికెటర్ బుడ్డుమూరు నాగరాజుగా పోలీసులు గుర్తించారు.
ఇప్పటి వరకు రాపిడో ఎండీ అరవింద్ సంకా, గుప్తా రియాలిటీ చైర్మన్ శ్రీనివాస్ గుప్తా, బెక్కం ఇన్‌ఫ్రా ఎండీ కృష్ణమోహన్ బొల్లినేని, కంట్రీ డిలైట్ ఎండీలు చంద్రశేఖర్, నితిన్ కౌశల్‌తో పాటు మరికొంత మందిని డబ్బులు డిమాండ్ చేశాడని సమాచారం. విషయం వెలుగులోకి రావడంతో సీఎం రేవంత్‌రెడ్డి ఓఎ్‌సడీ దీనిపై సైబర్‌క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు సాంకేతిక ఆధారాలతో నిందితుడు నాగరాజును అరెస్ట్ చేశారు. అతడిపై తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటివరకు 39 కేసులు నమోదయ్యాయని తెలిపారు.