ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

CM Stalin: సీఎం స్టాలిన్ ధీమా.. 200 సీట్లకంటే ఎక్కువే గెలుస్తాం

ABN, Publish Date - Jul 02 , 2025 | 10:41 AM

వచ్చే యేడాది జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో తమ కూటమి 200 సీట్లకన్నా ఎక్కువ స్థానాలు గెలుచుకోవటం ఖాయమని డీఎంకే అధ్యక్షుడు, ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ ధీమా వ్యక్తం చేశారు.

- స్టాలిన్‌ ధీమా

చెన్నై: వచ్చే యేడాది జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో తమ కూటమి 200 సీట్లకన్నా ఎక్కువ స్థానాలు గెలుచుకోవటం ఖాయమని డీఎంకే అధ్యక్షుడు, ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌(Chief Minister MK Stalin) ధీమా వ్యక్తం చేశారు. తేనాంపేటలోని అన్నా అరివాలయంలో మంగళవారం ఉదయం ‘ఏకతాటిపై తమిళనాడు’ అనే పేరుతో ప్రతి పోలింగ్‌ కేంద్రంలోను 30 శాతం మంది ఓటర్లకు డీఎంకే సభ్యత్వం కల్పించే కార్యక్రమానికి ఆయన శ్రీకారం చుట్టారు.

ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ‘ఏకతాటిపై తమిళనాడు’ పేరుతో 45 రోజులపాటు రాష్ట్రవ్యాప్తంగా ప్రతిపోలింగ్‌ పరిధిలో 30 శాతం మంది ఓటర్లను పార్టీలో చేర్చుకునే కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. పార్టీకి చెందిన స్థానిక నాయకులు ప్రతిపక్ష పార్టీలకు చెందిన వారి ఇళ్లకు కూడా వెళ్ళి, ద్రావిడ తరహా డీఎంకే పాలన అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు గురించి వివరించి వారిని ఆకట్టుకుని పార్టీలో చేరేలా ప్రేరేపించనున్నట్లు ఆయన చెప్పారు.

తమిళ భాషా సంస్కృతి, సంప్రదాయాలకు హాని కలిగించడమే పనిగాపెట్టుకున్న బీజేపీ కపటనాటకాలను గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు వివరించి, వారికి డీఎంకే సభ్యత్వం కల్పించాలని పిలుపునిచ్చారు. 2026 అసెంబ్లీ ఎన్నికలకు డీఎంకే సిద్ధంగానే ఉందని, ఆ ఎన్నికల్లో గెలుపు ఖాయమని, గతంలో తాను చెప్పినట్లు 200 సీట్ల కంటే అధిక సీట్లలోనే గెలుస్తామని పేర్కొన్నారు.

కూటమిలో కొత్త పార్టీలు.. : అసెంబ్లీ ఎన్నికల్లోగా డీఎంకే కూటమి లో కొత్త పార్టీలు కూడా చేరే అవకాశం ఉందని స్టాలిన్‌ పేర్కొన్నారు. ఎన్నికల నోటిఫికేషన్‌ వచ్చిన వెంటనే కొత్త పార్టీలు కూటమిలో చేరుతాయని ఆయన తెలిపారు. బీజేపీ తరఫున ప్రచారం చేయడానికి ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా రాష్ట్రంలో తరచూ పర్యటించాలని, అప్పుడే డీఎంకే కూటమి గెలిచే సీట్లు క్రమంగా పెరుగుతాయని చెప్పారు.

ఈ వార్తలు కూడా చదవండి.

విద్యార్థుల హెల్త్‌ ప్రొఫైల్‌ రూపొందించాలి

అధికారులు ఉత్సాహంగా పనిచేయాలి

Read Latest Telangana News and National News

Updated Date - Jul 02 , 2025 | 10:41 AM