ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Pehalgam Terror Attack: భారత్‌లోని పాకిస్థానీలకు కేంద్రం గుడ్ న్యూస్

ABN, Publish Date - May 01 , 2025 | 01:28 PM

Pehalgam Terror Attack: పహల్గాంలోని ఉగ్రదాడి నేపథ్యంలో ఇరు దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో పాకిస్థాన్‌కు వ్యతిరేకంగా భారత్ పలు కీలక నిర్ణయాలు తీసుకొంది. భారత్‌లోని పాకిస్థానీలు దేశం విడిచి వెళ్లాలని ఆదేశించింది. అందుకు గడువు విధించింది. కానీ దీనిపై భారత్ కాస్తా వెనక్కి తగ్గింది.

న్యూఢిల్లీ, మే 01: పహల్గాంలో ఉగ్రదాడి నేపథ్యంలో భారత్‌లోని పాకిస్థానీయులంతా స్వదేశానికి వెళ్లిపోవాలంటూ కేంద్రం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఏప్రిల్ 30వ తేదీ లోపు వారంతా భారత్ విడిచి వెళ్లాలని ఆ ఆదేశాల్లో స్పష్టం చేసింది. అయితే ఈ ఆదేశాలపై భారత్ కాస్తా వెనక్కి తగ్గింది. ఆ క్రమంలో పాకిస్థానీయులు దేశం విడిచి వెళ్లాలంటూ జారీ చేసిన ఆదేశాలను కేంద్రం గురువారం సవరించింది. తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు.. వాఘా అట్టారీ సరిహద్దు నుంచి పాకిస్థానీలు.. స్వదేశానికి వెళ్లేందుకు అనుమతి ఇచ్చింది. ఈ మేరకు కేంద్రం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.


ఏప్రిల్ 22వ తేదీ జమ్మూ కాశ్మీర్‌ అనంతనాగ్ జిల్లాలోని పహల్గాంలో పర్యాటకులపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో 26 మంది మరణించారు. ఈ నేపథ్యంలో పాక్‌కు వ్యతిరేకంగా భారత్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. అందులోభాగంగా సింధూ జలాల ఒప్పందాన్ని రద్దు చేసింది. సరిహద్దులోని అట్టారీ, వాఘా సరిహద్దును సైతం మూసి వేస్తున్నట్లు ప్రకటించింది. భారత్‌లో పర్యటిస్తున్న పాకిస్థానీలు దేశం విడిచి వెళ్లాలని ఆదేశించింది. అందుకు ఏప్రిల్ 30వ తేదీ తుది గడువుగా నిర్ణయించింది.


ఇక న్యూఢల్లీలోని పాక్ రాయబారిని సైతం భారత్ వీడి వెళ్లాలని స్పష్టం చేసింది. అందుకు వారం రోజులు గడువు విధించింది. దీంతో చాలా వరకు భారత్‌లోని పాకిస్థానీలు దేశం వీడి స్వదేశానికి పయనమయ్యారు. అలాగే వివిధ రాష్ట్రాల్లో నివసిస్తున్న పాకిస్థానీల ఆచూకీ కనుగొని వారి వివరాలను సైతం కేంద్రానికి ఇవ్వాలని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా దేశంలోని సీఎంలకు ఫోన్ చేసి మరి స్పష్టం చేశారు.


దీంతో ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు చేపట్టింది. అందులోభాగంగా వేలాది మంది బంగ్లాదేశీయలు, వందలాది మంది పాకిస్థానీలు భారత్‌లో నివసిస్తున్నట్లు ప్రభుత్వం గుర్తించి.. వారి వారి దేశాలకు పంపేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. అలాంటి వేళ.. కేంద్రం పై విధంగా స్పందించింది. ఇక భారత్ తీసుకున్న కీలక నిర్ణయాలపై పాక్ స్పందించింది. పాక్ సైతం అలాంటి నిర్ణయాలే భారత్‌కు వ్యతిరేకంగా తీసుకొంది. సిమ్లా ఒప్పందాన్ని రద్దు చేసింది.

ఈ వార్తలు కూడా చదవండి..

High alert: బంగ్లాదేశ్ సరిహద్దుల్లో హై అలర్ట్.. ఎందుకంటే..

Pehalgam Terror Attack: పాక్‌కు వ్యతిరేకంగా భారత్ మరో కీలక నిర్ణయం

Pakistan: పహల్గాం దాడి నేపథ్యంలో పాక్ కీలక నిర్ణయం

Pahalgam Terror Attack: ఉగ్రదాడిపై కీలక విషయాన్ని వెల్లడించిన ఆదర్శ్ రౌత్

For National News And Telugu News

Updated Date - May 01 , 2025 | 01:34 PM