ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Aadhaar- Voter ID: ఆధార్-ఓటర్ ఐడీ అనుసంధానంపై సీఈసీ కీలక నిర్ణయం..

ABN, Publish Date - Mar 15 , 2025 | 09:51 PM

ఆధార్ కార్డుకు ఓటర్ ఐడీని అనుసంధానం చేసే దిశంగా సీఈసీ చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఓటరు ఐడీల్లో అవకతవకలు జరుగుతన్నాయని ఇటీవల అనేక ఆరోపణలు వస్తున్న విషయం తెలిసిందే.

ఆధార్ కార్డుకు ఓటర్ ఐడీని అనుసంధానం చేసే దిశంగా సీఈసీ చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఓటరు ఐడీల్లో అవకతవకలు జరుగుతన్నాయని ఇటీవల అనేక ఆరోపణలు వస్తున్న విషయం తెలిసిందే. నకిలీ ఓటరు జాబితా ద్వారా బీజేపీ.. మహారాష్ట్ర, ఢిల్లీ వంటి రాష్ట్రాల్లో గెలిచిందంటూ టీఎంసీ ఇటీవల ఆరోపించిన విషయం కూడా తెలిసిందే. ఈ నేపథ్యంలో ఓట‌రు కార్డును.. ఆధార్ కార్డుతో అనుసంధానం చేసే అంశంపై కేంద్ర హోంశాఖ కార్య‌ద‌ర్శి, లెజిస్లేటివ్ సెక్ర‌ట‌రీతో పాటూ యూఐడీఏఐ సీఈవోతో భార‌త ప్ర‌ధాన ఎన్నిక‌ల అధికారి జ్ఞానేశ్ కుమార్ (CEC Gyanesh Kumar) భేటీ కానున్నట్లు తెలుస్తోంది.


ఎలక్టోరల్ డేటాలో ఎలాంటి అక్రమాలు జరగకుండా ఉండేందుకు ఈ చర్యలు (link voter ID with Aadhaar) తీసుకోనున్నట్లు తెలుస్తోంది. వివిధ శాఖల అధికారులతో సీఈసీ మంగళవారం సమావేశం అవనున్నారని ఆ శాఖ వర్గాలు తెలిపారు. సుమారు 25 ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న ఓటర్ ఐడీ కార్డు డూప్లికేట్ సమస్యకు మూడు నెలల్లో చెక్ పెట్టేలా చర్యలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఈ అంశంపై ఏప్రిల్‌ 30లోగా అన్ని జాతీయ, రాష్ట్రాలకు చెందిన పార్టీల నుంచి కూడా సూచనలు కోరతారని చెబుతున్నారు. అదేవిధంగా దీనిపై బూత్ స్థాయి ఏజెంట్లు, పోలింగ్, కౌంటింగ్ ఏజెంట్లతో పాటూ ఎన్నికల ఏజెంట్లకు శిక్షణ ఇవ్వనున్నట్లు సీఈసీ వర్గాలు తెలిపాయి.


ఓటర్ల జాబితాను ఆధార్ డేటాబేస్‌తో అనుసంధానించేందుకు చట్టం అనుమతిస్తోందని అధికారులు చెబుతున్నారు. ఓటర్ కార్డును ఆధార్‌తో ఆనుసంధానం చేసే అంశంపై ఎలాంటి గడువూ నిర్దేశించలేదని ప్రభుత్వం పార్లమెంట్‌లో తెలిపింది. అదేవిధంగా ఓటరు జాబితాలతో తమ ఆధార్ వివరాలను అనుసంధానించని వారి పేర్లను ఓటర్ జాబితా నుంచి తొలగించరని కూడా ప్రభుత్వం పేర్కొంది.

Updated Date - Mar 15 , 2025 | 09:51 PM