Project Cheetah: జురాసిక్ పార్క్ తరహాలో.. అంతరించిన చీతాలకు పునర్జన్మ.. ఎలా అంటే..
ABN, Publish Date - Apr 18 , 2025 | 04:35 PM
Project Cheetah India:అంతరించిపోయిన జీవిని మళ్లీ సృష్టించడం సినిమాల్లో తప్ప నిజజీవితంలో అసాధ్యమని అనుకుంటాం. కానీ, ఈ అభిప్రాయం తప్పని నిరూపించేందుకు సిద్ధమయ్యారు మన భారతీయ శాస్త్రవేత్తలు. కొత్త టెక్నాలజీతో భారతీయ చిరుత గర్జన మళ్లీ అడవుల్లో వినిపించే ప్రయత్నాల్లో నిమగ్నమయ్యారు.
Gene Editing to Reintroduce Cheetahs India: లక్షల ఏళ్ల క్రితం భూమిపై నివసించిన డైనోసార్లు మళ్లీ ఈ కాలంలో భూమిపై కనిపించడం సాధ్యమేనా.. ఈ ప్రశ్న ఎవరినైనా అడిగితే జురాసిక్ పార్క్ సినిమాలో తప్ప నిజజీవితంలో సాధ్యం కాదనే సమాధానమిస్తారు. డైనోసార్ సంగతి ఏమో గానీ, ఎప్పుడో 70 ఏళ్ల కిందటే భారతీయ గడ్డపై కనిపించకుండా అంతరించిపోయిన జీవుల జాబితాలోకి చేరిన చిరుతకు మేం పునర్జన్మ ప్రసాదిస్తామని బల్లగుద్ది మరీ చెబుతున్నారు భారతీయ శాస్త్రవేత్తలు. వినటానికి ఆశ్చర్యంగా అనిపించినా జీన్ టెక్నాలజీ ద్వారా ఇది సాధ్యమేనని తెలుస్తోంది.
భారతీయ చిరుత చివరిసారిగా 1950లకు ముందు దర్శనమిచ్చింది. చూసేందుకు భయంకరమైన తోడేలులాగా కనిపించే ఈ చిరుత భూమిపై 10,000 సంవత్సరాలు తన ఉనికిని చాటుకుంది. ఇటీవల యునైటెడ్ స్టేట్స్ అంతరించిపోయిన జీవుల జాబితాలో కూడా చేరింది. దీంతో ఉత్తరప్రదేశ్ లక్నోలోని బీర్బల్ సాహ్ని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పాలియోసైన్సెస్ (BSIP), జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ZSI) సహకారంతో భారతీయ చిరుతకు పునరుజ్జీవం ఇచ్చేందుకు సంయుక్తంగా పనిచేయడం మొదలుపెట్టారు.
ఎలా సృష్టిస్తారు?
భారతీయ చిరుతల నమూనాలు, దాని మొత్తం జీనోమ్ సీక్వెన్సింగ్ (WGS) ప్రక్రియ చివరి దశకు చేరుకుంది. ఇది చిరుత మొత్తం DNA సమగ్ర విశ్లేషణను అందిస్తుంది. ఇది వ్యాధికి దారితీసిన లేదా వ్యాధి ప్రమాదాన్ని పెంచిన జన్యు వైవిధ్యాలను గుర్తించడానికి వీలు కల్పిస్తుంది. ఇక అంతరించిపోయిన చిరుతను జీనో ఎడిటింగ్ పద్ధతి ద్వారా తిరిగి సృష్టించేందుకు BSIP ప్రణాళికలను ప్రకటించింది. ఎడిట్ చేసిన పిండాన్ని సరోగసీ ద్వారా ఆఫ్రికన్ చిరుత గర్భంలో అమర్చి భారతీయ చిరుత జాతిని తిరిగి భూమిపైకి రప్పించడమే ఈ ప్రాజెక్టు లక్ష్యమని పరిశోధనా బృందానికి అధిపతి అయిన BSIP సీనియర్ శాస్త్రవేత్త నీరజ్ రాయ్ అన్నారు.
ప్రస్తుతం భారతదేశంలో ఉన్న చిరుతలు 2022–23 మధ్యకాలంలో నమీబియా, దక్షిణాఫ్రికా నుంచి ఇక్కడికి వచ్చినవే. మధ్యప్రదేశ్‌లోని కునో జాతీయ ఉద్యానవనానికి తరలించిన 20 చిరుతలలో.. భారతదేశంలో జన్మించిన ఐదు పిల్లలతో పాటు ఎనిమిది చనిపోయాయి. ఇదిలా ఉంటే కచ్చితంగా చిరుతకు భారత శాస్త్రవేత్తలు తిరిగి జీవం పోసే అవకాశం ఉందని టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదించింది.
Read Also: Murshidabad Violence: రాష్ట్రం తగులబడుతుంటే ఆ ఎంపీ ఏమైనట్టు?
India: బెంగాల్ ఘటనలపై బంగ్లా అనుచిత వ్యాఖ్యలు.. ఖండించిన భారత్..
Maharashtra: అప్పుడు అందరికీ బట్టతల వైరస్.. ఇప్పుడు ఇంకోటి.. వరస మిస్టరీ వైరస్‌లకు కారణమేంటి..
Updated Date - Apr 18 , 2025 | 04:37 PM