ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

India Vs Pakistan: ఇక భారత్‌ను చూసి పాక్ వణకాల్సిందే..

ABN, Publish Date - May 28 , 2025 | 01:13 PM

పొరుగుదేశం భారత్‌పై పాకిస్థాన్ తన తెంపరితనాన్ని చాటుకుంటుంది. అందులోభాగంగా పహల్గాంలో పర్యాటకులే లక్ష్యంగా ఉగ్రవాదులు దాడులకు దిగారు. ఈ దాడుల్లో 26 మంది మరణించారు. ఈ తరహా చర్యలకు పాక్ దిగకుండా భారత్ కట్టుదిట్టమైన చర్యలు చేపడుతోంది.

న్యూఢిల్లీ, మే 28: పహహల్గం ఉగ్రదాడి అనంతరం తన ఆయుధ సంపత్తిని పెంచుకోవడంపై భారత్ దృష్టి సారించింది. అందులోభాగంగా రష్యాతో కలిసి బ్రహ్మోస్ క్షిపణులు ఆధునిక వర్షన్‌ రూపొందించేందుకు భారత్ సమాయత్తమైంది. అందుకోసం ఇప్పటికే రష్యాతో భారత్ చర్చలు జరిపింది. ఈ అంశంపై ఈ ఇరు దేశాలు ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఆ క్రమంలో ఉత్తరప్రదేశ్‌లో రూ. 300 కోట్లతో కొత్త బ్రహ్మోస్ ఫ్యాక్టరీని నిర్మించనున్నారు. అందుకోసం మే 11వ తేదీన కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌లు యూపీ రాజధాని లక్నోలో బ్రహ్మోస్ ఏరో స్పేస్ సెంటర్‌ను ప్రారంభించారు. 80 హెక్టార్లలో దీనిని ఏర్పాటు చేశారు. భారత్ క్షిపణి సామర్థ్యాన్ని పెంచడమే లక్ష్యంగా దీనిని ప్రారంభించారు.


అంతేకాదు.. మేక్ ఇన్ ఇండియాతోపాటు ఆత్మ నిర్బర్ భారత్‌ వంటి పథకాలకు మరింత ప్రోత్సహించేందుకు ఇది సహాయ పడుతుందని తెలుస్తుంది. భారత్‌లో బ్రహ్మోస్ క్షిపణుల ఉత్పత్తి పెరిగే కొద్ది అయ్యే వ్యయం భారీగా తగ్గనుంది. అలాగే గతంలో వీటికి సంబంధించిన వీడి భాగాలు దిగుమతి చేసుకోవాల్సి వచ్చేది. దీంతో భారీగా ఖర్చయ్యేది. కానీ బ్రహ్మోస్ క్షిపణులు భారత్‌లోనే తయారు చేసుకోవడంతో.. వాటి విడి భాగాలను సైతం దిగుమతి చేసుకోవాల్సిన అవసరం ఇకపై ఉండదు. ఈ సంస్థను ఏర్పాటు చేయడం వల్ల స్థానికులకు ఉపాధి అవకాశాలు లభిస్తాయి. అంతేకాకుండా.. వీటిని ఎగుమతి చేసే స్థాయికి భారత్ చేరుకోనుంది. దీంతో దేశ ఆర్థిక వ్యవస్థ సైతం బలోపేతమవుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతుంది.


పాకిస్థాన్.. తన పొరుగు దేశమైన భారత్‌పై తన తెంపరితనాన్ని చాటుకుంటుంది. ఈ విషయం ఇప్పటికే పలుమార్లు స్పష్టమైంది. పహల్గాం ఉగ్రదాడి అనంతరం ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్థాన్‌తోపాటు పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోని మొత్తం 21 ప్రాంతాల్లోని 9 ఉగ్రవాద స్థావరాలపై భారత్ దాడి చేసి పూర్తిగా ధ్వంసం చేసింది. ఈ ఆపరేషన్‌లో భాగంగా నిర్వహించిన దాడుల్లో బ్రహ్మోస్ క్షిపణలు క్రియాశీలకంగా వ్యవహరించాయి.


బ్రహ్మోస్ క్షిపణుల శక్తి గురించి యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ తనదైన శైలిలో ఇటీవల స్పందించారు. క్షిపణి దాడుల్లో బ్రహ్మోస్ క్షిపణులు క్రియశీలకంగా వ్యవహరించాయన్నారు. ఈ క్షిపణి శక్తిని మీరు చూడకుంటే.. పాకిస్థాన్ ప్రజలను అడిగి తెలుసుకోడంంటూ ఆయన చమత్కరించారు. ఆపరేషన్ సిందూర్‌లో భాగంగా రావల్పిండి సమీపంలోని నూర్ ఖాన్ ఎయిర్ బేస్‌తోపాటు బావల్‌పూర్‌లోని జైషే మహమ్మద్ స్థావరంపై దాడి చేయడంతో.. అవి పూర్తిగా ధ్వంసమైనాయి. ఇక భారత్‌ అమ్ములపొదిలో బ్రహ్మోస్ అధునిక వర్షన్ ఉంటే.. పాకిస్థాన్‌ ఇకపై పొరుగుదేశంతో చాలా జాగ్రత్తగా వ్యవహరించడం ఖాయమనే చర్చ జరుగుతోంది.


బ్రహ్మోస్ క్షిపణులు రేంజ్ 290 నుంచి 400 కిలోమీటర్ల మేర ఉంటుంది. ఇవి 2.8 మాక్ వేగాన్ని కలిగి ఉంటుంది. వీటిని పాకిస్థాన్‌తోపాటు చైనా అంబులపొదిలోని ఆయుధాలు ఆపలేవు. భారత్ వీటిని భూమి ఉపరితలం నుంచి ఉపరితలంపైకి, నౌకలపై నుంచి భూ ఉపరితలంపైకి.. అలాగే గాలిలో సైతం ఇవి దాడి చేస్తాయి. ఈ క్షిపణులు శబ్ద వేగం కంటే మూడు రెట్ల వేగంతో వెళ్తాయి.

ఈ వార్తలు కూడా చదవండి

పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌పై టీడీపీ అగ్రనేతలు కీలక వ్యాఖ్యలు

గులాం నబీ ఆజాద్‌కు అస్వస్థత.. ఆసుపత్రికి తరలింపు

Read Latest AP News And Telugu News

Updated Date - May 28 , 2025 | 04:40 PM