Share News

TDP Mahanadu 2025: పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌పై టీడీపీ అగ్రనేతలు కీలక వ్యాఖ్యలు

ABN , Publish Date - May 28 , 2025 | 11:58 AM

టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నారా లోకేశ్ నియమించాలనే డిమాండ్ రోజురోజుకు పెరుగుతోంది. అలాంటి వేళ.. కడప వేదికగా జరుగుతోన్న మహనాడులో ఆ పార్టీ సీనియర్ నేతలు ఈ అంశంపై స్పందించారు.

TDP Mahanadu 2025: పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌పై టీడీపీ అగ్రనేతలు కీలక వ్యాఖ్యలు
Tdp MLA S Chandramohan reddy

అమరావతి, మే 28: ఏపీ విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్‌ను వర్కింగ్ ప్రెసిడెంట్‌గా చేయాలనే డిమాండ్ పార్టీలోని నేతలు, కార్యకర్తల నుంచి బలంగా వినిపిస్తోందని టీడీపీ నేతలు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, కలిశెట్టి అప్పలనాయుడు తెలిపారు. తాము సైతం అదే కోరుకుంటున్నామన్నారు. బుధవారం కడప మహనాడులో ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి‌తోపాటు విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ.. పార్టీ భవిష్యత్తు దృష్ట్యా సీనియర్లు అంతా కూడా నారా లోకేష్‌ను వర్కింగ్ ప్రెసిడెంట్‌గా చేయాలని కోరుతున్నామని చెప్పారు.


అయితే ఈ రోజు.. అంటే బుధవారం టీడీపీ జాతీయ అధ్యక్షుడు ఎన్నిక ఉంటుందని తెలిపారు. అలాగే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కూడా ఈ రోజు ప్రకటించాలని తామంతా కోరుతున్నామన్నారు. కానీ పార్టీ నియమావళిని అనుసరించి.. వర్కింగ్ ప్రెసిడెంట్, కార్యవర్గ కూర్పులను జాతీయ అధ్యక్షులు ప్రకటిస్తారని పేర్కొన్నారు. కానీ మా అందరి కోరిక మాత్రం ఈ రోజు వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రకటన చేయాలని కోరుతున్నామన్నారు.


ఇక బుధవారం మహానాడులో రాష్ట్రంలో సుస్థిర పాలనకు ప్రజల సహకరించాలంటూ రాజకీయ తీర్మానం ఉంటుందన్నారు. సుస్థిర పాలన ఉంటేనే అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. కేంద్రంలో, రాష్ట్రంలో ఎన్డీయే సర్కార్ ఉండటం వలనే అభివృద్ధి సాధ్యమవుతుందని వారు స్పష్టం చేశారు. అక్రమాలు, నిర్బంధాలు, విధ్వంసం నుంచి రాష్ట్రాన్ని గాడిలో పెట్టేందుకు ఏడాది సమయం పట్టిందని ఈ సందర్బంగా వారు గుర్తు చేశారు. భవిష్యత్తులో అటువంటి పరిస్థితి రాకుండా చూసే బాధ్యత ప్రజలతోపాటు ప్రభుత్వానికి సైతం ఉందని స్పష్టం చేశారు. అందుకే అభివృద్ధి, సంక్షేమాన్ని సీఎం చంద్రబాబు సమపాళ్లలో నడిపిస్తున్నారన్నారు. ఈ రాజకీయ తీర్మానంలో ఈ అంశాలన్నింటినీ పేర్కొంటామని వారు చెప్పారు.

ఈ వార్తలు కూడా చదవండి

గులాం నబీ ఆజాద్‌కు అస్వస్థత.. ఆసుపత్రికి తరలింపు

కేంద్ర సాహిత్య అకాడమీకి తానా కీలక సూచన

Read Latest AP News And Telugu News

Updated Date - May 28 , 2025 | 12:00 PM