BJP MLA: కుల ధృవీకరణ పత్రాల్లో హిందూ అనే పదం తొలగింపు.. సరికాదన్న బీజేపీ ఎమ్మెల్యే
ABN, Publish Date - Jun 14 , 2025 | 01:14 PM
రాష్ట్రంలో పాఠశాల, కళాశాలల్లో చదువుకుంటున్న విద్యార్థులకు ఇస్తున్న కుల ధృవీకరణ పత్రాల్లో ‘హిందూ’ అనే పదాన్ని తొలగించడం సరికాదని బీజేపీ జాతీయ మహిళా విభాగం అధ్యక్షురాలు, కోవై వెస్ట్ ఎమ్మెల్యే వానతి శ్రీనివాసన్ అభిప్రాయపడ్డారు.
సరికాదన్న బీజేపీ ఎమ్మెల్యే
చెన్నై: రాష్ట్రంలో పాఠశాల, కళాశాలల్లో చదువుకుంటున్న విద్యార్థులకు ఇస్తున్న కుల ధృవీకరణ పత్రాల్లో ‘హిందూ’ అనే పదాన్ని తొలగించడం సరికాదని బీజేపీ జాతీయ మహిళా విభాగం అధ్యక్షురాలు, కోవై వెస్ట్ ఎమ్మెల్యే వానతి శ్రీనివాసన్(Vasati Srinivasn) అభిప్రాయపడ్డారు. దేశంలో చాలాకాలం నుంచి విద్యార్థులకు ఇస్తున్న కుల ధృవీకరణ పత్రాల్లో వారి కులంతో పాటు హిందూ, క్రిస్టియన్, ముస్లిం తదితర మతాలు కూడా ఉండేవి.
ఈ నేపథ్యంలో, ఇటీవల కాలంగా ఆన్‌లైన్ ద్వారా విద్యార్థులు పొందుతున్న కుల ధృవీకరణ పత్రాల్లో హిందూ అనే పదం లేకుండా వారి కులంపేరు, బీసీ, ఎంబీసీ, ఈబీసీ అని మాత్రమే నమోదు చేయడంపై వానతీ శ్రీనివాసన్ తప్పుబట్టారు. ఆమె శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ, హిందూ అనే పదం తొలగించడంవల్ల విద్యార్థులు వారి తల్లిదండ్రుల్లో అయోమయం నెలకొందని, హిందూ మతం అన్ని కులాలను సమానంగా చూస్తూ విద్య, ఉద్యోగ అవకాశాల్లో రిజర్వేషన్ కల్పిస్తోందని, అయితే డీఎంకే ప్రభుత్వం విద్యార్థులకు నష్టం కలిగించే విధంగా తీసుకున్న నిర్ణయం సరికాదన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి.
తెలంగాణ గవర్నర్‌ను కలిసిన బాలకృష్ణ
Read Latest Telangana News and National News
Updated Date - Jun 14 , 2025 | 01:51 PM