PM Modi: మోదీ వ్యాఖ్యలపై స్పందించిన చైనా
ABN, First Publish Date - 2025-03-17T19:41:06+05:30
PM Modi: చైనా.. తన పొరుగు దేశం భారత్‌పై నిత్యం కయ్యానికి కాలుదువ్వుతోందన్న సంగతి అందరికి తెలిసిందే. అలాంటి వేళ.. చైనాపై ఓ ఇంటర్వ్యూలో ప్రధాని మోదీ చేసిన సానుకూల వ్యాఖ్యలపై ఆ దేశం హర్షం వ్యక్తం చేసింది. అంతేకాదు.. మోదీ వ్యాఖ్యలను ఆ దేశం ప్రశంసించింది.
న్యూఢిల్లీ, మార్చి 17: అమెరికన్ పాడ్ కాస్టర్ లెక్స్ ఫ్రిడ్జిమెన్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పొరుగు దేశం చైనాతో సంబంధాలపై భారత ప్రధాని నరేంద్ర మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై చైనా విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారి మావో నింగ్ సోమవారం చైనాలో స్పందించారు. చైనాతో సంబంధాలపై ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలను ఆమె అభినందించారు. మోదీ సానుకూల వ్యాఖ్యలతో ఇరు దేశాల విజయానికి దోహదపడతాయని ఆకాంక్షించారు. భారత్, చైనా దేశాల మధ్య వేలాది సంవత్సరాల చరిత్ర ఉందని గుర్తు చేశారు. నాగరికతతోపాటు మానవ ప్రగతిని ఈ ఇరుదేశాలు.. ఒకదానికొకటి నేర్చుకున్నాయని వివరించారు. గతేడాది అక్టోబర్‌లో రష్యాలోని కజాన్‌లో ప్రధాని మోదీ, చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్ సమాశమైయ్యారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఇది ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలు పురోగతితోపాటు అభివృద్ధికి మార్గదర్శకత్వాన్ని అందించిందని మావో నింగ్ వివరించారు.
2020లో తూర్పు లడఖ్‌లో ఇరు దేశాలకు చెందిన సైన్యాల మధ్య జరిగిన ఘర్షణ చోటు చేసుకుంది. ఆ క్రమంలో ఉద్రిక్తత నెలకొంది. ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ.. పాడ్‌కాస్టర్ లెక్స్ ఫ్రిడ్జ్‌మాన్ అడిగిన ప్రశ్నలకు ప్రధాని మోదీ తనదైన శైలిలో సమాధాన మిచ్చారు. ఇరు దేశాల మధ్య నెలకొన్న విబేధాలు.. వివాదాలుగా మారకుండా చూసుకుంటామని.. అది చర్చల ద్వారా మాత్రమే సాధ్యమవుతోందని ప్రధాని మోదీ.. ఈ ఇంటర్వ్యూలో స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.
2020 మే, జూన్ మాసాల్లో పాంగోంగ్ సరస్సు, గాల్వాన్ లోయ ప్రాంతంలో ఇరు దేశాల సైనికుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. అనంతరం ఈ రెండు ప్రాంతాల్లో.. నాటి నుంచి గస్తీని నిలిపివేశారు. అయితే గతేడాది నవంబర్‌లో.. అంటే దాదాపు నాలుగు సంవత్సరాలు అనంతరం తూర్పు లడఖ్‌లోని వాస్తవ నియంత్రణ రేఖ వద్ద ఇరు దేశాలు గస్తీని పున: ప్రారంభించిన సంగతి తెలిసిందే.
భారత్, చైనా దేశాల మధ్య సరిహద్దు వివాదాలు నెలకొందన్నది వాస్తవమని ప్రధాని మోదీ ఈ ఇంటర్వ్యూలో వెల్లడించిన విషయం విధితమే. అలాగే చైనా దేశాధ్యక్షుడు జిన్‌పింగ్‌తో ఇటీవల జరిగిన తన సమావేశం అనంతరం సరిహద్దు వద్ద సాధారణ పరిస్థితులు చోటు చేసుకోన్నాయని కూడా ప్రధాని మోదీ వివరించారు.
ఇవి కూడా చదవండి...
CM Revanth Reddy: కేబినెట్ నుంచి మంత్రులను తొలగిస్తేనేనా..
Tirumala: శ్రీవారి దర్శనానికి తిరుపతి వెళ్తున్నారా .. టేక్ కేర్
CM Revanth Reddy: అసెంబ్లీలో బీసీ రిజర్వేషన్ బిల్లు.. సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు
Droupadi Murmu: రాష్ట్రపతి భవన్‌లో విందు.. హాజరైన ఏపీ ఎంపీలు
CM ChandraBabu: అందుకే ఈ డాక్యుమెంట్ రూపొందించాం
KTR criticizes Congress govt: కాంగ్రెస్ పాలన ఫలితమే ఇదీ.. కేటీఆర్ ఫైర్
12వ రోజుకు ఏపీ అసెంబ్లీ సమావేశాలు
Raghurama serious: సభ్యులపై డిప్యూటీ స్పీకర్ సీరియస్
For National News And Telugu News
Updated Date - 2025-03-17T19:41:09+05:30 IST