Pawan Kalyan: ఎంకే స్టాలిన్‌పై పవన్‌కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు
ABN, Publish Date - Jun 22 , 2025 | 08:49 PM
మదురైలో 'మురుగన్ మానాడు'లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. మానాడుపై డీఎంకే నేతలు రాజకీయాలు చేయడం సరికాదని పవన్‌కల్యాణ్ అన్నారు.
డీఎంకే అధ్యక్షుడు, తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌పై (MK Stalin) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ (AP Deputy CM Pawan Kalyan) సంచలన వ్యాఖ్యలు చేశారు. మానాడుపై డీఎంకే నేతలు రాజకీయాలు చేయడం సరికాదని అన్నారు. మా మతాన్ని ప్రశ్నించడానికి మీరెవరని ప్రశ్నించారు. హిందువు హిందువుగా ఉండకూడదా అని నిలదీశారు. దయచేసి తమను రెచ్చగొట్టవద్దని అన్నారు. హిందువులను అవమానిస్తారు.. ప్రశ్నిస్తే సెక్యులరిజం అంటారని డీఎంకే నేతలపై పవన్ కల్యాణ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
కాగా, పవన్ కల్యాణ్ ఈ రోజు(ఆదివారం) తమిళనాడులోని మధురైలో పర్యటించారు. మధురైలోని తిరుపరకుండ్రం సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శించుకున్నారు. అనంతరం అమ్మ తిడల్ ప్రాంగణంలో జరిగిన మానాడులో ముఖ్యఅతిథిగా ఆయన పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్‌కి బీజేపీ తమిళనాడు రాష్ట్ర అధ్యక్షులు నైనార్ నాగేంద్రన్, తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, తమిళనాడు అబ్జర్వర్ పొంగులేటి సుధాకర్ రెడ్డి, బీజేపీ తమిళనాడు రాష్ట్ర ఉపాధ్యక్షులు చక్రవర్తి, రాష్ట్ర నాయకుడు, అమర్ ప్రసాద్ రెడ్డి , మధురై జిల్లా అధ్యక్షులు మారి చక్రవర్తి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామ శ్రీనివాసన్, సీనియర్ రాజకీయ నాయకులు రాధాకృష్ణన్, పలువురు జనసేన నేతలు స్వాగతం పలికారు.
ఇవి కూడా చదవండి..
ఇరాన్ నుంచి ఢిల్లీకి చేరిన మరో 311 మంది భారతీయులు
ఇజ్రాయెల్ నుంచి కూడా భారతీయుల తరలింపు
For National News And Telugu News
Updated Date - Jun 22 , 2025 | 09:06 PM