Bengaluru: బెంగళూరు మెట్రోలో అమూల్ స్టాళ్లు..
ABN, Publish Date - Jun 19 , 2025 | 01:50 PM
నమ్మ మెట్రో రైల్వే స్టేషన్‌లలో గుజరాత్‌కు చెందిన అమూల్ పాల ఉత్పత్తులు విక్రయించేందుకు అనుమతిలివ్వడంపై కన్నడిగులు మండి పడుతున్నారు. గత లోక్‌సభ ఎన్నికల్లో అమూల్ విక్రయాలను ప్రోత్సహించేలా కేంద్ర హోం మంత్రి అమిత్‌షా ప్రస్తావించడం తీవ్ర వివాదానికి దారి తీసింది.
- అనుమతులపై మండిపడుతున్న కన్నడిగులు
- టెండర్ల ద్వారానే అవకాశం: డీసీఎం డీకే
బెంగళూరు: నమ్మ మెట్రో రైల్వే స్టేషన్(Namma Metro Railway Station)లలో గుజరాత్‌కు చెందిన అమూల్ పాల ఉత్పత్తులు విక్రయించేందుకు అనుమతిలివ్వడంపై కన్నడిగులు మండి పడుతున్నారు. గత లోక్‌సభ ఎన్నికల్లో అమూల్ విక్రయాలను ప్రోత్సహించేలా కేంద్ర హోం మంత్రి అమిత్‌షా ప్రస్తావించడం తీవ్ర వివాదానికి దారి తీసింది. దీనిని కాంగ్రెస్ నేతలు ఎన్నికల్లో ప్రచారాస్త్రంగాను ఉపయోగించుకున్నారు. ప్రస్తుతం రెండు మెట్రో స్టేషన్‌లలో అమూల్ స్టాళ్లు తెరిచేందుకు అవకాశం ఇచ్చారు.
ఇదే విషయమై డీసీఎం డీకే శివకుమార్(DCM DK Shivakumar) బుధవారం బెంగళూరులో మీడియాతో మాట్లాడుతూ 10 మెట్రో స్టేషన్‌ల్లో పాల ఉత్పత్తులకు అనుమతులు ఇచ్చామని, 8 చోట్ల నందిని, 2 చోట్ల అమూల్ స్టాళ్లు ఏర్పాటవుతాయన్నారు. గ్లోబల్ టెండర్లలో వారికి అవకాశం దక్కిందన్నారు. స్టాళ్లు మూయించడం సరికాదన్నారు. గ్రేటర్ బెంగళూరు అథారిటీలో ఎన్ని పాలికెలు ఏర్పాటు చేయాలనేది కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో చర్చించామని, ప్రతిపక్ష నాయకులతో చర్చించాక తుదినిర్ణయం తీసుకుంటామన్నారు. స్వచ్ఛబెంగళూరు కార్యక్రమానికి హెల్ప్‌లైన్ తెరుస్తామన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి.
విదేశాల్లో ఉద్యోగాల పేరిట మోసం
ఈ నెలాఖరులోపు బకాయిలు చెల్లించాల్సిందే
Read Latest Telangana News and National News
Updated Date - Jun 19 , 2025 | 01:50 PM