ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Aircraft Window Shades: పాక్ సరిహద్దుల్లో విండోషేడ్స్ మూసి ఉంచాలి.. కీలక ఆదేశాలు

ABN, Publish Date - May 24 , 2025 | 05:12 PM

విమానాలు 10 వేల అడుగుల పైకి వెళ్లేంత వరకూ, ల్యాండింగ్ సమయంలో అంతే ఎత్తుకు దిగిన తర్వాత ఈ నిబంధన వర్తిస్తుందని, ఎమర్జెన్సీ ఎగ్జిట్ కిటికీల మాత్రం ఈ నిబంధన వర్తించదని డీజీసీఏ ఆ ఆదేశాల్లో పేర్కొంది.

న్యూఢిల్లీ: రక్షణ శాఖ వైమానిక స్థావరాల్లో, మరీ ముఖ్యంగా పాక్‌తో సరిహద్దు ఉన్న పశ్చిమ భారత సరిహద్దుల వద్ద విమానాల టేకాఫ్, ల్యాండింగ్ సమయంలో విండో షేడ్స్‌ (Window Shades)ను మూసివేయాలని వాణిజ్య విమానాలకు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) శనివారంనాడు కీలక ఆదేశాలు జారీ చేసింది. కిటికీలను వస్త్రంతో మూసి ఉంచటాన్ని విండో షేడ్స్ మూసి వేయడంగా వ్యవహరిస్తారు.

Gujarat ATS: పాక్‌కు భారత రక్షణ రహస్యాలు చేరవేత.. అరెస్ట్


విమానాలు 10 వేల అడుగుల పైకి వెళ్లేంత వరకూ, ల్యాండింగ్ సమయంలో అంతే ఎత్తుకు దిగిన తర్వాత ఈ నిబంధన వర్తిస్తుందని, ఎమర్జెన్సీ ఎగ్జిట్ కిటికీలకు మాత్రం ఈ నిబంధన వర్తించదని డీజీసీఏ ఆ ఆదేశాల్లో పేర్కొంది. విమానాల్లో రాకపోకలు సాగించే సమయంలో సైనిక స్థావరాల వద్ద ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీపై ఉన్న నిషేధం గురించి ప్రయాణికులను అప్రమత్తం చేయాలని కూడా డీజీసీఏ కోరింది. సెక్యూరిటీ ప్రోటోకాల్ దృష్ట్యా ఈ చర్యలు అనివార్యమని, వీటిని ఉ్లలంఘిస్తే ఎదుర్కోవాల్సిన లీగల్ చర్యల గురించి కూడా ప్రయాణికులకు వివరాలించాలని విమానయాన సంస్థల నిర్వాహకులకు స్పష్టం చేసింది.


డిఫెన్స్ ఎయిర్‌పోర్ట్‌ల నుంచి ఆపరేట్ చేస్తున్నప్పుడు సిబ్బంది భద్రత, సెక్యూరిటీ రిస్క్‌‌పై స్టాంటర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్‌‌ను అమలు చేయాలని ఆపరేటర్లకు డీజీసీఏ సూచించింది. ఆపరేషన్ సేఫ్టీతో పాటు ప్రయాణికులు తమకు తెలియకుండానే రక్షణ పరమైన సమాచారాన్ని షేర్ చేయకుండా నిరోధించేందుకు తాజా చర్యలు ఉపకరిస్తాయని పేర్కొంది. ముఖ్యంగా లెహ్, శ్రీనగర్, జమ్మూ, పఠాన్‌కోట్, ఆదంపూర్, చండీగఢ్, బఠిండా, జైసల్మేర్, నల్, జోథ్‌పూర్, హిండన్, ఆగ్రా, కాన్పూర్, బరేలి, మహరాజ్‌పూర్, గోరఖ్‌పూర్, భుజ్, లొహెగావ్, గోవా (డాబోలిమ్), వైజాగ్‌లోని విమానాశ్రయాలు కచ్చితంగా ఈ ఆదేశాలను పాటించాల్సి ఉంటుందని తెలిపింది.


ఇండియా, పాక్ ఉద్రిక్తతల నడుమ పలు సెన్సిటివ్ ఎయిర్ బేస్‌లతో సహా నార్త్, సెంట్రల్, వెస్ట్రన్ ఇండియాలోని 32 విమానాశ్రయాలను ఇటీవల కొద్దికాలం మూసి ఉంచారు. అయితే ఇప్పుడు ఫ్లయిట్ ఆపరేషన్లు పునరుద్ధరించినప్పటికీ భద్రతా ఆందోళనలు కొనసాగుతున్నాయి.


ఇవి కూడా చదవండి..

Covid 19 Cases in India: ఢిల్లీ, ముంబైలో కోవిడ్ కేసులు.. ఆసుపత్రుల్లో హైఅలర్ట్

Rains: రెండు జిల్లాలకు రెడ్‌ అలర్ట్‌.. రేపు, ఎల్లుండి పొంచివున్న ముప్పు

Karnataka: జైలు నుంచి విడుదలయ్యాక ఊరేగింపు.. కర్ణాటక అత్యాచార నిందితుల అరెస్టు

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - May 24 , 2025 | 05:18 PM