Relationship Tips: ఈ కారణాల వల్లే భార్యలు భర్తలను మోసగిస్తారు..
ABN, Publish Date - May 24 , 2025 | 02:15 PM
Why Women Cheats in Relationship: ఒకప్పుడు వరకట్న వేధింపులు, భార్యలను మోసం చేసిన భర్తలు లాంటి వార్తలు ఎక్కువగా వినిపించేవి. కానీ, ఇటీవల ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన భార్య అనే తరహా వార్తలు విపరీతంగా హల్‌చల్ చేస్తున్నాయి. అసలు, ఇలాంటి తరహా మనస్తత్వం మహిళల్లో ఎందుకు పెరుగుతోంది అంటే కారణాలివే అంటున్నారు సైకాలజిస్టులు.
Reasons Why Women Cheats in Relationships: మీ భాగస్వామి మిమ్మల్ని మోసం చేస్తున్నారని తెలిస్తే అది పీడకల కంటే తక్కువ కాదు. రిలేషన్‌షిప్‌లో ఉన్నప్పుడు పార్ట్‌నర్ పట్ల నమ్మకం చెదిరిపోతే ఆ బంధం పాడైనట్లే లెక్క. అలాంటి పరిస్థితి ఎదురైతే ఎంతటి వారైనా సరే. సంబంధాన్ని కొనసాగించాలని మనసులో ఉన్నా ముందుకు అడుగేయలేరు. అది వారికి అసాధ్యంగానే అనిపిస్తుంది. ఇదిలా ఉంటే, ఇటీవల భర్తలను మోసం లేదా హత్య చేసే భార్యల సంఖ్య పెరిగిపోతోంది. మహిళల్లో ఈ ధోరణికి కారణంగా ఈ కింది వాటిలో ఏవైనా కావచ్చని పలు సర్వేలు విశ్లేషిస్తున్నాయి.
అమెరికాలోని చికాగో విశ్వవిద్యాలయంలోని నేషనల్ ఒపీనియన్ రీసెర్చ్ సెంటర్ (NORC) 2022 గ్లోబల్ సోషల్ సర్వే (GSS)లో కొన్ని షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. ఈ సర్వేలో, 20 శాతం మంది పురుషులు, 13 శాతం మంది మహిళలు తమ జీవిత భాగస్వాములను మోసం చేసినట్లు అంగీకరించారు. ఇదే కాకుండా, బ్రిటిష్ పరిశోధన, డేటా విశ్లేషణ సంస్థ YouGov 1,000 కంటే ఎక్కువ మంది వివాహితలపై నిర్వహించిన సర్వేలోనూ ఇలాంటి ఫలితాలే వెలువడ్డాయి.
గత కొన్ని దశాబ్దాలుగా వివాహేతర సంబంధం పెట్టుకునే స్త్రీల సంఖ్య క్రమంగా పెరిగింది. 2010లో జరిగిన ఓ సర్వేలో భార్యలు భర్తలను మోసం చేసే ధోరణి 40 శాతం ఉన్నట్లు వెల్లడైంది. ఇక మహిళలు ఎందుకు మోసం చేస్తారు? ఈ ప్రశ్నకు సమాధానాలు ఇవే అంటున్నారు మానసిక నిపుణులు.
ఒంటరితనం
స్త్రీలు పురుషుల కంటే ఎక్కువగా భావోద్వేగానికి లోనవుతారు. భాగస్వామి సఖ్యతగా లేకపోయినా లేదా భావోద్వేగపరంగా విడిపోయినా ఒంటరి అయిపోయినట్లు, జీవితంలో అన్నీ కోల్పోయినట్లు భావిస్తారు. మరొక వ్యక్తితో భావోద్వేగ, ప్రేమ సంబంధాల గురించి ఊహించుకోవడం ప్రారంభిస్తారు. అనేక విభిన్న పరిస్థితుల వల్ల మహిళల్లో ఈ రకమైన భావన తలెత్తవచ్చు. జీవిత భాగస్వామి అనారోగ్యం పాలవడం, ఎక్కువ గంటలు పనిలో బిజీగా ఉంటూ ఇంటికి దూరంగా ఉండటం, మానసికంగా దగ్గరగా ఉండకపోవడం, పదే పదే నిందించడం, ద్వేషభావాన్ని వెళ్లగక్కడం ఇలా అనేక కారణాలు ఈ సమస్యకు కారణం కావచ్చు.
ఆత్మగౌరవం
తన ఆత్మగౌరవానికి భంగం కలిగించేలా భాగస్వామి ప్రవర్తిస్తూ ఉంటే ఆమె మానసికంగా మరింత కఠినంగా మారవచ్చు. కొన్నిసార్లు ప్రేమకు తాను అనర్హురాలినని తనను తాను నిందించుకుంటుంది. విసుగు, కొత్త జీవితం ఏర్పరచుకోవాలనే కోరిక కలుగుతుంది. అప్పుడు తన పట్ల శ్రద్ధ, గౌరవం కనబరిచే బయటి వ్యక్తుల వైపు ఆకర్షితులు అయ్యే ఛాన్సుంది.
భావోద్వేగ నిర్లక్ష్యం
తమ భావోద్వేగ అవసరాలను తీర్చుకోవడానికే ఎక్కువమంది మహిళలు తమ భాగస్వాములను మోసం చేస్తున్నారని అధ్యయనాలు చెబుతున్నాయి. ఆ సంబంధం శారీరకమైనా లేదా భావోద్వేగమైనా స్త్రీ తన ప్రస్తుత సంబంధం నుండి పొందలేని సంభాషణ, సానుభూతి, గౌరవం, ప్రశంస, మద్దతును ఎదుటి వ్యక్తి నుండి కోరుకుంటుంది.
కోపం లేదా పగ
కొంతమంది మహిళలు తమ భాగస్వామితో ఆదర్శవంతమైన జీవితం గడపాలని ఆకాంక్షిస్తారు. కానీ భాగస్వామి వారి అంచనాలకు తగ్గట్టుగా నడుచుకోనప్పుడు, అవసరాలు, కోరికలు తీర్చలేనప్పుడు మహిళల్లో అసహనం పెరిగిపోతుంది. అది కోపం లేదా పగగా మారి సంబంధాన్ని బీటలు వారుస్తుంది. ఇది కాకుండా, కొంతమంది తమ గత సంబంధం వంటి ఇతర కారణాల వల్ల కూడా భాగస్వామిపై కోపంగా ఉండవచ్చు ప్రతీకారంగా తమను తాము మోసం చేసుకోవడం ప్రారంభిస్తారు.
శారీరక సాన్నిహిత్యం లేకపోవడం
శారీరక సాన్నిహిత్యం తగ్గడం వల్ల స్త్రీలు భాగస్వామితో డిస్ కనెక్ట్ అయినట్లు భావిస్తారు. దీర్ఘకాలిక సంబంధాలలో ఏర్పడే శూన్యత తమను తాము కోల్పోతున్నామనే భావన పెంచుతుంది. తోడు కోసం ఆరాటపడేలా చేసి వేరే వ్యక్తితో బంధం పెంచుకునేలా ప్రేరేపిస్తుంది.
విలువ
ప్రతి ఒక్కరూ ప్రశంసించబడాలని కోరుకుంటారు. భాగస్వామి వల్ల ఆత్మగౌరవం దెబ్బతిందని అనిపించినప్పుడు కొంతమంది మహిళలు ఇతరుల నుంచి ప్రశంసలు, గుర్తింపు కోరుకోవచ్చు. వారి ప్రాథమిక సంబంధంలో పొందలేని భరోసా ఇతరులు కల్పించినపుడు తెలియకుండానే అక్రమ సంబంధాల వైపు అడుగులేస్తారు.
ఇండిపెండెన్స్
పెరుగుతున్న ఆర్థిక, సామాజిక స్వతంత్రత కారణంగా మహిళలకు మునుపటి తరాల కంటే ఎక్కువ స్వేచ్ఛ లభిస్తుంది. అవసరాలు తీరని పక్షంలో వారి స్వంత ఎంపికలు చేసుకునేందుకు వెనుకాడటం లేదు. భాగస్వామితో ఎప్పుడు కావాలంటే అప్పుడు సంబంధం తెంచుకుని మరో బంధం కోసం అన్వేషించేందుకు సిద్ధపడుతున్నారు. కొన్ని సార్లు భాగస్వామికి తెలియకుండా రహస్య బంధాలను కొనసాగించేవారూ ఉన్నారు.
విసుగు లేదా స్తబ్దత
భాగస్వామితో ఒకప్పుడు ఉన్న బంధం రొటీన్ దినచర్య వల్ల బోరింగ్ గా అనిపించవచ్చు. జీవితంలో ఉత్సాహం కొరవడినప్పుడు విసుగు స్తబ్ధత, పెరిగిపోతాయి. పురుషులు పెళ్లయిన కొన్నాళ్ల తర్వాత రోజూ కనిపించేవారే అనే తరహాలో చాలామంది పురుషులు భార్యల పట్ల నిర్లక్ష్యం వహిస్తుంటారు. ఇలాంటి పరిస్థితుల్లో జీవితంలో నూతనోత్సాహం నింపుకోవాలనే ఆశతో అభిరుచికి దగ్గరగా ఉన్నవారు ఎవరైనా తారసపడితే లేదా అలాంటి వారికోసం శోధించే అవకాశముంటుంది.
ఇవీ చదవండి:
పేరులో పండు ఉన్నా టమోటాను కూరగాయ అనే ఎందుకంటారు..
రోజూ అలారం పెట్టుకునే అలవాటుందా... దీని వల్ల ఎంత
మరిన్ని హెల్త్, లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - May 24 , 2025 | 02:49 PM