Share News

Alaram Effects: రోజూ అలారం పెట్టుకునే అలవాటుందా... దీని వల్ల ఎంత ప్రమాదమో తెలుసా..

ABN , Publish Date - May 22 , 2025 | 02:44 PM

Alaram Effects On Health: ఉదయాన్నే సమయానికి నిద్రలేవాలని దాదాపు అందరూ రోజూ అలారం పెడుతుంటారు. కానీ, ఈ కారణం వల్ల మీ ఆరోగ్యం దెబ్బతింటుందంటే మీరు నమ్మగలరా? అవును. అలారం శబ్దం విని నిద్రలేచేవారికి ఈ ప్రమాదకరమైన ఆరోగ్య సమస్య వచ్చే ప్రమాదం రెట్టింపవుతుంది. శరీరంపై ప్రతికూల ప్రభావం పడి..

Alaram Effects: రోజూ అలారం పెట్టుకునే అలవాటుందా... దీని వల్ల ఎంత ప్రమాదమో తెలుసా..
Alaram Health Effects

Morning Alaram Blood Pressure Link: సాధారణంగా అందరికీ ఉదయాన్నే నిద్ర లేవడానికి అలారం పెట్టే అలవాటు ఉంటుంది. దాదాపు ప్రతి ఒక్కరూ పడుకునే ముందు మొబైల్ ఫోన్‌లో లేదా గడియారంలో అలారం సెట్ చేస్తుంటారు. కానీ ప్రతిరోజూ అలారం శబ్దం విని నిద్రలేవడం వల్ల మీ ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడుతుంది. అలారానికి, ఆరోగ్యానికి లింకేంటని ఆలోచిస్తున్నారా? వినటానికి ఆశ్చర్యంగా అనిపిస్తున్నా ఇది నిజం. గాఢ నిద్రలో ఉన్న వ్యక్తి అలారం మోగడం వల్ల అకస్మాత్తుగా మేల్కొంటే ఈ దీర్ఘకాలిక సమస్య మిమ్మల్ని జీవితాంతం వెంటాడుతుంది.


అలారంతో ఈ ప్రమాదం?

వర్జీనియా విశ్వవిద్యాలయం చేసిన అధ్యయనం ప్రకారం, ప్రతి ఉదయం అలారంతో మేల్కొనే వారిలో 74 శాతం మంది అధిక రక్తపోటుతో బాధపడుతున్నారు. అదే విశ్వవిద్యాలయం చేసిన మరో అధ్యయనంలో అలారం లేకుండా సహజంగా మేల్కొనే వారికి రక్తపోటు వంటి సమస్యలు తక్కువగా ఉంటాయని తేలింది. మీరు అకస్మాత్తుగా అలారం శబ్దం ద్వారా మేల్కున్నప్పుడు శరీరం అడ్రినలిన్ వంటి ఒత్తిడి హార్మోన్లను విడుదల చేస్తుంది. ఇది మీ హృదయ స్పందన రేటును పెంచుతుంది. ఇది తాత్కాలికంగా రక్తపోటును పెంచుతుంది. దీనిని సాధారణంగా మార్నింగ్ హైపర్‌టెన్షన్ అంటారు.


రోజూ అలారం పెట్టుకుంటే ఏమవుతుంది?

తాత్కాలిక అధిక రక్తపోటు సాధారణంగా అంత ప్రమాదకరం కాదని భావించినప్పటికీ అది ప్రతిరోజూ పునరావృతమైతే అది మరింత ప్రమాదకరమని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అధ్యయనాల ప్రకారం, ఉదయం పూట అధిక రక్తపోటు గుండెపోటు మరియు స్ట్రోక్‌కు దారితీస్తుంది. ఇది ఇప్పటికే గుండె జబ్బులతో బాధపడుతున్న వారికి తీవ్రమైన ఆరోగ్య సమస్యలను కూడా కలిగిస్తుంది.


ప్రమాదాన్ని నివారించడానికి ఏమి చేయాలి?

ప్రతిరోజూ వీలైనంత త్వరగా పడుకుని మేల్కొనేందుకు ప్రయత్నించండి. కచ్చితంగా కనీసం రోజుకు 7-8 గంటల నిద్రపోయేందుకు ప్రయత్నించండి. ఇలా చేయడం వల్ల మీ శరీరంలో బీపీ హెచ్చుతగ్గులు రావు. మీరు కచ్చితంగా అలారం కావాలి అనుకుంటే సాధ్యమైనంత వరకూ ప్రశాంతమైన అలారం సౌండ్ ను ఎంచుకోండి. అలాగే ఉదయాన్నే బాగా వెలుతురు తగిలే ప్రదేశంలో పడుకోవడం వల్ల సూర్యకిరణాలు తాకి ఆటోమేటిగ్గా మేల్కొంటారు. కాబట్టి అలారం అవసరమే రాదు. ప్రతిరోజూ ఒకే సమయానికి పడుకోవడం, మేల్కొనడం వల్ల కూడా బాగా నిద్రపోతారు. అలారం అవసరమూ రాదు.


ఈ వార్తలు కూడా చదవండి..

పొడవు జుట్టు కావాలా.. చర్మం మెరిసిపోవాలా.. అయితే ఈ విటమిన్ రోజూ తప్పక తీసుకోండి..

డైలీ 1 లేదా 2 పెగ్గులు తాగడం మంచిదేనా.. డాక్టర్లు ఏమంటున్నారు..

జుట్టు నెరవడాన్ని అడ్డుకోవాలంటే ఈ ఫుడ్స్ తినడం తప్పనిసరి

Read Latest Health News And Telugu News

Updated Date - May 22 , 2025 | 02:57 PM