Share News

Alcohol: డైలీ 1 లేదా 2 పెగ్గులు తాగడం మంచిదేనా.. డాక్టర్లు ఏమంటున్నారు..

ABN , Publish Date - May 22 , 2025 | 01:32 PM

Safe Alcohol Consumption: మద్యపానం అలవాటు ఆరోగ్యానికి మంచిది కాదని అందరికీ తెలుసు. కానీ, డైలీ ఒకటి లేదా రెండు పెగ్గుల ఆల్కహాల్ ఆరోగ్యానికి చాలా మంచిదని మందుబాబులు వాదిస్తుంటారు. ఇంతకీ, రోజుకి ఎంత మద్యం తాగితే సురక్షితం? డాక్టర్లు ఏమని సూచిస్తున్నారు?

Alcohol: డైలీ 1 లేదా 2 పెగ్గులు తాగడం మంచిదేనా.. డాక్టర్లు ఏమంటున్నారు..
Daily Alcohol Consumption Limits

Daily Alcohol Consumption Limits: ఏ రకమైన వ్యసనమైనా ఆరోగ్యానికి హానికరం. అయినప్పటికీ, మద్యపానం, ధూమపానం, గుట్కా వంటి వాటికి బానిసలైన వారు తమను తాము సమర్థించుకోవడానికి ఏదో ఒక సాకును చెబుతూ ఉంటారు. అదేవిధంగా క్రమం తప్పకుండా లేదా అప్పుడప్పుడు ఆల్కహాల్ తాగే వ్యక్తులు కూడా రోజూ ఒకటి లేదా రెండు పెగ్గులేస్తే ఆరోగ్యానికి మంచిదని వాదించడం తరచుగా వినే ఉంటారు. చాలా మంది రెడ్ వైన్ ను ఆరోగ్యకరమైన డ్రింక్‌గా భావిస్తారు. దానివల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని బలంగా నమ్ముతారు. ఇంతకీ, డైలీ ఎంత ఆల్కహాల్ తాగితే సేఫ్? కొంచెం మద్యం తాగినా ఆరోగ్యానికి ప్రమాదకరం అనే వాదనలో నిజమెంత?


ఎందులో ఆల్కహాల్ కంటెంట్ ఎక్కువ?

  • బీర్: 12 oz (ఔన్సులు) లేదా 355 ml బీరులో 5% ఆల్కహాల్‌

  • వైన్: 5 oz (ఔన్సులు) లేదా 150 ml వైన్ లో 12% ఆల్కహాల్

  • స్పిరిట్స్: 1.5 oz (ఔన్సులు) లేదా 45 ml స్పిరిట్స్ లో 40% ఆల్కహాల్


ఆల్కహాల్ వినియోగంపై సూచనలు

పురుషులు లేదా మహిళలు ఎవరైనా రోజుకు 1 గ్లాస్ లేదా అంతకంటే తక్కువే తాగాలి. యూకే గైడ్ లైన్స్ ప్రకారం వారానికి మూడు రోజులకు మించి తాగకూడదు. వారంలో 14 యూనిట్ల ఆల్కహాల్ (యూనిట్ కు 10 లేదా 8 మిల్లీ లీటర్లు.) కు మించి తాగితే ప్రమాదకరం.


ఏ మద్యం తాగడం సురక్షితం?

ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం ఆడామగా తేడా లేకుండా చాలామంది బీర్, వైన్ లేదా మత్తుపానీయాల పట్ల ఆకర్షితులవుతున్నారు. వేడుకల్లో మద్యం తాగడం ఇప్పుడు ట్రెండ్‌గా మారిపోయింది. కొందరు సరదాగా వీకెండ్స్‌, పార్టీలు, ఫంక్షన్లు వంటి సందర్భాల్లో తాగడానికి ఇష్టపడితే, మరికొందరు క్రమం తప్పకుండా డైలీ మద్యం షాపుల ముందు హాజరవుతుంటారు. రోజూ రెండు, మూడు పెగ్గులేస్తే చాలా మంచిదని వాదిస్తుంటారు. అయితే, WHO(ప్రపంచ ఆరోగ్య సంస్థ) మందుబాబులకు షాకింగ్ న్యూస్ చెప్పింది. మద్యం కొంచెమైనా లేదా ఎక్కువైనా.. ఏ రకమైనా సరే. ఎంత పరిమాణంలో తీసుకున్నా హానికరమేనని తేల్చింది. ఆరోగ్యకరమైన ఆల్కహాల్ అంటూ ఏదీ ఉండదని స్పష్టం చేసింది. ఆనందం కోసం అప్పుడప్పుడు మద్యం తాగడం అనేది వ్యక్తిగత ఛాయిస్ అని.. కానీ, ఏదో ప్రయోజనం వస్తుందని, ఒత్తిడి తగ్గి హాయిగా నిద్రపడుతుందనే భ్రమతో ఆల్కహాల్ అలవాటు చేసుకుంటే మాత్రం తీవ్ర దుష్పరిణామాలు తప్పవని హెచ్చరిస్తోంది.


కొంచెం మద్యం తాగవచ్చా?

అది ఎలాంటి ఆల్కహాల్ అయినా.. ఎక్కువ లేదా తక్కువ తాగినా దాని వల్ల ఆరోగ్యానికి ఎటువంటి ప్రయోజనాలు ఉండవని వైద్యులు అంటున్నారు. మీరు కొద్దిగా మద్యం తాగినా అది మీ గుండెను బలహీనపరుస్తుంది. ఇది రక్తపోటును పెంచుతుంది. ఫ్యాటీ లివర్ కు కారణమవుతుంది. లివర్ సిర్రోసిస్, లివర్ ట్రాన్స్ ప్లాంటేషన్ వంటి తీవ్రమైన పరిస్థితులకు దారితీస్తుంది. ఒక్కసారి మద్యానికి బానిసైతే మానసిక ఆందోళనలు, ఒత్తిడి , డిప్రెషన్ వంటి సమస్యలు తలెత్తుతాయి. అతిగా తాగేవారికి శరీరం, మెదడుపై అదుపు తప్పుతుంది. మందు బాబులే ప్రపంచవ్యాప్తంగా యాక్సిడెంట్లకు కారణమవుతున్నారు. కాబట్టి, ఫ్రెండ్స్, కొలీగ్స్ సరదాగా ఒక పెగ్గు వేయమని బలవంతం చేసినా కచ్చితంగా నో చెప్పండి.


వీళ్లు అస్సలు తాగవద్దు?

గర్భిణీ స్త్రీలు, ప్యాంక్రియాటైటిస్ లేదా కొన్ని జీవక్రియ రుగ్మతలు, కాలేయ వ్యాధులు, డయాబెటిస్ ఉన్నవారు, 21 సంవత్సరాల కంటే తక్కువ ఉన్న వ్యక్తులు, గుండె సంబంధిత సమస్యలు ఉన్నవారు ఆల్కహాల్ అస్సలు సేవించకూడదు.


ఈ వార్తలు కూడా చదవండి..

పొడవు జుట్టు కావాలా.. చర్మం మెరిసిపోవాలా.. అయితే ఈ విటమిన్ రోజూ తప్పక తీసుకోండి..

ఎండలో రోజూ 10 నిమిషాలు నిలబడితే సమృద్ధిగా విటమిన్ సీ

జుట్టు నెరవడాన్ని అడ్డుకోవాలంటే ఈ ఫుడ్స్ తినడం తప్పనిసరి

Read Latest Health News And Telugu News

Updated Date - May 22 , 2025 | 02:27 PM