Share News

Sunlight vs Vitamin D Supplements: ఎండలో రోజూ 10 నిమిషాలు నిలబడితే సమృద్ధిగా విటమిన్ సీ

ABN , Publish Date - May 22 , 2025 | 10:08 AM

రోజూ పది నిమిషాల పాటు ఎండలో నిలబడితే శరీరానికి తిగినంత విటమిన్ డీ లభిస్తుందా? ఈ ప్రశ్నకు వైద్యులు చెప్పే సమాధానం ఏంటంటే..

Sunlight vs Vitamin D Supplements: ఎండలో రోజూ 10 నిమిషాలు నిలబడితే సమృద్ధిగా విటమిన్ సీ
vitamin D from sunlight

ఇంటర్నెట్ డెస్క్: ఆరోగ్యానికి విటమిన్ డీ ఎంత అవసరమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సూర్యరశ్మితో పాటు పోషకాల ద్వారా శరీరానికి విటమిన్ డీ అందుతుంది. అయితే, ఎండ ఎక్కువగా ఉండే భారత్‌ లాంటి దేశాల్లో కూడా విటమిన్ డీ లోపంతో సతమతమయ్యే వారు ఉన్నారంటే కొంత ఆశ్చర్యమే. ఎక్కువ సేపు గదుల్లోనే ఉండిపోవడం, ఏసీ వినియోగం పెరగడం వంటి వాటి కారణంగా ఈ సమస్య తలెత్తుతోంది. ఇలా తలెత్తే విటమిన్ డీ లోపాన్ని సప్లిమెంట్స్‌తో భర్తీ చేయొచ్చా లేక ఎండలో నిలబడి లోపాన్ని సరిచేసుకోవాలా అనే సందేహం చాలా మందికి కలుగుతుంటుంది.

సూర్యరశ్మి చర్మంలో విటమిన్ డీ ఉత్పత్తిని ప్రేరేపిస్తుందని వైద్యులు చెబుతున్నారు. చర్మ కణాలు యూవీబీ కాంతి తరంగాల సాయంతో కొలెటెస్టరాల్‌ను పోలిన రసాయనాలను విటమిన్ డీ3గా మారుస్తాయి. దీన్ని కిడ్నీలు, లివర్ క్రియాశీలక విటమిన్ డీ మారుస్తాయి. ఇది సహజసిద్ధమైన ప్రక్రియ.


ఇలా సహజసిద్ధ పద్ధతిలో విటమిన్ డీ సమకూర్చుకునేందుకు 10 నిమిషాల పాటు రోజూ ఎండలో నిలబడితే చాలా అనే ప్రశ్నకు జవాబు సంక్లిష్ఠమైనదని నిపుణులు చెబుతున్నారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 మధ్య సూర్యరశ్మి తీక్షణత ఎక్కువగా ఉంటుంది. ఈ సమయాల్లో ఎండలో నిలబడితే మంచిది. కొందరికి ఇలా 10 నిమిషాలు నిలబడితే సరిపోతుంది. ముదురు చర్మ రంగు ఉన్న వారికి మాత్రం ఈ సమయం సరిపోదు.

ఇలాంటి వారు విటమిన్ డీ లోపాన్ని అధిగమించేందుకు సప్లిమెంట్స్ తీసుకోవడం అవసరమని నిపుణులు చెబుతున్నారు. సూర్యరశ్మి ద్వారా అందని విటమిన్ డీని సప్లిమెంట్స్ ద్వారా భర్తీ చేసుకోవచ్చని అంటున్నారు. వాయుకాలుష్యం, వానలు, వాతావరణ మార్పులు తదితర సమయాల్లో ఎండలో నిలబడటం సాధ్యం కానప్పుడు కూడా సప్లిమెంట్స్ అక్కరకు వస్తాయని అంటున్నారు.


కాబట్టి, ఎండలో రోజూ 10 నిమిషాలు పాటు నిలబడినంత మాత్రాన విటమిన్ డీ అవసరాలు తీరిపోతాయన్న భరోసా వద్దని నిపుణులు చెబుతున్నారు. వయసు, చర్మంలో పిగ్మెంటేషన్, ఏ ప్రాంతంలో ఉన్నాము. వాయుకాలుష్యం వంటివన్నీ సూర్యరశ్మి ప్రభావాన్ని తగ్గిస్తాయని చెబుతున్నారు. అయితే, సప్లిమెంట్స్ తీసుకునే ముందు కచ్చితంగా వైద్యులను సంప్రదించాలని నిపుణులు చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి:

40 ఏళ్లు దాటిన పురుషులు తప్పనిసరిగా చేయించుకోవాల్సిన పరీక్షలు ఇవే

స్మార్ట్ ఫోన్‌తో బీపీ చెక్ చేసుకునే అవకాశం ఉందా.. వైద్యులు ఏం చెబుతున్నారంటే..

40ల్లో ఉన్న మహిళలు తప్పనిసరిగా తీసుకోవాల్సిన జాగ్రత్త ఇది

Read Latest and Health News

Updated Date - May 22 , 2025 | 10:08 AM