ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Travel Tips: వర్షకాలంలో ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా.. తప్పనిసరిగా ఈ వస్తువులు తీసుకెళ్లండి..

ABN, Publish Date - Jun 11 , 2025 | 01:02 PM

వర్షాకాలంలో సరదాగా మీ భాగస్వామితో కలిసి ఎక్కడికైన వెళ్లాలని అనుకుంటున్నారా? అయితే, ప్రయాణం చేసేటప్పుడు తప్పనిసరిగా ఈ వస్తువులు తీసుకెళ్లండి.

Couples

Travel Tips: వర్షంలో మరింత అందంగా కనిపించే ప్రాంతాలను చూడటానికి మీ భాగస్వామితో కలిసి ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? వర్షం పడుతుంటే బయటకు వెళ్లడం, అది కూడా జీవిత భాగస్వామితో కలిసి వెళ్లడం చాలా రొమాంటిక్‌గా ఉంటుంది. కానీ వర్షంలో ప్రయాణం చేయాలంటే కొన్ని సమస్యలు కూడా ఉంటాయి. వర్షం అనేది ఒక అందమైన అనుభూతి. కానీ చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటేనే మీరు హ్యాపీగా ఎంజాయ్ చేయగలరు. ఎలాంటి ఇబ్బందులు ఎదురవకుండా ఉండాలంటే కొన్ని ముఖ్యమైన వస్తువులను తీసుకెళ్లడం మంచిది. ఈ వస్తువులు తీసుకెళ్తే వర్షంలో కూడా మీరు మంచి జ్ఞాపకాలను పొందుతారు. ఆ ముఖ్యమైన వస్తువులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

అదనపు బట్టలు తీసుకెళ్లండి

వర్షాకాలంలో బయట తిరగాలంటే తడవడం చాలా సాధారణం. కనుక సాధారణంగా తీసుకెళ్లే బట్టలతో పాటు 2–3 జతల అదనపు బట్టలు కూడా మీ బ్యాగులో పెట్టుకుంటే బాగుంటుంది. వర్షంలో తడిచినా కూడా బట్టలు మార్చుకోవచ్చు. అప్పుడు ఎలాంటి ఇబ్బంది ఉండదు.

రెయిన్ కోట్, గొడుగు మర్చిపోవద్దు

తేలికపాటి వర్షంలో నడవడం చాలా బాగుంటుంది. కానీ అనుకోని సమయంలో కుండపోత వర్షం పడితే అసౌకర్యంగా ఉంటుంది. కనుక తప్పకుండా రెయిన్ కోట్ లేదా గొడుగు మీ బ్యాగులో ఉంచుకోండి.

వాటర్‌ప్రూఫ్ ఫుట్‌వేర్

వర్షాకాలంలో సాధారణ బూట్లు ధరిస్తే అవి తడిసి, పాదాలకి ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశముంది. కాబట్టి, వర్షానికి తగ్గట్టు ఉండే రబ్బరు బూట్లు లేదా స్లిప్పర్లు వాడడం మంచిది.

ముందుగా వాతావరణ సమాచారం తెలుసుకోండి

ఎక్కడికైనా వెళ్లే ముందు అక్కడి వాతావరణ పరిస్థితిని తెలుసుకోవడం ముఖ్యం. వర్ష సూచన ఉన్నచోట్లకు వెళ్లితే, అక్కడ చిక్కుకుపోయే అవకాశం ఉంటుంది. కనుక ముందే వాతావరణ సమాచారాన్ని తెలుసుకుని ట్రిప్ ప్లాన్ చేసుకోండి.

Also Read:

డయాబెటిస్‌‌తో బాధపడుతున్నారా.. ఈ 6 పానీయాలను అస్సలు తాగకండి..

ఉదయాన్నే ఇవి తింటున్నారా.. జాగ్రత్త..

For More Lifestyle News

Updated Date - Jun 11 , 2025 | 04:24 PM