Share News

Morning Tips: ఉదయాన్నే ఇవి తింటున్నారా.. జాగ్రత్త..

ABN , Publish Date - Jun 11 , 2025 | 10:44 AM

మీరు ఉదయాన్నే ఈ అల్పాహారాలు తింటున్నారా? అయితే, జాగ్రత్తగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు. ఇవి మీ ఆరోగ్యాన్ని దెబ్బతీయవచ్చని అంటున్నారు.

Morning Tips: ఉదయాన్నే ఇవి తింటున్నారా.. జాగ్రత్త..
Bread

Morning Tips: ఉదయాన్నే అల్పాహారం తినడం ఆరోగ్యానికి చాలా ముఖ్యం. ఆరోగ్యకరమైన అల్పాహారంతో మీ రోజును ప్రారంభించాలి. సరైన పోషకాలు లేని అల్పాహారం తీసుకుంటే రోజంతా అలసటగా ఉంటుంది. ఆరోగ్యంపై చెడు ప్రభావం పడుతుంది. కాబట్టి, అల్పాహారంను సమతుల్యంగా ఎంచుకోవాలి. అలా కాకుండా ఉదయాన్నే వీటిని తింటే ఆరోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..


పాలతో తృణధాన్యాలు

చాలా మంది పాలలో తృణధాన్యాలు వేసుకోని తింటుంటారు. వీటిని ఆరోగ్యానికి మంచివిగా భావిస్తారు. కానీ ఇలా తినడం మంచిది కాదు. ఎందుకంటే తృణధాన్యాలలో చక్కెర ఉంటుంది. ఇది శరీరంలో చక్కెర స్థాయిని ఒక్కసారిగా పెంచేస్తుంది. దీని వల్ల త్వరగా ఆకలేస్తుంది, అంతే కాదు దీర్ఘకాలంలో మధుమేహం వచ్చే ప్రమాదం కూడా ఉంటుంది.

బ్రెడ్

చాలామంది బ్రెడ్ మంచిదని అల్పాహారంగా దీనిని తీసుకుంటుంటారు. కానీ, ఇది జీర్ణ సమస్యలను తెస్తుంది. బ్రెడ్ ఎక్కువగా ప్రాసెస్ చేయబడిన కార్బోహైడ్రేట్ కాబట్టి ఇది కడుపులో గ్యాస్, మలబద్ధకం వంటి సమస్యలు తలెత్తేలా చేస్తుంది. పైగా దీన్ని తిన్న తర్వాత త్వరగా ఆకలేస్తుంది.


బాగెల్స్

బాగెల్స్ కూడా ప్రాసెస్ చేసిన పిండితో తయారవుతాయి. వీటిలో ఫైబర్ లేకపోవడంతో శరీరానికి అవసరమైన పోషకాలు అందవు. అల్పాహారంగా తింటే రక్తంలో చక్కెర మితిమీరినంతగా పెరగొచ్చు. దాంతో పాటు రోజంతా మళ్లీ మళ్లీ తినాలనిపిస్తుంది.

ఫ్రూట్ జ్యూస్

చాలా మంది అల్పాహారంగా ఫ్రూట్ జ్యూసులు తీసుకుంటారు. అయితే, చాలా పండ్ల రసాల్లో చక్కెర శాతం అధికంగా ఉంటుంది. పైగా, పండ్లను రసం చేసేటప్పుడు వాటిలో ఉండే ఫైబర్ పోతుంది. ఫైబర్ లేకపోతే, జ్యూస్ తాగిన వెంటనే రక్తంలో చక్కెర పెరుగుతుంది. దీని బదులు తాజా పండ్లు తినడం మంచిది.

ఆరోగ్యంగా అనిపించే ప్రతి అల్పాహారం నిజంగా మంచిదే అని అనుకోవద్దు. పోషకాలు సమతుల్యంగా ఉండేలా, జీర్ణశక్తికి అనుకూలంగా ఉండేలా అల్పాహారాన్ని ఎంచుకోవాలి. ఉదయం మీరు ఏమి తింటే అది మీ ఆరోగ్యాన్ని నిర్ధారిస్తుంది. కాబట్టి, జాగ్రత్తగా ఆలోచించి తినండి.


(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ABN ఆంధ్రజ్యోతి బాధ్యత వహించదు.)


Also Read:

పాలక్ పనీర్ కలిపి తింటున్నారా.. ఇక అంతే..

వయసు పెరిగినా కంటి చూపు తగ్గకుండా ఉండాలా.. ఈ చిట్కాలు పాటించండి

For More Health News

Updated Date - Jun 11 , 2025 | 11:29 AM