Oil Pulling Benefits: నోటి దుర్వాసన పోవాలంటే.. ఉదయాన్నే ఈ నూనెతో పుక్కిలించండి..
ABN, Publish Date - Apr 17 , 2025 | 04:20 PM
Oil Pulling Benefits At Morning: నోరు ఎంత శుభ్రం చేసుకున్నా కొంతమందికి దుర్వాసన సమస్య పోనే పోదు. ప్రతి ఉదయం నోటిని ఈ నూనెతో పుక్కిలించారంటే మాత్రం కచ్చితంగా మార్పు కనిపిస్తుంది. మరి, ఆయిల్ పుల్లింగ్ ఎలా చేస్తే ఫలితం ఉంటుంది.. కలిగే ప్రయోజనాలు గురించి వివరంగా..
Oil Pulling Benefits At Morning: సాధారణంగా ప్రతి ఒక్కరూ ఉదయం నీటితో నోటిని శుభ్రం చేసుకుంటారు. కానీ నీటికి బదులుగా నూనెతో పుక్కిలించడం ఎంత ప్రయోజనకరంగా ఉంటుందో మీకు తెలుసా? అవును, మీరు ఉదయం నీటికి బదులుగా నూనెతో పుక్కిలించినప్పుడు అనేక ఆరోగ్య సమస్యల నుండి బయటపడవచ్చు. పురాతన కాలంలో చాలా మంది నూనెతో పుక్కిలించడం ద్వారానే తమ నోటి ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకునేవారు. ఆయుర్వేదంలో కూడా ఆయిల్ పుల్లింగ్ చేస్తే కలిగే ఉపయోగాల గురించి వివరించారు. ఉదయాన్నే అలవర్చుకునే ఈ అలవాటు నోటి సమస్యలను పోగొట్టడమే కాకుండా దుర్వాసనను తరిమికొడుతుంది. ఏ నూనెలతో నోటిని పుక్కిలిస్తే ప్రయోజనాలు కలుగుతాయో చూద్దాం.
ప్రయోజనాలు
దంతాలను శుభ్రపరిచేందుకు, బలోపేతం చేసేందుకు ఆయిల్ పుల్లింగా పద్ధితి ఉపయోగపడుతుంది. చిగుళ్లు ఆరోగ్యంగా, బలంగా ఉండేలా చేస్తుంది. అంతేకాకుండా, నూనెలో ఉండే యాంటీమైక్రోబయల్ లక్షణాలు దుర్వాసనను తొలగించడంలో సహాయపడతాయి.
నూనెతో నోటిని కడుక్కోవడం వల్ల చిగుళ్ల వాపు, చిగుళ్ల నొప్పి వంటి సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. పయోరియా వంటి సమస్యలను వదిలించుకోవడంలో కూడా ఇది ప్రయోజనకరంగా ఉంటుంది.
ఆయిల్ పుల్లింగ్ చర్మంలో రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. వృద్ధాప్య సమస్యలను తగ్గించడంలో ఉపయోగపడుతుంది.
క్రమం తప్పకుండా నూనెతో పుక్కిలించడం టాక్సిన్లు తొలగిపోతాయి. శక్తిమంతంగా, ఆరోగ్యంగా తయారవుతారు.
ఏ నూనెలతో చేయాలి?
ఆయిల్ పుల్లింగ్ కోసం మీరు కొబ్బరి నూనె, నువ్వుల నూనె లేదా పొద్దుతిరుగుడు నూనెను ఉపయోగించవచ్చు. కొబ్బరి నూనెతోనే ఎక్కువ మంది పుక్కిలిస్తారు. ఎందుకంటే దీనికి యాంటీమైక్రోబయల్ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి.
ఉదయం ఖాళీ కడుపుతో, నోరు శుభ్రంగా ఉన్నప్పుడు లేదా ఏమీ తిననప్పుడు నూనెతో నోటిని ఆయిల్ పుల్లింగ్ చేయడానికి ఉత్తమ సమయాలు . ఇలా చేయాలని అనుకున్నప్పుడు ముందుగా 1-2 టీస్పూన్ల నూనె తీసుకొని మీ నోటిలో వేసుకోండి. తరువాత నూనెను మీ నోటిలో 15-20 నిమిషాలు పుక్కిలించండి. దంతాలు, చిగుళ్ళ మధ్య ఇంకేలా చూసుకోండి.
దీని తరువాత నూనెను ఉమ్మి గోరువెచ్చని నీటితో నోటిని శుభ్రం చేసుకోండి. మీరు ప్రతిరోజూ ఉదయం ఈ పద్ధతిని అనుసరించండి. మొదట్లో వారానికి 2 లేదా 3 సార్లు చేయవచ్చు. క్రమంగా ప్రతిరోజూ చేయడానికి ప్రయత్నిస్తే మంచి ఫలితాలు కనిపిస్తాయి.
Read Also: Food Hacks: కిచెన్‌లో ఒక్క రోజులో పాడయ్యే ఆహార పదార్థాలు.. జాగ్రత్త తీసుకోకపోతే అంతేసంగతి..
Milk Storage Tips: వేసవిలో ఫ్రిజ్ లేకున్నా పాలు చెడిపోకుండా ఉండేందుకు.. అద్భుతమైన టిప్స్..
Water Bottle Car: కారులో వాటర్ బాటిల్ ఉంచుతున్నారా.. అవి తాగితే ఏమవుతుందో తెలిస్తే..
Updated Date - Apr 17 , 2025 | 04:24 PM