ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Chanakya Niti: జీవితంలో సక్సెస్ కావాలంటే.. పొరపాటున కూడా ఈ 5 మంది సలహా తీసుకోకండి..

ABN, Publish Date - May 02 , 2025 | 08:27 AM

Chanakya Advice On Success: అనుకున్న లక్ష్యాన్ని సాధించేందుకు మనం ఎంచుకునే మార్గం కూడా చాలా ముఖ్యం. పట్టుదలతో కష్టపడి పనిచేసే తత్వం ఉన్నప్పటికీ.. ఈ ఐదుగురిలో ఏ ఒక్కరి నుంచి సలహా తీసుకున్నా ఎప్పటికీ విజయం సాధించలేరని ఆచార్య చాణక్యుడు చెబుతున్నాడు.

Chanakya Advice On Success

Art Of Success According To Chanakya: కౌటిల్యుడు లేదా విష్ణుగుప్తుడు అని కూడా పిలువబడే ఆచార్య చాణక్యుడు గొప్ప తత్వవేత్త, ఆర్థికవేత్త, రాజకీయవేత్త. ఆయన రాసిన చాణక్య నీతి జీవితంలోని అనేక విభిన్న అంశాలపై ఆచరణాత్మక సలహాలను అందిస్తుంది. చాణక్యుడు తన పుస్తకంలో వివిధ రకాల వ్యక్తులు, మనస్తత్వాల గురించి కూడా ప్రస్తావించాడు. జీవితంలో సక్సెస్ సాధించాలంటే ఎలాంటి వారి నుంచి సలహా తీసుకోకూడదో కూడా హెచ్చరించాడు. అవసరం ఉన్నా లేకపోయినా ఉచిత సలహాలు ఇచ్చే అలవాటు చాలామందికి ఉంటుంది. ముఖ్యంగా ఈ 5 మంది ఇచ్చే సలహా పనికిరానిదే కాదు. హానికరం కూడా. పొరపాటున వీరి మాట విన్నా మీరు తప్పక చింతిస్తారు. కాబట్టి, ఆ వ్యక్తులెవరో తెలుసుకుని జాగ్రత్త పడండి..


మూర్ఖుడు

చాణక్య నీతి ప్రకారం, మూర్ఖుడికి తెలివితేటలు, విచక్షణ ఉండవు. ఇలాంటి వ్యక్తుల ఏ సలహా ఇచ్చినా అది తప్పే కాదు. కచ్చితంగా అసాధ్యమైనది కూడా. ఇలాంటి వారి సలహాలు తెలియక అమల్లో పెట్టాలని నిర్ణయించుకుంటే మీకే హాని కలుగుతుంది. కష్టాల ఊబిలో కూరుకుపోయి ఎన్నటికీ బయటికి రాలేరు.


స్వార్థపరుడు

స్వార్థపరులు ఎల్లప్పుడూ తమ సొంత ప్రయోజనాల గురించే మొదట ఆలోచిస్తారు. వీరిలో అసూయాభావం ఎక్కువే. ఎదుటివారు తమకంటే గొప్పగా ఉండటం చూసి ఓర్చుకోలేరు. వారిని పాతాళంలోకి తొక్కేందుకు మంచిగా నటిస్తూ తాము ఎదిగేందుకు పన్నాగాలు పన్నుతారు. అబద్దాలను నిజాలుగా భ్రమింపజేసి నలుగురిలో మిమ్మల్ని మోసపూరితమైన వ్యక్తులుగా చిత్రీకరించే అవకాశమూ లేకపోలేదు. వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఎంతకైనా తెగించే ఇలాంటి వారితో ఎప్పటికీ జాగ్రత్తగా ఉండాలి.


అసూయాపరుడు

అసూయపడే వ్యక్తి మీ పురోగతిని చూసి సహించలేడు. మంచి మాటలు చెప్తూ మిమ్మల్ని వంచిస్తూనే.. పక్కవాళ్లతో మీ గురించి చెడుగా ప్రచారం చేస్తూ సంతృప్తిపడతాడు. తప్పుడు సలహాలు ఇచ్చి చెడు మార్గంలో వెళ్లేందుకు శతావిధాలా ప్రయత్నిస్తాడు. ఇలాంటి వ్యక్తి ఎప్పుడూ పనికొచ్చే సలహా ఇవ్వడు. కాబట్టి, ఇలాంటి వారిని గుర్తించి జాగ్రత్తగా మసలుకోవాలి.


అనుభవం లేని వ్యక్తి

అనుభవం లేని వ్యక్తికి జీవితం గురించి ఆచరణాత్మక జ్ఞానం ఉండదు. వారి సలహా అపరిపక్వమైనది. ప్రమాదకరం కూడా కావచ్చు. విషయంపై అవగాహన, అనుభవం లేకుండా సలహా ఇవ్వడం చీకట్లో బాణం వేసినట్లే. కాబట్టి, ఒక విషయంపై పూర్తి అవగాహన లేకున్నా ఎవరైనా సలహాలు ఇస్తుంటే నిరభ్యంతరంగా తిరస్కరించండి.


ప్రతికూల మనస్తత్వం

ప్రతికూల ఆలోచనలు కలిగి ఉన్న వ్యక్తి ప్రతి విషయంలో చెడును మాత్రమే చూస్తాడు. వీరికి సమస్యలు తప్ప మరేమీ కనిపించవు. ఇలాంటి వ్యక్తులు ఎప్పుడూ రక్షణాత్మక ధోరణిలో ఉంటారు. వీరి సలహాలు మీ ఆత్మవిశ్వాసాన్ని కూడా తగ్గిస్తాయి. కాబట్టి, నెగెటివిటీని వ్యాప్తి చేసే ఇలాంటి వ్యక్తులకు దూరంగా ఉండాలని చాణక్యుడు సలహా ఇస్తున్నాడు.


Read Also: Prathyekam: మురికి దిండుపై తల పెట్టుకుని పడుకోవడం వల్ల ఏం జరుగుతుందో తెలుసా..

Beauty Tips: ఎండ వల్ల మీ చర్మం నల్లగా మారుతోందా.. ఇవి మీ చర్మాన్ని ప్రకాశవంతం చేస్తాయి..

Chanakya Niti: ఈ అలవాట్లు ఉన్నవారు మోసం చేయడం ఖాయం

Updated Date - May 02 , 2025 | 08:28 AM