Keep Snakes Away Tips: ఇళ్లల్లోకి పాములు రాకుండా ఉండాలంటే.. సింపుల్‌గా ఇలా చేయండి చాలు..
ABN, Publish Date - Aug 08 , 2025 | 05:31 PM
ఇళ్లల్లోకి విష సర్పాలు రాకుండా ఉండేందుకు చాలా మంది ఏవేవో ప్రయోగాలు చేస్తుంటారు. అయితే కొన్ని సింపుల్ చిట్కాలను ప్రయోగించడం ద్వారా పాముల సమస్య నుంచి ఉపశమనం కలుగుతుంది.
అసలే ఇది వర్షకాలం. ఇటీవల తరచూ వర్షాలు కురుస్తున్నాయి. ఇలాంటి తరుణంలో అనేక సమస్యలతో ప్రజలు ఇబ్బందులు పడుతుంటారు. మరోవైపు ఇళ్లల్లోకి విష సర్పాలు రావడం కూడా ఎక్కువగా జరుగుతుంటుంది. దీంతో రాత్రిళ్లు భయంభయంగా గడపాల్సిన పరిస్థితి వస్తుంటుంది. అయితే కొన్ని వస్తువులను పాములు సంచరించే ప్రదేశాల్లో పెట్టడం వల్ల.. అవే భయపడి దూరంగా పారిపోతాయి. ఆ వస్తువులేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
ఇళ్లల్లోకి విష సర్పాలు రాకుండా ఉండేందుకు చాలా మంది ఏవేవో ప్రయోగాలు చేస్తుంటారు. అయితే కొన్ని సింపుల్ చిట్కాలను ప్రయోగించడం ద్వారా పాముల సమస్య నుంచి ఉపశమనం కలుగుతుంది.
వేపాకులు..
పాములను తరిమికొట్టడంలో వేపాకులు బాగా పని చేస్తాయి. మీ ఇంటి చుట్టూ వేపాకులు లేదా వేప నూనె చల్లుకోవాలి. వేప యొక్క చేదు రుచి, ఘాటైన వాసన పాములకు నచ్చదు. దీంతో ఈ వాసన ఉన్న ప్రదేశం నుంచి దూరంగా వెళ్లిపోతాయి.
వెల్లుల్లి, ఉల్లిపాయలు
వెల్లుల్లి, ఉల్లిపాయలు కూడా పాములను తరిమికొట్టడంలో బాగా పని చేస్తాయి. వీటిలో సల్ఫోనిక్ అనే ఆమ్లం ఉంటుంది. ఈ వాసన పాములకు చికాకు తెప్పిస్తుంది. దీంతో ఇంటి దరిదాపుల్లోకి రాకుండా ఉంటాయి. వెల్లుల్లి, ఉల్లిపాయ రసాన్ని ఇంటి చుట్టూ చల్లుకోవడం వల్ల కూడా పాములు రాకుండా ఉంటాయి.
కర్పూరం
కర్పూరం వాసన పాములకు అస్సుల నచ్చదు. ఈ వాసన రాగానే పాములు ఆమడం దూరం పారిపోతాయి. కాబట్టి కర్పూరం బిళ్లలను ఇంట్లో లేదా పాములు సంచరించే ప్రదేశాల్లో ఉంచడం వల్ల రాకుండా ఉంటాయి.
నెమలి ఈకలు
నెమలిని పాముకు శత్రువుగా భావించడం తెలిసిందే. అందుకే ఇంట్లో నెమలి ఈకలను ఉంచడం వల్ల పాములు దూరంగా వెళ్లిపోతాయి.
ఫినైల్..
ఫినైల్ అనే క్రిమి సంహారక ద్రావణాన్ని నీటిలో కలిపి పాములు సంచరించే ప్రదేశాల్లో చల్లాలి. దీని ఘాటైన వాసన పాములను తరిమికొట్టడంలో బాగా పని చేస్తుంది.
పటిక
పాములను దూరంగా ఉంచడంలో పటిక కూడా బాగా పని చేస్తుంది. పటిక చేదు రుచి, ఘాటైన వాసన పాములు అస్సలు ఇష్టపడవు.
Updated Date - Aug 08 , 2025 | 05:32 PM