Chanakya Niti: ధనవంతులు కావాలంటే ఈ అలవాట్లు వదులుకోవాల్సిందే.. చాణక్యుడు..
ABN, Publish Date - Aug 07 , 2025 | 09:01 PM
ఆచార్య చాణక్యుడు రాజనీతితో పాటు వైవాహిక జీవితం, ఆర్థిక సూత్రాలతో పాటు జీవితంలో ఒక వ్యక్తి విజయం సాధించేందుకు ఏం చేయాలో తన నీతి శాస్త్రం ద్వారా స్పష్టంగా వివరించాడు. ఇక ఒక వ్యక్తి ధనవంతుడు కావాలంటే ఈ అలవాట్లు వదులుకోవాల్సిందేనని చాణక్యుడు హెచ్చరించాడు.
మనుగడ సాగించడానికి సంపాదన అవసరం. అందుకే ప్రతి ఒక్కరూ పొట్టకూటి కోసం ఏదో ఒక పనికి తప్పకుండా చేస్తారు. కానీ చాలా మంది ఎంత పనిచేసినా దాని వల్ల ఏ ఉపయోగం ఉండదు. మా చేతుల్లో రూపాయి కూడా మిగలడం లేదని తరచూ చెప్పేవారి గురించి వినే ఉంటారు. వారికి ఇలాంటి పరిస్థితి రావడానికి కారణం ఈ కింది అలవాట్లే. వీటి కారణంగానే జీవితాంతం పేదరికంలోనే మగ్గిపోవాల్సిన పరిస్థితిని కొని తెచ్చుకుంటారు. ఆర్థిక సమస్యల ఊబి నుంచి బయటపడలేక కొట్టుమిట్టాడుతుంటారు. అవును, ఆచార్య చాణక్యుడు ఇలాంటి వారి గురించి తన నీతిశాస్త్రంలో ప్రస్తావించాడు. ఆయన చెప్పిన ప్రకారం, ఎంత సంపాదించినా ఏ అలవాట్ల వల్ల చేతుల్లో డబ్బు మిగలదో తెలుసుకుందాం.
చెడు అలవాట్లు
ధూమపానం, మద్యం సేవించడం వంటి చెడు అలవాట్లు ఉన్నవారి దగ్గర డబ్బు ఉండదు. అవును, వారు డబ్బు ఆదా చేయరు. బదులుగా తమ సంపాదనను తమ చెడు అలవాట్ల కోసం దుబారా చేస్తారు. కాబట్టి, ఒక వ్యక్తి వీలైనంత వరకు ఇలాంటి అలవాట్లకు దూరంగా ఉండాలని చాణక్యుడు చెబుతున్నాడు.
బాధ్యత లేకపోవడం
ఇంటి బాధ్యత తీసుకోని వారు అనవసరంగా ఖర్చు చేస్తారు. వారి చేతుల్లో డబ్బు ఉండదు. కానీ మనం బాధ్యత తీసుకుంటే పొదుపు, పెట్టుబడి పెట్టే అలవాటును పెంచుకుంటాము. కాబట్టి, ప్రతి ఒక్కరూ బాధ్యతతో వ్యవహరించాలి.
సోమరితనం
సోమరితనం మనిషికి అతిపెద్ద శత్రువు అని చాణక్యుడు చెప్పాడు. వాయిదా వేయడం, అవకాశాలను కోల్పోవడం, సమయానికి నిర్ణయాలు తీసుకోకపోవడం వల్ల ఆర్థిక ఇబ్బందులు వస్తాయి. కాబట్టి, సోమరితనాన్ని వదులుకోవాలి.
అధిక ఖర్చు
చాణక్యుడు చెప్పినట్లుగా ఆదాయం కంటే ఎక్కువ ఖర్చు చేసే వారి చేతుల్లో ఎల్లప్పుడూ డబ్బు ఉండదు. అలాంటి వ్యక్తులు ఎల్లప్పుడూ అప్పుల్లో ఉంటారు. అందుకే ఏదైనా ఖర్చు చేసే ముందు ఒకటికి10 సార్లు ఆలోచించాలి. అంతేకాకుండా, ఒక వ్యక్తి తన ఆదాయానికి మించి ఎప్పుడూ ఖర్చు చేయకూడదని.. ముఖ్యంగా రుణం తీసుకోకూడదని చాణక్యుడు చెప్పాడు.
(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ABN ఆంధ్రజ్యోతి బాధ్యత వహించదు.)
ఈ వార్తలు కూడా చదవండి..
అందం కోసం మరీ ఇంతకి తెగిస్తున్నారా?
ఓర్నీ తస్సాదియ్యా.. మంచూరియా మనదేనా.. స్టోరీ తెలిస్తే షాకే..
Read Latest Telangana News and National News
Updated Date - Aug 07 , 2025 | 09:02 PM