USA: టెర్రరిజానికి వ్యతిరేకంగా భారత్‌కు అమెరికా మద్దతు
ABN, Publish Date - Apr 25 , 2025 | 11:30 AM
పహల్గాం దాడిలో పాక్ ప్రమేయం ఉందని వాషింగ్టన్ అనుకుంటోందా? ఉద్రిక్తతలను తగ్గించే విషయంలో అమెరికా పాత్ర ఏవిధంగా ఉండనుందని అడిగినప్పుడు, పరిస్థితిలు వేగంగా మారుతున్నట్టు చూస్తున్నామని, వాటిని నిశితంగా గమనిస్తు్న్నామని బ్రూస్ చెప్పారు.
న్యూయార్క్: టెర్రరిజం ఏ రూపంలో ఉన్నా దానికి అమెరికా వ్యతిరేకిస్తుందని, ఈ విషయంలో భారత్‌కు తాము బాసటగా ఉంటామని అమెరికా (USA) తెలిపింది. పహల్గాం ఉగ్రదాడి ఘటనను తీవ్రంగా ఖండించింది.
New Pope Election: కొత్త పోప్ ఎన్నికలో భారతీయులు.. ఆ నలుగురు ఎవరంటే..
''ఇప్పటికే అధ్యక్షుడు ట్రంప్, మంత్రి మార్కో రూబియో దీనిపై మాట్లాడారు. భారత్‌కు అండగా అమెరికా నిలుస్తుంది. టెర్రరిజం ఏ రూపంలో ఉన్నా దానిని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తాం'' అని అమెరికా విదేశాంగ ప్రతినిధి టామ్మీ బ్రూస్ (Tammy Bruce) తెలిపారు. పహల్గాం ఉగ్రదాడిలో చనిపోయి వారి ఆత్మలకు శాంతి కలగాలని, ఈ హీనమైన దాడికి పాల్పడిన వారికి శిక్షపడాలని తాము కోరుకుంటున్నట్టు చెప్పారు.
పహల్గాం దాడిలో పాక్ ప్రమేయం ఉందని వాషింగ్టన్ అనుకుంటోందా? ఉద్రిక్తతలను తగ్గించే విషయంలో అమెరికా పాత్ర ఏవిధంగా ఉండనుందని అడిగినప్పుడు, పరిస్థితిలు వేగంగా మారుతున్నట్టు చూస్తున్నామని, వాటిని నిశితంగా గమనిస్తు్న్నామని బ్రూస్ చెప్పారు. భారత్, పాక్ మధ్య ట్రంప్ మధ్యవర్తత్వం వ్యవహారంపై ఇప్పటికిప్పుడు ఎలాంటి వ్యాఖ్యలు చేయలేమని తెలిపారు.
పహల్గాం ఉగ్రదాడి జరిగిన మొదటిరోజునే ట్రంప్ సోషల్ మీడియాలో ఈ ఘటను తీవ్రంగా ఖండించారు. తీవ్రవాదానికి వ్యతిరేకంగా భారత్‌కు అమెరికా మద్దతుగా నిలుస్తుందని ప్రకటించారు. మోదీకి, భారత ప్రజలకు సంపూర్ణంగా తమ మద్దుతు ఉంటుందన్నారు. పహల్గాం ఘటనలో మృతిచెందిన వారికి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నట్టు చెప్పారు.
ఇవి కూడా చదవండి..
Trump: చైనాపై సుంకాలు తగ్గుతాయ్
US Visa Crisis: విద్యార్థి వీసాల రద్దుకు బ్రేకులు
Updated Date - Apr 25 , 2025 | 12:02 PM