Share News

New Pope Election: కొత్త పోప్ ఎన్నికలో భారతీయులు.. ఆ నలుగురు ఎవరంటే..

ABN , Publish Date - Apr 22 , 2025 | 11:10 AM

‌Indian Cardinals In Papal Election: పోప్ ఫ్రాన్సిస్ తుది శ్వాస విడిచిన క్షణం నుంచి తదుపరి పోప్ ఎవరనే ఆసక్తి ప్రపంచవ్యాప్తంగా నెలకొంది. ప్రస్తుతం పాపల్ కాన్‌క్లేవ్‌లో కొత్త పోప్‌ను ఎన్నుకోవడానికి 135 మంది కార్డినల్స్‌కు అర్హత ఉంది. వీరిలో నలుగురు భారతీయులు ఉండగా.. ఒక హైదరాబాదీ కూడా ఉన్నారు.

New Pope Election: కొత్త పోప్ ఎన్నికలో భారతీయులు.. ఆ నలుగురు ఎవరంటే..
‌Indian Cardinals In Papal Election

Indian Cardinals Votig In Papal Conclave: పోప్ ఫ్రాన్సిస్ మరణించినప్పటి నుంచి వాటికన్ సిటీకి కాబోయే అధిపతి ఎవరనే ఆసక్తి ప్రపంచవ్యాప్తంగా నెలకొంది. అయితే, పోప్ అస్తమించిన నాటి నుంచి తొమ్మిది రోజుల వరకూ వాటికన్ లో సంతాప దినాలుగా పాటిస్తారు. పురాతన రోమన్ కాలం నుంచి కొనసాగుతున్న ఈ ఆచారాన్ని నోవెండియేల్ అని పిలుస్తారు. ఆ తర్వాతే నూతన పోప్ ఎన్నికకు సన్నాహాలు మొదలవుతాయి. ఎన్నిక రోజున కాన్‌క్లేవ్‌లో అర్హత పొందిన కార్డినల్స్ రహస్య ఓటింగ్ విధానంలో తదుపరి పోప్ ను ఎంపిక చేస్తారు.


ఇప్పటికే ప్రపంచంలోని నలుమూలల నుంచి పోప్ అంత్యక్రియల కోసం కార్డినల్స్ వాటికన్ సిటీకి చేరుకుంటున్నారు. అయితే, పాపల్ కాన్‌క్లేవ్‌లో ఓటు వేయడానికి ప్రస్తుతం అర్హత 135 మంది కార్డినల్స్‌కు అర్హత ఉంది. వీరిలో నలుగురు భారతీయులు కార్డినల్ ఫిలిప్ నెరి ఫెర్రావ్, కార్డినల్ బసేలియోస్ క్లీమిస్, కార్డినల్ ఆంథోనీ పూల, కార్డినల్ జార్జ్ జాకబ్ కూవకాడ్ ఉన్నారు. వాటికన్ సిటీ అధిపతి, 135 కోట్ల క్యాథలిక్కులకు నాయకుడిని ఎంపిక చేయడంలో కీలకంగా వ్యవహరించనున్నారు.


ఆ నలుగురు ఎవరు..

కార్డినల్ జార్జ్ జాకబ్ కూవకాడ్ (51), కార్డినల్ డీకన్ కాగా, కార్డినల్ ఫిలిప్ నేరి ఆంటోనియో సెబాస్టియావో డో రోసారియో ఫెర్రావ్(72) గోవా, డామన్ (భారతదేశం) మెట్రోపాలిటన్ ఆర్చ్ బిషప్, భారత కాథలిక్ బిషప్‌ల కాన్ఫరెన్స్, ఆసియా బిషప్‌ల సమావేశాల సమాఖ్యుకు అధ్యక్షుడు. కార్డినల్ ఆంథోనీ పూల (63) హైదరాబాద్ మెట్రోపాలిటన్ ఆర్చ్ బిషప్. కార్డినల్ బాసేలియోస్ క్లీమిస్ తొట్టుంకల్ సైరో-మలంకర (భారతదేశం) త్రివేండ్రం మేజర్ ఆర్చ్ బిషప్, సైరో-మలంకర చర్చి సైనాడ్ అధ్యక్షుడు.


పోప్ రేసులో..

ఏప్రిల్ 19 నాటికి 252 మంది కార్డినల్స్ ఉండగా కేవలం 80 ఏళ్లలోపు వారికే కొత్త పోప్‌ను ఎన్నుకునే సమావేశంలో ఓటు వేయడానికి అర్హులు. అలా చూస్తే ప్రస్తుతం 135 మంది ఓటు వేసే అర్హత ఉంది. నిబంధనల ప్రకారం వీరిలో కూడా 120 మందికే ఓటు వేసే హక్కు ఉంటుంది. శతాబ్దాలుగా పాటిస్తున్న సంప్రదాయం ప్రకారం ఈ సారి కార్డనళ్లలో ఒకరిగా పోప్ గా ఎన్నుకుంటారు. ఓటింగ్ రోజున సిస్టీన్ చాపెల్ చిమ్నీ నుంచి నల్లటి పొగ వస్తే ఇంకా ఎంపిక పూర్తికాలేదని.. తెల్లటి పొగ వస్తే కొత్త పోప్ ఎన్నిక పూర్తయిందని అర్థం. ప్రస్తుతం పోప్ రేసులో ప్రధాన పోటీదారు పియట్రో పరోలిన్‌ (70), కాగా తర్వాతి స్థానంలో రాబర్ట్‌ ప్రివోస్ట్‌ (69) ఉన్నారు. పీటర్‌ ఎర్డో (72), మార్క్‌ ఓలెట్‌ (80), రీన్‌హార్డ్‌ మార్క్స్‌ (71), క్రిస్టోఫ్‌ షోన్‌బోర్న్‌ (80), మ్యాటియో జుప్పీ (69), లూయీ ట్యాగిల్‌ (67) పోప్ పదవికి పోటీపడబోతున్నారు.


Read Also: Pope Francis Passes Away: పోప్‌ ఫ్రాన్సిస్‌ అస్తమయం

US Visa Crisis: ట్రంప్‌ దెబ్బ మరింత తీవ్రం

JD Vance - Pope Francis: పోప్ ఫ్రాన్సిస్‌ను కలిసిన చివరి నేత వైస్ ప్రెసిడెంట్ జెడి వాన్స్

Updated Date - Apr 22 , 2025 | 11:36 AM