JD Vance - Pope Francis: పోప్ ఫ్రాన్సిస్‌ను కలిసిన చివరి నేత వైస్ ప్రెసిడెంట్ జెడి వాన్స్
ABN , Publish Date - Apr 21 , 2025 | 05:38 PM
వాటికన్ సిటీ క్యాథలిక్ చర్చికి అధిపతి పోప్ ఫ్రాన్సిస్(లోలో కికో) ను కలిసిన చివరి నేతగా అమెరికా ఉపాధ్యక్షుడు జెడి వాన్స్ నిలిచారు. పోప్ చనిపోవడానికి ఒక్కరోజు ముందుగానే వాన్స్ పోప్ ని కలిసి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు.
JD Vance - Pope Francis: దీర్ఘకాలిక శ్వాసకోశ వ్యాధితో బాధపడుతూ ఇవాళ(సోమవారం) చనిపోయిన పోప్ ఫ్రాన్సిస్‌ను కలిసిన చివరి నేత అమెరికా వైస్ ప్రెసిడెంట్ జెడి వాన్స్. వాన్స్ ప్రస్తుతం ఇండియాలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. 2025 ఏప్రిల్ 20న వాటికన్‌లోని సెయింట్ పీటర్స్ స్క్వేర్‌లో కార్డినల్ ఏంజెలో కోమాస్త్రి అధ్యక్షతన జరిగిన ఈస్టర్ మాస్ ముగింపులో కార్యక్రమంలో వాన్స్ పాల్గొన్నారు. ఉర్బి ఎట్ ఓర్బి (లాటిన్‌లో నగరానికి మరియు ప్రపంచానికి) ఆశీర్వాదం ఇవ్వడానికి ముందు పోప్ ఫ్రాన్సిస్ US ఉపాధ్యక్షుడు J.D. వాన్స్‌ను కలిశారు. దీంతో పోప్ ఫ్రాన్సిస్‌ను ఆయన వాటికన్ నివాసంలో కలిసిన చివరి నాయకుడిగా అమెరికా ఉపాధ్యక్షుడు జె.డి. వాన్స్ నిలిచారు. ఈ సందర్భంగా పోప్ -వాన్స్ ఇరువురు ఈస్టర్ శుభాకాంక్షలు ఇచ్చిపుచ్చుకున్నారు. దీనికి ఒక రోజు గడిచాక సోమవారం ఉదయం పోప్ మరణించారు.

కాగా, వారాంతంలో అమెరికా ఉపాధ్యక్షుడు వాన్స్ తన కుటుంబంతో కలిసి ఇటలీని సందర్శించారు. పర్యటనలో భాగంగా వాన్స్ సీనియర్ వాటికన్ అధికారులను కలిసి అధికారిక చర్చలు జరిపారు. అయితే, ఈ చర్చల్లో పోప్ ఫ్రాన్సిస్ పాల్గొనలేదు.ఇలా ఉండగా, అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తీసుకొచ్చిన కొత్త వలస విధానంపై వాటికన్లు అసంతృప్తిగా ఉన్నారు. అమెరికా నుండి లక్షలాది మంది వలసదారులను బహిష్కరించాలనే ట్రంప్ ప్రణాళికలు, ఇంకా విదేశీ సహాయం, దేశీయ సంక్షేమ కార్యక్రమాలకు నిధులను ట్రంప్ భారీగా కోత పెట్టడాన్ని వాళ్లు ఖండిస్తున్నారు.

ఇవి కూడా చదవండి:
కాబోయే భర్తపై ప్రియుడితో దాడి చేయించిన యువతి.. కోమాలో బాధితుడు
అకస్మాత్తుగా కూలిన నాలుగు అంతస్తుల భవనం.. సీటీటీవీ ఫుటేజీలో షాకింగ్ దృశ్యాలు
వచ్చే నెలలో ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్‌ను భారతీయ గగనయాత్రికుడు శుభాంశూ శుక్లా..