ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Donald Trump: భారత్‌పై ట్రంప్ మళ్లీ కీలక వ్యాఖ్యలు

ABN, Publish Date - Sep 03 , 2025 | 08:14 AM

భారత్‌పై అమెరికా దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్‌తో తమ దేశానికి మధ్య సంబంధాలు చాలా ఏళ్లుగా కొనసాగుతున్నాయన్నారు. కానీ అవి ఏకపక్షంగా ఉన్నాయని..

వాషింగ్టన్, సెప్టెంబర్ 03: భారత్‌తో తమ దేశానికి మధ్య సంబంధాలు చాలా ఏళ్లుగా కొనసాగుతున్నాయని అమెరికా దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు. అయితే అవి ఏకపక్షంగా ఉన్నాయని.. కానీ తాను దేశాధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆ పరిస్థితులు మారాయని ఆయన చెప్పుకొచ్చారు. మంగళవారం వాషింగ్టన్‌లో డొనాల్డ్ ట్రంప్.. విలేకర్లతో మాట్లాడారు. భారత్‌పై విధించిన సుంకాలపై పునరాలోచన చేస్తారా అంటూ విలేకర్లు అడిగిన ఒక ప్రశ్నకు ట్రంప్ పైవిధంగా సమాధానం ఇచ్చారు.

ప్రపంచంలోనే అత్యధిక సుంకాలను భారత్ విధించిందన్నారు. దీని వల్ల అమెరికన్ సంస్థలు అక్కడ వ్యాపారం చేయడం కష్టతరం అయిందని పేర్కొన్నారు. భారత్‌లో భారీ సంఖ్యలో తయారు చేసిన వాటిని.. మన దేశంలో పోస్తారని చెప్పారు. అలా అమెరికా మార్కెట్‌లోకి భారతీయ వస్తువులు మాత్రం స్వేచ్ఛగా ప్రవహించాయని తెలిపారు. భారత్‌లో తమ మోటర్ సైకిళ్లపై 200 శాతం సుంకం విధించినట్లు హార్లే డేవిడ్సన్ వ్యవహారం గురించి ఈ సందర్భంగా ట్రంప్ ప్రస్తావించారు. అయితే తాను సుంకాలు విధించడం వల్ల.. అమెరికాలో తమ వాహనాల ఉత్పత్తి చేసుకునేందుకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న కంపెనీలను ప్రోత్సహిస్తున్నట్లు ఆయన వివరించారు. తాము భారత్‌తో పెద్దగా వ్యాపారం చేయడం లేదని.. కానీ వారు మాత్రం తమతో వ్యాపారం చేస్తున్నారన్నారు. అయితే భారత్‌పై విధించిన సుంకాలను ఆయన సమర్థించుకున్నారు.

రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు చేయడం పట్ల ఆమెరికా గుర్రుగా ఉన్న సంగతి తెలిసిందే. భారత్ చమురు కొనుగోలు చేయడం వల్ల రష్యా వద్ద నగదు భారీగా పొగుపడుతుందన్నారు. దీంతో ఉక్రెయిన్‌పై యుద్ధానికి రష్యాకు నగదు సమకూరుతోందని ట్రంప్ ఇప్పటికే ఆరోపించిన సంగతి తెలిసిందే. దీంతో భారత్‌పై ట్రంప్ సుంకాలను భారీగా పెంచారు. ఈ నేపథ్యంలో భారత్, అమెరికా దేశాల మధ్య సంబంధాలు దాదాపుగా దెబ్బతిన్న విషయం విదితమే.

ఈ వార్తలు కూడా చదవండి..

భారత్‌పై ట్రంప్ మళ్లీ కీలక వ్యాఖ్యలు

ముగ్గురు కార్పొరేషన్‌ చైర్మన్లకు క్యాబినెట్‌ హోదా

For More International News And Telugu News

Updated Date - Sep 03 , 2025 | 10:35 AM