AP Govt: ముగ్గురు కార్పొరేషన్ చైర్మన్లకు క్యాబినెట్ హోదా
ABN , Publish Date - Sep 03 , 2025 | 06:49 AM
ముగ్గురు కార్పొరేషన్ చైర్మన్లకు రాష్ట్ర ప్రభుత్వం క్యాబినెట్ హోదా కల్పించింది. రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్...
శైలజ, జవహర్, ఆలపాటి సురేష్‌కు అవకాశం
అమరావతి, సెప్టెంబరు 2 (ఆంధ్రజ్యోతి): ముగ్గురు కార్పొరేషన్ చైర్మన్లకు రాష్ట్ర ప్రభుత్వం క్యాబినెట్ హోదా కల్పించింది. రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్ రాయపాటి శైలజ, ఎస్సీ కమిషన్ చైర్మన్ కె.ఎస్ .జవహర్, ఏపీ ప్రెస్ అకాడమీ చైర్మన్ అలపాటి సురేష్‌కు క్యాబినెట్ హోదా కల్పిస్తూ సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. వీరికి జిల్లా, రాష్ట్ర స్థాయిలో కూడా క్యాబినెట్ హోదాలోనే ప్రొటోకాల్ అమలు చేయనున్నారు. అదే హోదాలో వేతనాలు, అలవెన్సులు అందించనున్నారు.
18 మంది చైర్మన్లకు వేతనాలు
ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించిన పలువురు కార్పొరేషన్ చైర్మన్లకు వేతనాలు, అలవెన్సులను నిర్ణయించింది. హ్యాండీక్రాఫ్ట్ చైర్మన్, గ్రీన్ అండ్ బ్యూటిఫికేషన్ చైర్మన్, మహిళా కో-ఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్, భవన, ఇతర నిర్మాణ పనుల వర్కర్ల వెల్ఫేర్ బోర్డు చైర్మన్.. ఇలా 12 మంది చైర్మన్లకు ఏ కేటగిరి కింద వేతనాలు, అలవెన్సులు ఇవ్వడానికి నిర్ణయించింది. తిరుపతి అర్బన్ డెవల్‌పమెంట్ అథారిటీతో పాటు మరో ఐదు కార్పొరేషన్ల చైర్మన్లకు బి కేటగిరి కింద వేతనాలు అందించడానికి ఉత్తర్వులు జారీ చేసింది.