ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Video Viral: దేశాధినేతల భేటీ.. ఆసక్తికర సంఘటన

ABN, Publish Date - Sep 03 , 2025 | 11:43 AM

చైనాలోని తియాన్‌జిన్ నగరం వేదికగా షాంఘై సహకార సదస్సు (ఎస్‌సీఓ) జరిగింది. ఈ సదస్సుకు తొమ్మిది దేశాలకు చెందిన నేతలు హాజరయ్యారు.

బీజింగ్, సెప్టెంబర్ 03: చైనాలోని తియాన్‌జిన్ నగరం వేదికగా షాంఘై సహకార సదస్సు (ఎస్‌సీఓ) జరిగింది. ఈ సదస్సుకు తొమ్మిది దేశాలకు చెందిన నేతలు హాజరయ్యారు. అయితే ఈ సదస్సు కోసం హాజరైన నేతలు.. వివిధ దేశాల నేతలతో సమావేశం కావడం పరిపాటి అన్న సంగతి అందరికి తెలిసిందే. ఈ సందర్భంగా ఒక ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. రష్యా దేశాధ్యక్షుడు పుతిన్‌తో పాక్ ప్రధాని షహబాష్ షరీఫ్ సమావేశమయ్యారు. ఈ సమావేశంలో మాట్లాడుతున్నప్పుడు పాక్ ప్రధాని షరీఫ్ చెవికి ఉన్నహెడ్ పోన్స్ ఊడిపోయి .. కింద పడ్డాయి. దీనిని సరిగా పెట్టుకునే క్రమంలో ప్రధాని షరీఫ్ కాస్తా ఇబ్బంది పడ్డారు. ఈ విషయాన్ని రష్యా అధ్యక్షుడు పుతిన్ గమనించారు.

దాంతో ఈ హెడ్ ఫోన్స్ ఎలా పెట్టుకోవాలో పాక్ ప్రధానికి ఆయన చెవిలోని హెడ్ పోన్స్ తీసి చూపించారు. ఆ సమయంలో పాక్ ప్రధాని చర్యలకు గాను పుతిన్‌ కొద్దిగా నవ్వుతూ కనిపించారు. అందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. అయితే గతంలో సైతం ఈ ఇద్దరి నేతల మధ్య ఇదే తరహా ఘటన చోటు చేసుకోవడం గమనార్హం. 2020లో ఉజ్బెకిస్థాన్‌ వేదికగా సదస్సు జరిగింది. ఈ సందర్భంగా పాక్ ప్రధాని షరీఫ్ ఇదే విధంగా ఇబ్బంది పడ్డారు. అంతలో అక్కడే ఉన్న ఆయన సిబ్బంది అప్రమత్తమయ్యరు. ఆ వెంటనే ఇయర్ ఫోన్స్‌ను పాక్ ప్రధాని షరీఫ్ చెవిలో వారు సరి చేసి పెట్టారు.

ఇక తాజా వీడియో వైరల్ కావడంతో.. ప్రధాని షరీఫ్ రాజకీయ ప్రత్యర్థులకు ఆయుధం దొరికినట్లు అయింది. అంతే.. ప్రపంచంలో 220 మిలియన్ ప్రజలకు షహబాబ్ షరీఫ్ ప్రధాని అని.. ఆయన చర్యలు విస్తుగొలుపుతోన్నాయని కామెడియన్ జిమ్మి ఫాలెన్ జోక్ చేశారు.

చైనాలోని తియాన్‌జిన్ నగరంలో ఆగస్టు 31వ తేదీ షాంఘై సహకార సదస్సు (ఎస్‌సీఓ) ప్రారంభమై.. సెప్టెంబర్ 1వ తేదీన ముగిసింది. ఈ సదస్సుకు వివిధ దేశాధినేతలు హాజరయ్యారు. ఈ సదస్సుకు ప్రధాని మోదీ సైతం దాదాపు ఏడేళ్ల తర్వాత చైనాలో జరిగిన ఈ సదస్సులో పాల్గొన్నారు. ఈ సదస్సు వేదికపై నుంచి పహల్గాం ఉగ్రదాడిని ప్రపంచ దేశాలు ముక్త కంఠంతో ఖండించాయి. పాక్ ప్రధాని షరీఫ్ సమక్షంలోనే ఈ ఘటనను ఖండించడం పట్ల.. ఆయన కొంత అసౌకర్యానికి గురయ్యారు. అలాగే ఈ సదస్సుకు హాజరైన మోదీ.. వివిధ దేశాదినేతలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పాక్ ప్రధాని షబాజ్‌ షరీఫ్‌ను ప్రధాని మోదీ పట్టింకోక లేదన్న సంగతి అందిరికి తెలిసేందే.

ఈ వార్తలు కూడా చదవండి..

మరికొన్ని గంటల్లో చంద్ర గ్రహణం.. ఈ రాశుల వారిపై తీవ్ర ప్రభావం..

పోటా పోటీగా అన్నా చెల్లెలు..

For More International News And Telugu News

Updated Date - Sep 03 , 2025 | 12:02 PM