Share News

Lunar Eclipse Date And Time: మరికొన్ని గంటల్లో చంద్ర గ్రహణం.. ఈ రాశుల వారిపై తీవ్ర ప్రభావం..

ABN , Publish Date - Sep 03 , 2025 | 11:01 AM

భాద్రపద పౌర్ణమి రోజున.. అంటే సెప్టెంబర్ 7వ తేదీన రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడనుంది. ఈ గ్రహణం శతభిష నక్షత్రంలో.. కుంభరాశిలో ఏర్పడబోతోంది.

Lunar Eclipse Date And Time: మరికొన్ని గంటల్లో చంద్ర గ్రహణం.. ఈ రాశుల వారిపై తీవ్ర ప్రభావం..
Lunar Eclipse in 2025 sep 7th

భాద్రపద పౌర్ణమి రోజున.. అంటే సెప్టెంబర్ 7వ తేదీన రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడనుంది. ఈ గ్రహణం శతభిష నక్షత్రంలో.. కుంభరాశిలో ఏర్పడబోతోంది. ఈ గ్రహణం ఆదివారం రాత్రి 9 గంటల 56 నిమిషాలకు ప్రారంభమై.. అర్థరాత్రి ఒంటిగంట 26 నిమిషాల వరకు ఉంటుంది. అంటే గ్రహణ వ్యవధి కాలం మూడు గంటల 30 నిమిషాల పాటు ఉంటుంది. అయితే రాత్రి 11.42 నిమిషాలకు గ్రహణ మధ్యస్థ కాలమని పండితులు చెబుతారు. ఇక ఈ చంద్ర గ్రహణం ఆసియా ఖండంలోని అనేక దేశాల్లో కనబడబోతోంది. అలాగే భారతదేశంపైనా దీని ప్రభావం ఉంటుందని అంటున్నారు. ఈ చంద్రగ్రహణం.. భారత్, రష్యా, సింగపూర్, చైనాలోని కొన్ని ప్రాంతాల్లో కనిపిస్తుంది.


ఈ రాశుల వారు..

ఈ గ్రహణంలో కుంభ, మీనం, మిథునం, సింహరాశుల వారికి చెడు ఫలితాలు అధికంగా ఉండబోతున్నాయి. మరీ ముఖ్యంగా కుంభ, సింహ రాశుల వారు ఈ గ్రహణాన్ని చూడకుండా ఉండడం మంచింది. ఇక ఈ గ్రహణం సమయంలో దుర్గా దేవిని పూజించాలి. రాహు జపం చేయడం, వెండి వంటివి దానం చేయడంతోపాటు పట్టు విడుపు స్నానాలు ఆచరించడం వంటివి శుభఫలితాలు ఇస్తాయి. అయితే కుంభం, మీనం, మేషం, మిథునం, సింహం రాశుల వారికి ఉద్యోగ, వ్యాపారాల్లో సమస్యలుండే అవకాశాలున్నాయి.


ఆలయాలు మూసివేత..

ఈ గ్రహణం కారణంగా.. దేశంలోని ఆలయాలన్నీ ఏడో తేదీ సాయంత్రం 5.00 గంటల లోపు మూసివేయనున్నారు. ఆ తర్వాతి రోజు ఉదయం సూర్యోదయం అనంతరం ఆలయాల్లో గ్రహణ శుద్ధి కార్యక్రమాలు ఆచరించాలి.


ఈ జాగ్రత్తలు తీసుకోండి..

  • చంద్రగ్రహణం రాత్రి సంభవించడంతో గ్రహణ సమయంలో ధ్యానం, జపం, తపం వంటి కార్యక్రమాలు ఆచరించాల్సి ఉంటుంది.

  • గ్రహణ సమయంలో ముఖ్యమైన నిర్ణయాలు.. ప్రయాణాలు, పూజా కార్యక్రమాలకు వీలైనంత దూరంగా ఉండడం ఉత్తమం.

  • గ్రహణ కాల వ్యవధిలో ఇంటి వద్దే ఉండేలా చూసుకోవాలి. గర్భిణీలు గ్రహణ సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.

  • ఇక గ్రహణానికి ముందు పట్టు స్నానం (తల స్నానం), గ్రహణం తర్వాత విడుపు స్నానం ఆచరించాల్సి ఉంటుంది.

  • గ్రహణ సమయంలో ఇంట్లోని పూజా మందిరం, ఏదైనా నిల్వ ఉంచే ఆహార పదార్థాలు వంటి వాటిపై దర్భలను ఉంచడం శ్రేయస్కరం.

    ఈ వార్తలు కూడా చదవండి..

    ఈ ఐదు రాశులకు అదృష్ట యోగం.. ఎప్పటి నుంచి అంటే..

    పోటా పోటీగా అన్నా చెల్లెలు..

    మరిన్నీ ఆధ్యాత్మిక వార్తలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Sep 03 , 2025 | 11:01 AM