Teacher: స్కూలు పిల్లలతో టీచర్ ఎఫైర్.. బహుమతులు ఇచ్చి..
ABN, Publish Date - May 12 , 2025 | 07:15 AM
Teacher: దాదాపు 10 నెలల పాటు అతడితో ఎఫైర్ పెట్టుకుంది. అతడికి లవ్ లెటర్స్ పంపేది. ఇద్దరూ ఫోన్‌లో చాట్ కూడా చేసుకునే వారు. వీరి రిలేషన్‌పై బాలుడి తల్లికి అనుమానం వచ్చింది. లెటర్లు, చాట్ చదవగా అసలు విషయం బయటపడింది.
పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పించి సక్రమ మార్గంలో పెట్టాల్సిన ఉపాధ్యాయులే తప్పుదోవ పడుతున్నారు. కన్నబిడ్డల్లా చూసుకోవాల్సిన వారిపై కన్నేస్తున్నారు. వారితో తమ కామ కోరికలు తీర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. మగ ఉపాధ్యాయులే కాదు.. ఆడవారు కూడా మగ విద్యార్థులతో తప్పుగా ప్రవర్తిస్తున్నారు. మగ విద్యార్థులతో ఎఫైర్ పెట్టుకున్న కారణంతో ఓ టీచర్ భారీ మూల్యాన్ని చెల్లించుకుంది. చేసిన నేరం రుజువవ్వటంతో కోర్టు ఆమెకు ఏకంగా 30 ఏళ్ల జైలు శిక్ష వేసింది. చేసిన తప్పుకు సదరు లేడీ టీచర్ ఇప్పుడు కుమిలికుమిలి ఏడుస్తోంది.
సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. అమెరికాకు చెందిన 36 సంవత్సరాల జాక్వెలిన్ మా.. శాండియాగోలోని లింకన్ ఎకర్స్ ఎలిమెంటరీ స్కూల్లో టీచర్‌గా పని చేస్తూ ఉండేది. మా తను చదువు చెప్పే ఓ 12 ఏళ్ల విద్యార్థిపై కన్నేసింది. అతడ్ని మచ్చిక చేసుకుని తన కోరికలు తీర్చుకుంటూ ఉండేది. దాదాపు 10 నెలల పాటు అతడితో ఎఫైర్ పెట్టుకుంది. అతడికి లవ్ లెటర్స్ పంపేది. ఇద్దరూ ఫోన్‌లో చాట్ కూడా చేసుకునే వారు.
ఆ లవ్ లెటర్లు, మెసేజ్‌లు చూసి బాలుడి తల్లికి అనుమానం వచ్చింది. వెంటనే అధికారులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు ఆమెపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. పోలీసుల దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగు చూశాయి. జాక్వెలిన్ మా కేవలం ఆ బాలుడితో మాత్రమే కాదు.. చాలా మందితో ఎఫైర్ పెట్టుకుంది. విద్యార్థులకు బహుమతులు, తిండితో పాటు వారిపై ప్రత్యేకమైన శ్రద్ధ చూపించేది. వాళ్ల హోంవర్క్ కూడా చేసేది. దీంతో పిల్లలు ఈమె వలలో పడిపోయేవారు. చెప్పినట్లు చేసేవారు. కోర్టులో జాక్వెలిన్ నేరం రుజువవ్వటంతో కోర్టు ఆమెకు 30 సంవత్సరాల జైలు శిక్ష విధిస్తూ తీర్పు నిచ్చింది.
ఇవి కూడా చదవండి
Gold Rate Today: బంగారం కొనాలనుకునే వారికి గుడ్ న్యూస్.. తగ్గిన ధరలు
టెస్ట్ లపై పునరాలోచనకు కోహ్లీ ససేమిరా
Updated Date - May 12 , 2025 | 10:42 AM