Share News

Gold Rate Today: బంగారం కొనాలనుకునే వారికి గుడ్ న్యూస్.. తగ్గిన ధరలు

ABN , Publish Date - May 12 , 2025 | 06:34 AM

Gold Rate Today: హైదరాబాద్ నగరంలో నిన్న 10 గ్రాముల స్వచ్ఛమైన 24 క్యారెట్ల బంగారం ధర 98680 దగ్గర ట్రేడ్ అయింది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 90450 దగ్గర ట్రేడ్ అయింది. ఇక, 10 గ్రాముల 18 క్యారెట్ల ధర 74010 దగ్గర ట్రేడ్ అయింది.

Gold Rate Today: బంగారం కొనాలనుకునే వారికి గుడ్ న్యూస్.. తగ్గిన ధరలు
Gold Rate Today

పెళ్లిళ్లు అయినా.. పేరంటాలు అయినా.. ఏ శుభకార్యం అయినా సరే.. బంగారం ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఆడపడుచులకు అదొక ప్రస్టేజ్ ఇష్యూ. అంతకు మించి అందాన్ని పెంచే వస్తువు. అందుకే బంగారం ఎంత ఉన్నా ఇంకా కావాలని అంటూ ఉంటారు. గత సంవత్సరం చివరినుంచి ఇప్పటి వరకు బంగారం ధరల్లో భారీ మార్పు వచ్చింది. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర లక్ష రూపాయల దగ్గర ట్రేడ్ అవుతోంది. 22 క్యారెట్ల బంగారం కూడా 90 వేల దగ్గర ట్రేడ్ అవుతోంది. బంగారం కొనాలనుకునే పేద, మధ్య తరగతి వాళ్లకు చుక్కలు చూపిస్తోంది.


హైదరాబాద్‌లో నేటి బంగారం ధరలు ఇలా..

గుడ్ రిటర్న్స్ వెబ్ సైట్ ప్రకారం.. హైదరాబాద్ నగరంలో నిన్న 10 గ్రాముల స్వచ్ఛమైన 24 క్యారెట్ల బంగారం ధర 98680 దగ్గర ట్రేడ్ అయింది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 90450 దగ్గర ట్రేడ్ అయింది. ఇక, 10 గ్రాముల 18 క్యారెట్ల ధర 74010 దగ్గర ట్రేడ్ అయింది. ఇక, ఈ రోజు 18,22,24 క్యారెట్ల బంగారంపై 10 రూపాయలు తగ్గింది. 10 గ్రాముల స్వచ్ఛమైన 24 క్యారెట్ల బంగారం ధర ఈ రోజు 98670 దగ్గర ట్రేడ్ అవుతోంది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 90440 దగ్గర ట్రేడ్ అవుతోంది. ఇక, 10 గ్రాముల 18 క్యారెట్ల ధర 74000 దగ్గర ట్రేడ్ అవుతోంది.


ఈ రోజు వెండి ధరలు ఇలా..

వెండి ధరలు బంగారంతో సంబంధం లేకుండా తగ్గుతూ వస్తున్నాయి. గత కొద్దిరోజులనుంచి చూసుకుంటే ప్రతీ రోజూ 10 గ్రాములపై కనీసం 10 రూపాయల చొప్పున తగ్గుతూ వస్తోంది. ఈ నేపథ్యంలోనే నిన్న 100 గ్రాముల వెండి ధర 11100 రూపాయల దగ్గర ట్రేడ్ అయింది. కేజీ వెండి ధర 1,11,000 దగ్గర ట్రేడ్ అయింది. ఈ రోజు 100 గ్రాములపై 10 రూపాయలు, కేజీపై 100 రూపాయలు తగ్గింది. ఈ రోజు 100 గ్రాముల వెండి ధర 11,090 దగ్గర ట్రేడ్ అవుతోంది. కేజీ బంగారం ధర 1,10,900 దగ్గర ట్రేడ్ అవుతోంది.


ఇవి కూడా చదవండి

16 లేదా 17న

Nursing Officers: సైన్యానికి అండగా మేము సైతం

Updated Date - May 12 , 2025 | 06:36 AM