Nursing Officers: సైన్యానికి అండగా మేము సైతం
ABN , Publish Date - May 12 , 2025 | 06:00 AM
ఆపరేషన్ సిందూర్‌లో అవసరమైతే తమ వంతు పాత్ర పోషిస్తామని తెలంగాణ ప్రభుత్వ నర్సింగ్ ఆఫీసర్లు స్పష్టం చేశారు. పాకిస్థాన్‌కు దీటుగా బదులిస్తున్న మన సైన్యానికి వైద్య సేవలందించేందుకు సిద్ధమని పేర్కొన్నారు.
ప్రతిజ్ఞ చేసిన ప్రభుత్వ నర్సింగ్ ఆఫీసర్లు
హైదరాబాద్, మే 11 (ఆంధ్రజ్యోతి): ఆపరేషన్ సిందూర్‌లో అవసరమైతే తమ వంతు పాత్ర పోషిస్తామని తెలంగాణ ప్రభుత్వ నర్సింగ్ ఆఫీసర్లు స్పష్టం చేశారు. పాకిస్థాన్‌కు దీటుగా బదులిస్తున్న మన సైన్యానికి వైద్య సేవలందించేందుకు సిద్ధమని పేర్కొన్నారు. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ నర్సింగ్ ఆఫీసర్లు ప్రతిజ్ఞ చేశారు. శనివారం సాయంత్రం కోఠీలోని వైద్య విద్య సంచాలకుల కార్యాలయంలో మే 12న అంతర్జాతీయ నర్సుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నర్సులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో ఎటువంటి పరిస్థితుల్లోనైనా సేవలందించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. కాగా, అంతర్జాతీయ నర్సుల దినోత్సవాన్ని పురస్కరించుకుని సోమవారం రవీంద్రభారతిలో తెలంగాణ(ప్రభుత్వ) నర్సెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇంటర్నేషనల్ నర్సెస్ డే వేడుకలు జరగనున్నాయి. ఈ కార్యక్రమంలో వైద్య మంత్రితో పాటు, ఆరోగ్య శాఖ కార్యదర్శి, డీఎంఈ, డీహెచ్, టీవీవీపీ కమిషనర్, టీఎన్‌జీవో ప్రెసిడెంట్, జనరల్ సెక్రటరీ పాల్గొంటారని అసోసియేషన్ అధ్యక్షురాలు ఆది లక్ష్మి తెలిపారు.