Share News

టెస్ట్‌ లపై పునరాలోచనకు కోహ్లీ ససేమిరా

ABN , Publish Date - May 12 , 2025 | 05:58 AM

టెస్ట్‌ల నుంచి రిటైర్‌ కావాలని విరాట్‌ కోహ్లీ నిర్ణయించుకున్నాడన్న వార్త సంచలనం రేపుతోంది. అయితే కీలకమైన ఇంగ్లండ్‌తో టెస్ట్‌ సిరీ్‌సవరకైనా నిర్ణయాన్ని వాయిదా వేసుకోవాలని కోహ్లీని బీసీసీఐ కోరుతోంది. ఈమేరకు...

టెస్ట్‌ లపై పునరాలోచనకు కోహ్లీ ససేమిరా

బతిమాలుతున్న బోర్డు

న్యూఢిల్లీ: టెస్ట్‌ల నుంచి రిటైర్‌ కావాలని విరాట్‌ కోహ్లీ నిర్ణయించుకున్నాడన్న వార్త సంచలనం రేపుతోంది. అయితే కీలకమైన ఇంగ్లండ్‌తో టెస్ట్‌ సిరీ్‌సవరకైనా నిర్ణయాన్ని వాయిదా వేసుకోవాలని కోహ్లీని బీసీసీఐ కోరుతోంది. ఈమేరకు విరాట్‌ను ఒప్పించే బాధ్యతను దేశ క్రికెట్‌లో అత్యంత ప్రముఖుడికి అప్పగించినట్టు సమాచారం. దాంతో ఆ ప్రముఖుడు కోహ్లీని సంప్రదించాడట. అయినా విరాట్‌ మాత్రం ససేమిరా అన్నట్టు తెలిసింది. సుదీర్ఘ ఫార్మాట్‌కు గుడ్‌ బై చెప్పాలన్న తన నిర్ణయంలో మార్పు ఉండబోదని అతడికి కోహ్లీ కుండబద్దలు కొట్టాడట.

ఈ నేపథ్యంలో వచ్చేవారం జరిగే సెలెక్షన్‌ కమిటీ సమావేశంలోపు కోహ్లీ రిటైర్మెంట్‌కు సంబంధించి తుది నిర్ణయం వెలువడుతుందని బోర్డు అధికారి ఒకరు ఆదివారం వెల్లడించారు. టెస్ట్‌లకు రోహిత్‌ ఇప్పటికే గుడ్‌బై చెప్పాడు. విరాట్‌ నిర్ణయం త్వరలో వెల్లడవుతుంది. ఇక టెస్ట్‌ జట్టులో మరో వెటరన్‌ ఆటగాడు, 34 ఏళ్ల మహ్మద్‌ షమి భవితవ్యంపై సెలెక్షన్‌ కమిటీ భేటీలో చర్చించే అవకాశముంది. ఇంగ్లండ్‌తో సిరీస్‌కు అతడికి జట్టులో చోటు లభించే అవకాశాలు లేనట్టే. ‘అంతర్జాతీయ క్రికెట్‌లో పునరాగమనం చేసి నెలలు గడుస్తున్నా షమి బౌలింగ్‌లో రిథమ్‌ కనిపించడంలేదు. గాయం వల్ల పూర్తి సామర్థ్యంతో బౌలింగ్‌ చేయలేకపోతున్నాడు. కొద్ది ఓవర్లు వేయగానే విశ్రాంతి కోసం వెళ్లిపోవాల్సి వస్తోంది’ అని ఆ అధికారి విశ్లేషించాడు.

మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - May 12 , 2025 | 05:58 AM