ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Reclaim Bagram Airbase: బాగ్రామ్ ఎయిర్ బేస్‌పై అమెరికా కన్ను.. చైనాపై నిఘా కోసం ఎంతకైనా..

ABN, Publish Date - Sep 20 , 2025 | 12:30 PM

చైనా న్యూక్లియర్ కార్యకలాపాలపై దృష్టిసారించాలని ట్రంప్ భావించారు. చైనాపై నిఘా పెట్టడానికి కూడా సిద్దమయ్యారు. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే వెల్లడించారు.

Reclaim Bagram Airbase

గత కొంతకాలంగా జరుగుతున్న పరిణామాలతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అభద్రతా భావంలో పడిపోయారు. మరీ ముఖ్యంగా చైనా విషయంలో ఆయన ఆందోళనకు గురవుతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ట్రంప్ చైనాపై నిఘాకు సిద్ధమయ్యారు. ఆఫ్ఘనిస్తాన్‌‌లోని పాత ఎయిర్‌బేస్‌ను స్వాధీనం చేసుకోవడానికి పావులు కదుపుతున్నారు. ఇంతకీ సంగతేంటంటే.. ఆఫ్ఘనిస్తాన్‌ను తాలిబన్లు స్వాధీనం చేసుకోవడానికి ముందు పెద్ద మొత్తంలో అమెరికా సైన్యం ఆఫ్ఘనిస్తాన్‌లోని పలు ప్రాంతాల్లో ఉండేది. అక్కడక్కడా అమెరికా మిలటరీ బేస్‌లు కూడా ఉండేవి.

ఆఫ్ఘనిస్తాన్‌లో ఉన్న అమెరికా ఎయిర్‌బేస్‌లలో బాగ్రామ్ ఎయిర్‌బేస్ ప్రధానమైనదిగా ఉండేది. 3300 ఎకరాల్లో బాగ్రామ్ ఎయిర్‌బేస్ ఉండేది. అప్పట్లో 40 వేల మంది సైనికులతో పాటు సివిలియన్ కాంట్రాక్టర్లు కూడా అక్కడ ఉండేవారు. ఇక్కడి నుంచే తాలిబన్లకు వ్యతిరేకంగా వ్యూహరచన జరిగేది. అయితే, పలు కారణాల వల్ల 2021 జులై నెలలో అమెరికా సైన్యం బాగ్రామ్ ఎయిర్‌బేస్‌ను ఖాళీ చేసింది. దీంతో అది తాలిబన్ల వశం అయింది. తర్వాతి కాలంలో ఆఫ్ఘనిస్తాన్ తాలిబన్ల చేతిలోకి వెళ్లిపోయింది.

బాగ్రామ్‌కు అతి దగ్గరగా చైనా న్యూక్లియర్ సైట్..

బాగ్రామ్‌కు అతి దగ్గరలో చైనాలోని కాఖ్గర్ ప్రాంతంలో ఓ న్యూక్లియర్ సైట్ ఉన్నట్లు తెలుస్తోంది. బాగ్రామ్ ఎయిర్‌బేస్‌కు కేవలం 700 కిలోమీటర్ల దూరంలోనే ఈ న్యూక్లియర్ సైట్ ఉందని సమాచారం. చైనా న్యూక్లియర్ కార్యకలాపాలపై దృష్టిసారించాలని ట్రంప్ భావించారు. చైనాపై నిఘా పెట్టడానికి కూడా సిద్దమయ్యారు. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే వెల్లడించారు. గత గురువారం బ్రిటన్ ప్రధాని కైర్ స్టార్మర్‌తో కలిసి మీడియా ప్రతినిధుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ట్రంప్ మాట్లాడుతూ..

‘బాగ్రామ్‌లో మళ్లీ పాగా వేయాలని అనుకుంటున్నాము. అక్కడినుంచి చైనాపై నిఘా ఉంచుతాము’ అని పేర్కొన్నారు. అమెరికాకు చెందిన ఉన్నతాధికారి ఒకరు రాయిటర్స్‌తో ఈ విషయంపై మాట్లాడుతూ.. ‘ బాగ్రామ్ ఎయిర్‌బేస్‌ను స్వాధీనం చేసుకోవడానికి ఎలాంటి ప్లాన్స్ లేవు. బాగ్రామ్ ఎయిర్‌బేస్‌ను స్వాధీనం చేసుకోవటం సాధ్యం అవుతుందని నేను అనుకోవటం లేదు. ఇస్లామిక్ స్టేట్, అల్ ఖైదా వంటి ఉగ్రవాద సంస్థలనుంచి దాన్ని రక్షించుకోవటం కూడా చాలా కష్టమైన పని. బాగ్రామ్‌ను స్వాధీనం చేసుకోవటానికి, దాన్ని మెయిన్‌టేన్ చేయడానికి వందల సంఖ్యలో మిలటరీ దళాలు అవసరం. దాన్ని పునర్నిర్మించడానికి పెద్ద మొత్తంలో ఖర్చు అవుతుంది’ అని అన్నారు.

ఇవి కూడా చదవండి

హెచ్ 1బీ వీసాలపై ట్రంప్ బాదుడు.. ఉద్యోగులకు మైక్రోసాఫ్ట్ కీలక ఆదేశాలు..

వేములవాడలో దారుణం.. కారులో మాజీ కౌన్సిలర్ హత్య..

Updated Date - Sep 20 , 2025 | 12:39 PM