Vemulawada Murder: వేములవాడలో దారుణం.. కారులో మాజీ కౌన్సిలర్ హత్య..
ABN , Publish Date - Sep 20 , 2025 | 11:11 AM
వేములవాడ అర్బన్ మండలం చీర్లవంచ పరిధిలోని అగ్రహారం వెంచర్ వద్ద దారుణం జరిగింది. కారులో రియల్ ఎస్టేట్ వ్యాపారి, మాజీ కౌన్సిలర్ రమేష్(48)ను గుర్తు తెలియని వ్యక్తులు గొంతు కోసి హత్య చేశారు.
రాజన్న సిరిసిల్ల: మనుషులు మానవత్వాన్ని మరిచిపోయారు. డబ్బు, భూమి కావాలనే ఆశతో.. మానవతా విలువలు మరిచిపోయి.. స్వార్థం, రాక్షసత్వానికి అలవాటు పడుతున్నారు. డబ్బు కోసం మన, తన అనీ తేడాలు లేకుండా దారుణాలకు ఒడిగడుతున్నారు. సొంత వ్యక్తులను కూడా కడతేర్చుతున్నారు. దొంగతనాలు, మోసాలు చేస్తూ.. పోలీసులకు పట్టుబడి జైలుపాలు అవుతున్నారు. తాజాగా.. భూమి కోసం కొందరు దుండగులు ఓ దారుణానికి పాల్పడిన ఘటన వేములవాడ పట్టణంలో వెలుగు చూసింది.
వేములవాడ అర్బన్ మండలం చీర్లవంచ పరిధిలోని అగ్రహారం వెంచర్ వద్ద దారుణం జరిగింది. కారులో రియల్ ఎస్టేట్ వ్యాపారి, మాజీ కౌన్సిలర్ రమేష్(48)ను గుర్తు తెలియని వ్యక్తులు గొంతు కోసి హత్య చేశారు. స్థానికుల సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకున్నారు పోలీసులు. అనంతరం ఘటనా స్థలాన్ని పరిశీలించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం.. స్థానిక ఆసుపత్రికి తరలించారు. భూ తగాదాల విషయంలోనే హత్య జరిగినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మొదటి నుంచి రియల్ ఎస్టేట్ రంగంలో వివాదాస్పద వ్యక్తిగా రమేష్‌కు పేరున్నట్లు స్థానికులు చెబుతున్నారు. ఇప్పటికే భూ తగాదాలలో పలుమార్లు రమేష్ జైలుకి వెళ్లి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
ఈ వార్తలు కూడా చదవండి..
మళ్లీ పెరిగిన బంగారం ధర.. ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
అదంతా ఫేక్.. ఆ వార్తలను ఖండిస్తున్నా