ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Melania Trump : పరువునష్టం దావా వేయబోతున్న మెలానియా ట్రంప్!

ABN, Publish Date - Aug 14 , 2025 | 08:12 AM

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ భార్య, అమెరికా ప్రథమ మహిళ మెలానియా ట్రంప్ పరువునష్టం దావా వేయబోతున్నట్టు తెలుస్తోంది. అమెరికా మాజీ అధ్యక్షుడు జో బైడెన్ కుమారుడు హంటర్ బైడెన్‌పై 1 బిలియన్ డాలర్ల పరువు నష్టం దావా వేస్తానని..

Melania Trump

ఇంటర్నెట్ డెస్క్ : అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ భార్య, అమెరికా ప్రథమ మహిళ మెలానియా ట్రంప్ పరువునష్టం దావా వేయబోతున్నట్టు తెలుస్తోంది. అమెరికా మాజీ అధ్యక్షుడు జో బైడెన్ కుమారుడు హంటర్ బైడెన్‌పై 1 బిలియన్ డాలర్ల పరువు నష్టం దావా వేస్తానని నోటీసు ఇచ్చినట్టు అమెరికాలో వార్తలు వస్తున్నాయి. తన వ్యక్తిగత గౌరవం, కుటుంబ ప్రతిష్టకు భంగం కలిగించే విధంగా హంటర్ బైడెన్ ఆరోపణలు ఉన్నాయని మెలానియా ట్రంప్ ఆగ్రహంతో ఉన్నారు. జెఫ్రీ ఎప్స్టీన్ తనను డోనాల్డ్ ట్రంప్ కు పరిచయం చేశాడంటూ హంటర్ బైడెన్ గతంలో చేసిన వ్యాఖ్యల పై మెలానియా ట్రంప్ ఈ చర్యకు దిగబోతున్నట్టు తెలుస్తోంది.

ఈ నెల మొదట్లో 'ఛానల్ 5 విత్ ఆండ్రూ కల్లాఘన్' అనే యూట్యూబ్ షోలో హంటర్ తమ ప్రథమ మహిళ గురించి చేసిన తప్పుడు వ్యాఖ్యలతో, పరువు నష్టం కలిగించే, అవమానకరమైన, రెచ్చగొట్టే విధంగా చేసిన వ్యాఖ్యల్ని వెంటనే ఉపసంహరించుకోవాలని మెలానియా న్యాయవాది అలెజాండ్రో బ్రిటో డిమాండ్ చేశారు. 'హంటర్ బైడెన్ రిటర్న్స్' అనే వీడియోలో బైడెన్.. 'జెఫ్రీ ఎప్స్టీన్.. డోనాల్డ్ ట్రంప్ కు మెలానియాను పరిచయం చేశాడు.. మెలానియా- డోనాల్డ్ ట్రంప్ అలా కలిశారు. ఈ సంబంధాలు చాలా విస్తృతంగా, లోతుగా ఉన్నాయి' అని ఆ ఇంటర్వూలో హంటర్ బైడెన్ చెప్పుకొచ్చాడు. అని బ్రిటో అంటున్నారు.

ఈ నేపథ్యంలో బ్రిటో ఆగస్టు 6న హంటర్ బైడెన్, అతని న్యాయవాది అబ్బే లోవెల్‌కు ఒక నోటీసు పంపారు. దీనిలో హంటర్ బైడెన్ కు అల్టిమేటం ఇచ్చారు. మెలానియా ట్రంప్ గురించి చేసిన కంటెంట్‌ను ఉపసంహరించుకోండి.. బహిరంగ క్షమాపణ చెప్పండి. లేదా ఒక బిలియన్ అమెరికన్ డాలర్ల పరువు నష్టం దావాను ఎదుర్కోవాల్సి ఉంటుందని ఆ నోటీసులో పేర్కొన్నారు.

ఈ వార్తలు కూడా చదవండి..

పాకిస్థాన్‌ బెదిరింపులకు భయపడేది లేదు

బెట్టింగ్‌ యాప్స్‌ కేసులో ఈడీ విచారణకు హాజరైన మంచు లక్ష్మి

Read Latest Telangana News and National News

Updated Date - Aug 14 , 2025 | 08:17 AM