ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Turkey military plane crash: కూలిన టర్కీ మిలిటరీ విమానం.. వీడియో వైరల్..

ABN, Publish Date - Nov 12 , 2025 | 07:19 AM

టర్కీకి చెందిన సి-130 అనే మిలిటరీ విమానం 20 మంది సిబ్బందితో అజర్‌బైజాన్‌ నుంచి స్వదేశానికి బయలుదేరింది. మార్గమధ్యంలో జార్జియాలోని సిగ్నాఘి ప్రాంతంలో ప్రమాదానికి గురై గింగిరాలు తిరుగుతూ నేల కూలిపోయింది.

Turkish C-130 crash

టర్కీకి చెందిన ఓ మిలిటరీ విమానం గాల్లోనే ప్రమాదానికి గురై గింగిరాలు తిరుగుతూ నేల కూలింది. అజర్‌బైజాన్ నుంచి టర్కీ వెళ్తున్న ఆ విమానం జార్జియా భూభాగంపై ఉండగా ప్రమదానికి గురైంది. దీంతో జార్జియాలోనే అది కూలిపోయింది. ఆ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది (plane crash news).

టర్కీకి చెందిన సి-130 అనే మిలిటరీ విమానం 20 మంది సిబ్బందితో అజర్‌బైజాన్‌ నుంచి స్వదేశానికి బయలుదేరింది (Turkish C-130 crash). మార్గమధ్యంలో జార్జియాలోని సిగ్నాఘి ప్రాంతంలో ప్రమాదానికి గురై గింగిరాలు తిరుగుతూ నేల కూలిపోయింది. పొగ, మంటలు విమానాన్ని చుట్టుముట్టడంతో అందులో ఉన్న మొత్తం 20 మంది మృత్యువాత పడినట్టు సమాచారం.

విమానం నేలకూలిన విషయాన్ని టర్కీ రక్షణ శాఖ, జార్జియా అంతర్గత వ్యవహారాల శాఖ ధ్రువీకరించాయి (military personnel killed). ఘటనా స్థలంలో సహాయక చర్యలు చేపట్టినట్టు తెలిపాయి. కాగా, ఈ ప్రమాదం కారణంగా విమానంలో ఉన్న మొత్తం 20 మంది చనిపోయినట్టు టర్కీ ప్రభుత్వం వెల్లడించింది.

ఇవి కూడా చదవండి:

పాక్ ఆర్మీ చీఫ్‌‌‌కు లబ్ధి చేకూర్చే రాజ్యాంగ సవరణ.. భగ్గుమన్న ప్రతిపక్షాలు

ఒహాయో గవర్నర్ ఎన్నికలు.. వివేక్ అభ్యర్థిత్వానికి మద్దతు తెలిపిన ట్రంప్

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Nov 12 , 2025 | 07:59 AM