ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Trumps Bold Tilt: ట్రంప్‌తో పాక్ ప్రధాని, ఆర్మీ చీఫ్ మీటింగ్.. 80 నిమిషాలు ఏం మాట్లాడారు..

ABN, Publish Date - Sep 26 , 2025 | 10:56 AM

అక్టోబర్ 1, 2025 నుంచి బ్రాండెడ్, పేటెంటెడ్ ఔషధాల దిగుమతులపై 100 శాతం టారిఫ్‌ విధించబోతున్నట్టు ప్రకటించారు. మెడిసిన్స్ ఉత్పత్తిలో భారత్ ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉంది.

Trumps Bold Tilt

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఓ నియంతలాగా తయారయ్యారు. అగ్రరాజ్యాధినేతనైన తనకు ప్రపంచ దేశాలు సలామ్ కొట్టాలని, ఏది చెబితే అది చేయాలని అనుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన మాటలు లెక్కచేయని భారత్‌ను అన్ని విధాలుగా ఇబ్బంది పెట్టే పనిలో పడ్డారు. ఇప్పటికే అత్యధిక టారిఫ్‌లు విధించారు. కొద్దిరోజుల క్రితం హెచ్ 1 బీ వీసాలకు సంబంధించిన దరఖాస్తు రుసుమును లక్ష డాలర్లకు పెంచారు. హెచ్ 1బీ వీసాలతో అమెరికా వెళుతున్న వారిలో భారతీయులే అధికంగా ఉన్నారు.

తాజాగా భారత్‌ను దెబ్బ తీసే మరో దారుణమైన నిర్ణయం తీసుకున్నారు. అక్టోబర్ 1, 2025 నుంచి బ్రాండెడ్, పేటెంటెడ్ ఔషధాల దిగుమతులపై 100 శాతం టారిఫ్‌ విధించబోతున్నట్టు ప్రకటించారు. మెడిసిన్స్ ఉత్పత్తిలో భారత్ ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉంది. అమెరికా తీసుకున్న తాజా నిర్ణయంతో భారత మెడిసిన్ రంగంపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. ఇలా అన్ని రకాలుగా భారత్‌ను ఇబ్బందిపెట్టే నిర్ణయాలు తీసుకుంటున్న ట్రంప్ పాకిస్తాన్‌కు మరింత దగ్గరవ్వటానికి ప్రయత్నిస్తున్నారు.

ట్రంప్‌తో పాక్ పీఎం, ఆర్మీ చీఫ్ భేటీ

అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో పాకిస్తాన్ ప్రధాన మంత్రి షహబాజ్ షరీఫ్, ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునిర్ భేటీ అయ్యారు. వైట్ హౌస్‌లోని ఓవల్ హౌస్‌లో వీరి మీటింగ్ జరిగింది. దాదాపు 80 నిమిషాల పాటు ఈ మీటింగ్ నడిచింది. అయితే, ఈ భేటీ ఎందుకు జరిగిందన్న దానిపై స్పష్టత లేదు. వైట్ హౌస్ ఆఫీస్‌నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన కూడా రాలేదు. మీటింగ్ తర్వాత ముగ్గురూ ఫొటోలకు ఫోజులు ఇచ్చారు. ట్రంప్ థమ్సప్ సింబల్ చూపిస్తూ ఫొటోలకు ఫోజిచ్చారు. ఇక, ఈ మీటింగ్‌పై పాకిస్తాన్ డిఫెన్స్ మినిష్టర్ ఖ్వాజా ఆసీఫ్ ఎక్స్‌లో ఓ పోస్ట్ పెట్టారు. ఆ పోస్టులో .. ‘భారత్‌పై విజయం, సౌదీ అరేబియాతో డిఫెన్స్ ఒప్పందం. పాక్, అమెరికా సంబంధాల్లో పురోగతి.. అన్ని రకాలుగా 2025లో విజయమే లభించింది’ అని రాసుకొచ్చారు.

ఇవి కూడా చదవండి

హైదరాబాద్‌ను వదలని వరణుడు.. మరో మూడు రోజులు ఇంతే

వర్ష బీభత్సం.. శంషాబాద్ ఎయిర్‌పోర్టునుంచి విమానాల మళ్లింపు

Updated Date - Sep 26 , 2025 | 11:00 AM