Share News

Flights Diverted To Vijayawada: వర్ష బీభత్సం.. శంషాబాద్ ఎయిర్‌పోర్టునుంచి విమానాల మళ్లింపు

ABN , Publish Date - Sep 26 , 2025 | 09:50 AM

శుక్రవారం ఉదయం 6 గంటల నుంచి 8.30 గంటల వరకు భారీ వర్షం కురిసింది. పలు లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి. రోడ్లన్నీ నదులను తలపిస్తున్నాయి.

Flights Diverted To Vijayawada: వర్ష బీభత్సం.. శంషాబాద్ ఎయిర్‌పోర్టునుంచి విమానాల మళ్లింపు
Flights Diverted To Vijayawada

హైదరాబాద్ నగరంలో వర్ష బీభత్సం కొనసాగుతోంది. నిన్న సాయంత్రం నుంచి వర్షం ఎడతెరిపి లేకుండా కురుస్తోంది. శుక్రవారం ఉదయం 6 గంటల నుంచి 8.30 గంటల వరకు భారీ వర్షం కురిసింది. పలు లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి. రోడ్లన్నీ నదులను తలపిస్తున్నాయి. హైదరాబాద్‌లో నేడు, రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను అలర్ట్ చేశారు. నగరంలో వరదలు వచ్చే అవకాశం ఉన్న ప్రాంతాల్లో జీహెచ్ఎంసీ, హైడ్రా, ఎన్డీఆర్ఎఫ్, ఎస్‌డీఆర్ఎఫ్ టీమ్స్ హై అలర్ట్‌లో ఉండాలని ఆదేశించారు.


శంషాబాద్ ఎయిర్‌పోర్టునుంచి విమానాల మళ్లింపు

భారీ వర్షాల నేపథ్యంలో వాతావరణం పూర్తిగా మారిపోయింది. శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌లో విమానాల ల్యాండింగ్‌కు వాతావరణం అనుకూలించటం లేదు. వాతావరణం అనుకూలంగా లేకపోవడంతో ఎయిర్‌పోర్ట్ అధికారులు పలు విమానాలను దారి మళ్లిస్తున్నారు. విమానాలు శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ల్యాండ్ అవ్వకుండానే విజయవాడ ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లిపోతున్నాయి. ముంబై - హైదరాబాద్‌, కోల్‌కతా - హైదరాబాద్‌, పుణె - హైదరాబాద్‌ విమానాలను గన్నవరం ఎయిర్‌పోర్ట్‌కు మళ్లిస్తున్నారు. వాతావరణం అనుకూలించగానే విమానాలు ల్యాండ్ అయ్యే అవకాశం ఉంది.


ఇవి కూడా చదవండి

ప్రాణంగా ప్రేమించుకున్నారు.. ఆ ఒక్క విషయంలో భయపడి..

జోగాడే పిల్లలే కదా అని బాల్కనీలో వదిలేస్తున్నారా..

Updated Date - Sep 26 , 2025 | 09:55 AM