Share News

Hyderabad Rains: హైదరాబాద్‌ను వదలని వరణుడు.. మరో మూడు రోజులు ఇంతే

ABN , Publish Date - Sep 26 , 2025 | 10:10 AM

ఇటీవల కురిసిన భారీ వర్షం నుంచే భాగ్యనగరం ఇంకా తేరుకోలేదు.. ఇప్పటికీ పలు కాలనీలు జలదిగ్బంధంలోనే ఉన్నాయి. అంతలోనే వరణుడు మరోసారి తన ప్రతాపం చూపించాడు.

Hyderabad Rains: హైదరాబాద్‌ను వదలని వరణుడు.. మరో మూడు రోజులు ఇంతే
Hyderabad Rains

హైదరాబాద్, సెప్టెంబర్ 26: గ్రేటర్ వ్యాప్తంగా భారీగా వర్షం (Heavy Rains) కురుస్తోంది. అప్పటి వరకు ఒకలా ఉన్న వాతావరణం ఒక్కసారిగా మేఘావృతం అవుతోంది. ఉన్నట్టుండి వరణుడు ప్రతాపం చూపిస్తున్నాడు. గ్రేటర్ పరిధిలో వర్షం దంచికొడుతోంది. గడిచిన రెండు వారాలుగా హైదరాబాద్‌ను వరుణుడు వదలని పరిస్థితి. ఇటీవల కురిసిన భారీ వర్షం నుంచే భాగ్యనగరం ఇంకా తేరుకోలేదు.. ఇప్పటికీ పలు కాలనీలు జలదిగ్బంధంలోనే ఉన్నాయి. అంతలోనే వరణుడు మరోసారి తన ప్రతాపం చూపించాడు. నగర వ్యాప్తంగా ఈరోజు (శుక్రవారం) తెల్లవారుజాము నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది.


భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. నగర రోడ్లపై వరద నీరు వచ్చి చేరింది. ఉదయం ఆఫీస్‌లకు వెళ్ళే సమయం కావడంతో నగరవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు ఎవ్వరూ కూడా అనవసరంగా ఇంట్లో నుంచి బయటకు రావొద్దని హైడ్రా, జీహెచ్‌ఎంసీ హెచ్చరికలు జారీ చేసింది. హైదరాబాద్ వ్యాప్తంగా భారీ వర్షాల నేపథ్యంలో హైడ్రా డీఆర్‌ఎస్, జీహెచ్‌ఎంసీ మాన్సూన్ బృందాలు రంగంలోకి దిగాయి. మ్యాన్‌హోల్స్ మూతలు తెరవద్దని నగర వాసులకు అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఇదిలా ఉండగా.. మరో మూడు రోజుల పాటు హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి జిల్లాలకు భారీ వర్ష సూచన ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.


ఐటీ కంపెనీలకు సూచన

మరోవైపు ఐటీ కంపెనీలకు సైబరాబాద్ పోలీసులు, జీహెచ్ఎంసీ కీలక సూచనలు చేసింది. సైబరాబాద్ ప్రాంతంలో ఈరోజు భారీ వర్షం కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. ఈ క్రమంలో ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోం ఇవ్వాలని సూచనలు చేసింది. కంపెనీలు సహకారం అందించాలని సైబరాబాద్ పోలీసులు కోరారు. ట్రాఫిక్ అంతరాయం ఏర్పడకుండా ఉండేందుకు సైబరాబాద్ పోలీసులు ఈ మేరకు చర్యలు తీసుకున్నారు.


ఇవి కూడా చదవండి..

అతిభారీ వర్షాలు.. తీర ప్రాంతాలకు అలెర్ట్

జై మహాలక్ష్మి.. ఇంద్రకీలాద్రిపై భక్తుల సందడి

Read latest Telangana News And Telugu News

Updated Date - Sep 26 , 2025 | 10:25 AM