BJP state president: ఆ ప్రయోజనాలను ప్రజలకు తెలపండి
ABN , Publish Date - Sep 26 , 2025 | 09:50 AM
కేంద్ర ప్రభుత్వం నూతనంగా జీఎస్టీ ధరలను తగ్గిస్తూ తీసుకున్న నిర్ణయంతో కలిగే ప్రయోజనాలను పార్టీ శ్రేణులు ప్రజలకు తెలియజేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్‌రావు పిలుపునిచ్చారు.
- బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్‌రావు
హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం నూతనంగా జీఎస్టీ ధరలను తగ్గిస్తూ తీసుకున్న నిర్ణయంతో కలిగే ప్రయోజనాలను పార్టీ శ్రేణులు ప్రజలకు తెలియజేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్‌రావు(BJP state president N. Ramachandra Rao) పిలుపునిచ్చారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ బలం మరింత పెరిగేందుకు దోహదపడుతుందన్నారు.

ఈ సందర్భంగా బీజేపీ నూతన రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ శ్రీనివాసరెడ్డి(Dr. Srinivasa Reddy)కి గురువారం ఆయన నియామక పత్రం అందజేశారు. గతంలో ఉన్న జీఎస్టీ స్లాబ్ అన్నింటినీ తొలగించి ప్రస్తుతం 5 శాతం 18 శాతం మాత్రమే కొనసాగిస్తోందని రామచందర్‌రావు అన్నారు. దీంతో పేద, మధ్య తరగతి ప్రజలకు అనేక ప్రయోజనాలు కలుగుతున్నాయన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
గుడ్ న్యూస్..మళ్లీ తగ్గిన బంగారం, కానీ వెండి రేట్లు మాత్రం..
కాంగ్రెస్ చిల్లర వేషాలు వేస్తోంది.. ఎంపీ అర్వింద్ ఫైర్
Read Latest Telangana News and National News