Europe's Purchases Oil From Russia: అరెరే.. ట్రంప్‌ని లెక్క చేయని యూరోపిన్ దేశాలు.. ఈ లెక్కలే సాక్ష్యం..!
ABN, Publish Date - Oct 16 , 2025 | 03:52 PM
యూరోపియన్ దేశాలు.. ట్రంప్ ఆదేశాలను పట్టించుకున్నట్లుగా కనిపించడం లేదు. ట్రంప్ అంతే.. అలాగే అంటాడులే అని భావించాయో ఏమో గానీ.. సదరు యూరోపియన్ దేశాలే రష్యా నుంచి పెద్ద ఎత్తున చమురును కొనుగోలు చేస్తున్నాయి.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump ) రష్యా నుంచి చమురు దిగుమతిని నిలిపివేయాలని భారత్‌ను ఎప్పటి నుంచో కోరుతున్నాడు. ఆయన మాటలను ఇండియా అంతగా పట్టించుకోకపోవడంతో సుంకాల పేరుతో బెదిరింపులకు పాల్పడ్డాడు. అయినా తగ్గేదేలే అన్నట్లుగా భారత్.. రష్యా నుంచి చమరు కొనుగోళ్లను ఆపలేదు. దీంతో మరింత రగిలిపోయిన ట్రంప్(Donald Trump).. భారత్‌పై టారీఫ్‌లను భారీగా పెంచేశాడు. అంతటితో ఆగకుండా.. యూరోపియన్ దేశాలు సైతం భారత్‌పై టారీఫ్‌లను పెంచాలంటూ ఒత్తిడి తీసుకువచ్చాడు. ఒకానొక సమయంలో ఆ దేశాలను సైతం బెదిరించాడు.
అయితే, ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే.. యూరోపియన్ దేశాలు.. ట్రంప్ ఆదేశాలను పట్టించుకున్నట్లుగా కనిపించడం లేదు. ట్రంప్ అంతే.. అలాగే అంటాడులే అని భావించాయో ఏమో గానీ.. సదరు యూరోపియన్ దేశాలే రష్యా నుంచి పెద్ద ఎత్తున చమురును కొనుగోలు చేస్తున్నాయి. అవును.. చమరు కొనుగోలు చేస్తున్న యూరోపియన్ దేశాల లెక్క చూస్తే.. ట్రంప్‌ను వారు ఏమాత్రం పట్టించుకోలేదని స్పష్టమవుతుంది.
సెంటర్ ఫర్ రీసెర్చ్ ఆన్ ఎనర్జీ అండ్ క్లీన్ ఎయిర్ (CREA) ప్రకారం.. యూరోపియన్ యూనియన్ ఆగస్టు 2025లో రష్యన్ వాణిజ్య ఇంధనాల దిగుమతి కోసం 1.15 బిలియన్ యూరోలు (USD 1.35 బిలియన్) ఖర్చు చేసింది. ఈ మొత్తంలో యూరోప్ లోని ఐదు అతి పెద్ద దిగుమతి దేశాలైన హంగేరీ, స్లోకేవి, ఫ్రాన్స్, నెదర్లాండ్స్, బెల్జియం దేశాలు 85 శాతం వాటా కలిగి ఉన్నాయి. 979 మిలియన్ యూరోలు (USD 1.15 బిలియన్) విలువైన రష్యన్ చమురు, గ్యాస్‌ను ఆ దేశాలు కొనుగోలు చేయాయి. మిగిలిన 15 శాతం స్పెయిన్, బల్గేరియా, రొమేనియా, ఇటలీ, గ్రీస్, క్రొయేషియా, స్లోవేనియా, ఆస్ట్రియా మరియు పోలాండ్ వంటి దేశాల నుండి వచ్చాయి.
రష్యా నుంచి ఆయిల్ ఎక్కువగా కొనుగోలు చేసిన దేశాలు:
హంగేరీ: 416 మిలియన్ యూరోలు (USD 488 మిలియన్లు)
స్లోవేకియా: 275 మిలియన్ యూరోలు (USD 323 మిలియన్లు)
ఫ్రాన్స్: 157 మిలియన్ యూరోలు (USD 184 మిలియన్లు)
నెదర్లాండ్స్: 65 మిలియన్ యూరోలు (USD 76 మిలియన్లు)
బెల్జియం: 64 మిలియన్ యూరోలు (USD 75 మిలియన్లు)
ఇక్కడ హంగేరీ, స్లోవేకియా దేశాలు ముడి చమురు, పైప్‌లైన్ గ్యాస్ రెండింటినీ రష్యా నుంచి దిగుమతి చేసుకున్నాయి. ప్రపంచంలోని అతి పొడవైన చమురు పైప్‌లైన్(Oil Pipe lines) అయిన డ్రుజ్బా పైప్‌లైన్ ద్వారా రష్యా నుంచి గ్యాస్ యూరోప్(Europe) కు సరఫరా అవుతంది.ఇది రోజుకు 1.2 నుండి 1.4 మిలియన్ బారెల్స్ సామర్థ్యంతో 4,000 కి.మీ (2,500 మైళ్ళు) విస్తరించి ఉంది. ఇది తూర్పు రష్యా నుండి బెలారస్ మరియు ఉక్రెయిన్ ద్వారా హంగేరీ, స్లోవేకియాకు చమురును సరఫరా చేస్తుంది. మొత్తంగా ట్రంప్ మద్దతు ఇస్తున్న యూరోపిన్ దేశాలే(Europe) ఆయన మాటలు ఏ మాత్రం లెక్క చేయకుండా ఈ స్థాయిలో చమురు,గ్యాస్ ను రష్యా నుంచి దిగుమతి చేసుకుంటున్నాయి.
ఇవి కూడా చదవండి:
రష్యా చమురు కొనబోమని మోదీ హామీ ఇచ్చారు: అమెరికా అధ్యక్షుడు ట్రంప్
పవర్‌ఫుల్ పాస్‌పోర్టుల జాబితా.. భారత్ ర్యాంకు ఎంతంటే..
Updated Date - Oct 16 , 2025 | 04:27 PM