Modi Assurance to Trump: రష్యా చమురును కొనబోమని మోదీ హామీ ఇచ్చారు: అమెరికా అధ్యక్షుడు ట్రంప్
ABN , Publish Date - Oct 16 , 2025 | 07:53 AM
రష్యా చమురు కొనుగోలు చేయబోమని ప్రధాని మోదీ తనకు హామీ ఇచ్చినట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్పారు. దీంతో, రష్యాను దారికి తెచ్చుకోవడం సులభమవుతుందని అన్నారు.
ఇంటర్నెట్ డెస్క్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి సంచలన కామెంట్స్ చేశారు. రష్యా చమురు కొనుగోలు చేయబోమని ప్రధాని మోదీ తనకు హామీ ఇచ్చారని చెప్పుకొచ్చారు. శ్వేత సౌధంలో తాజాగా జరిగిన పత్రికా సమావేశంలో ఆయన ఈ కామెంట్స్ చేశారు.
‘ఇకపై రష్యా చమురు కొనుగోళ్లు ఉండవని ఆయన నాకు హామీ ఇచ్చారు. కానీ, తక్షణం కొనుగోళ్లను నిలిపివేయలేము కదా. ఇదొక ప్రక్రియ. ఇందుకు కొంత సమయం పడుతుంది. అయితే, త్వరలో ఇది ముగుస్తుంది’ అని కామెంట్ చేశారు. భారత్ అమెరికాకు విశ్వసనీయ భాగస్వామి అని కూడా ట్రంప్ వ్యాఖ్యానించారు. ‘అది నిజమే. మోదీ నాకు గొప్ప మిత్రుడు. అయితే, రష్యా చమురును భారత్ కొనుగోలు చేయడం నాకు నచ్చలేదు. కానీ ఈ కొనుగోళ్లు నిలిపివేస్తామని ఆయన అన్నారు. ఇక చైనా కూడా రష్యా చమురు కొనుగోళ్లను నిలిపివేయాలి’ అని అన్నారు (Modi's Assurance To Trump).
ఇటీవల అమెరికా రాయబారి సెర్గియో, ప్రధాని మోదీతో భేటీ అవడంపై కూడా ట్రంప్ స్పందించారు. ‘మోదీ గొప్ప వ్యక్తి. నేనంటే ప్రధాని మోదీకి అభిమానమని సెర్గియో తెలిపారు. ప్రధానిని నేను చాలా ఏళ్లుగా చూస్తున్నాను. భారత్‌లో సంవత్సరానికి ఓ కొత్త నేతను అప్పట్లో చూసేవాడిని. కానీ ప్రధాని మోదీ మాత్రం చాలా ఏళ్లుగా కొనసాగుతున్నారు’ అని కామెంట్ చేశారు ( India Russian Oil Import).
ఉక్రెయిన్‌తో యుద్ధాన్ని పుతిన్ వెంటనే ముగించాలని తాను ఆశిస్తున్నట్టు ట్రంప్ తెలిపారు. ‘పుతిన్ ఈ యుద్ధాన్ని ఆపేయాలి. ఉక్రెయిన్ వాసులతో పాటు రష్యన్ల మరణానికి ఆయన కారణమవుతున్నారు. జెలెన్‌స్కీ, పుతిన్ మధ్య ద్వేషం అధికం. ఇది యుద్ధ విరమణకు ప్రతిబంధకంగా మారింది. కానీ వాళ్లను దారిలోకి తెచ్చుకుంటాము. రష్యా చమురు కొనుగోళ్లను భారత్ నిలిపివేస్తే ఇది ఇంకా సులభం అవుతుంది. యుద్ధం ముగిశాక వాళ్లు మళ్లీ కొనుగోళ్లను మొదలెట్టొచ్చు’ అని అన్నారు (Russia-Ukraine War).
భారత్, రష్యాల యుద్ధం తనే ఆపానని ట్రంప్ మరోసారి చెప్పుకున్నారు. పాక్ ప్రధాని ఇదే విషయాన్ని చెప్పారని అన్నారు. ఎందరో ప్రాణాలను కాపాడినట్టు తెలిపారని ట్రంప్ అన్నారు.
ఇవి కూడా చదవండి:
ఆఫ్ఘనిస్థాన్ మీద పాకిస్థాన్ వైమానిక దాడులు.. 12మందికి పైగా పౌరులు మృతి
టైమ్ మ్యాగజైన్‌పై డొనాల్డ్ ట్రంప్ ఘాటు విమర్శలు..
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి