ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Trump Threatens New Tariffs: భారత్‌కు షాక్ ఇవ్వడానికి రెడీ అయిన ట్రంప్.. ఈ సారి ఇదే టార్గెట్..

ABN, Publish Date - Dec 09 , 2025 | 09:40 AM

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్‌ నుంచి అమెరికాకు ఎగుమతి అవుతున్న బియ్యంపై భారీ మొత్తంలో టారిఫ్‌లు విధించడానికి పూనుకున్నారు. తాజాగా, వైట్ హౌస్‌లో జరిగిన సమావేశంలో ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించారు.

Trump Threatens New Tariffs

అమెరికా, భారత్‌ల మధ్య గత కొంత కాలం నుంచి ట్రేడ్ టాక్స్ జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే, ఆ చర్చలు ఫలితాలను ఇవ్వటం లేదు. ఈ నేపథ్యంలోనే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్‌కు షాక్ ఇవ్వడానికి సిద్ధమయ్యారు. ఈ సారి వ్యయసాయ దిగుమతులను ఆయన టార్గెట్ చేశారు. మరీ ముఖ్యంగా భారత్‌ నుంచి అమెరికాకు ఎగుమతి అవుతున్న బియ్యంపై ఆయన భారీ మొత్తంలో టారిఫ్‌లు విధించడానికి పూనుకున్నారు. తాజాగా, వైట్ హౌస్‌లో జరిగిన సమావేశంలో ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించారు. అమెరికా రైతులకు గుడ్‌న్యూస్ కూడా చెప్పారు.

అక్కడి రైతులకోసం మల్టీ బిలియన్ డాలర్ రిలీఫ్ ఫ్యాకేజ్ ప్రకటించారు. భారత్, ఇతర ఆసియా దేశాలనుంచి అమెరికాకు ఎగుమతి అవుతున్న వ్యవసాయ ఉత్పత్తులపై ఆయన విమర్శలు సైతం గుప్పించారు. ఇతర దేశాలనుంచి వస్తువుల్ని అమెరికాలోకి దిగుమతి చేసుకోవటం స్థానిక ఉత్పత్తిదారులకు సవాలుగా మారిందని అన్నారు. స్థానిక ఉత్పత్తిదారులను రక్షించటం కోసం, దిగుమతులకు అడ్డుకట్ట వేయటం కోసం భారీ మొత్తంలో టారిఫ్‌లు వేస్తామని స్పష్టం చేశారు. ఆయన మాట్లాడుతూ.. ‘రైతులు ఎంతో అవసరమైన జాతీయ ఆస్థి. అమెరికాకు వెన్నెముక లాంటి వారు’ అని అన్నారు.

భారత్ నుంచి అమెరికా దిగుమతి చేసుకుంటున్న బియ్యం గురించి కూడా ఆయన మాట్లాడారు. ‘అమెరికా రీటేల్ రైస్ మార్కెట్‌లో రెండు అతి పెద్ద బ్రాండ్స్ ఉన్నాయి. వాటి సంగతి మేము చూసుకుంటాము. అది చాలా సులభం. మళ్లీ పెద్ద మొత్తంలో టారిఫ్‌లు వేస్తే రెండు నిమిషాల్లో సమస్య పరిష్కారం అవుతుంది. వాళ్లు మన దేశంలో బియ్యాన్ని డంప్ చేయకూడదు. అంటే నా ఉద్దేశ్యం.. దాని గురించి విన్నాను. మీరలా చేయకూడదు’ అని పరోక్షంగా భారత్‌ గురించి మాట్లాడారు. కెనడా నుంచి అమెరికా దిగుమతి చేసుకుంటున్న ఎరువులపై కూడా ఆయన మాట్లాడారు. వాటిపై భారీ స్థాయిలో టారిఫ్‌లు వేస్తామన్నారు.

ఇవి కూడా చదవండి

జీఎంహెచ్ఎంసీ వార్డుల సంఖ్య పెంపు.. తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం

రో-కో ఇంకా ఏం నిరూపించుకోవాలి?: అశ్విన్

Updated Date - Dec 09 , 2025 | 10:25 AM