Share News

Ashwin: రో-కో ఇంకా ఏం నిరూపించుకోవాలి?: అశ్విన్

ABN , Publish Date - Dec 09 , 2025 | 09:06 AM

టీమిండియా వెటరన్ ప్లేయర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ టెస్ట్, టీ20 ఫార్మాట్లకు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. అయితే, వీరిద్దరూ ప్రస్తుతం వన్డే క్రికెట్‌లో అద్భుతమైన ఫామ్‌లో ఉన్నారు. తాజాగా, భారత మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ రో-కోపై ప్రశంసలు కురిపించాడు.

Ashwin: రో-కో ఇంకా ఏం నిరూపించుకోవాలి?: అశ్విన్
Ashwin

ఇంటర్నెట్ డెస్క్: టీమిండియా వెటరన్ ప్లేయర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఇప్పటికే టెస్ట్, టీ20 ఫార్మాట్ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. కేవలం వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్న వీరిద్దరూ.. అద్భుతమైన ఫామ్‌లో ఉన్నారు. ఇటీవల ఆస్ట్రేలియా, సౌతాఫ్రికాతో జరిగిన సిరీస్‌లో అదరగొట్టి తాము 2027 ప్రపంచ కప్ ఆడటానికి సిద్ధంగా ఉన్నామని హింట్ ఇచ్చేశారు. అయితే ప్రపంచ కప్‌లో తుది జట్టులో వీరికి చోటు కల్పిస్తామని టీమిండియా మేనేజ్‌మెంట్ నుంచి ఎలాంటి స్పష్టత రాలేదు. ఈ నేపథ్యంలో భారత మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్(Ashwin).. రో-కోపై ప్రశంసలు కురిపించాడు.


‘రోహిత్ తన ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టి మళ్లీ అద్భుతంగా కమ్ బ్యాక్ ఇచ్చాడు. విరాట్ కోహ్లీ కూడా మునపటిలా చెలరేగి బ్యాటింగ్ చేస్తున్నాడు. వారు ఎంత కష్టపడ్డారనే దానికి ఇదే నిదర్శనం. రో-కో నిరూపించుకోవాల్సి ఉందనేది హాస్యాస్పదమైన విషయం. వారు ఇంకా ఏం నిరూపించుకోవాలి? సుదీర్ఘ కెరీర్‌లో ఏ ఆటగాడికైనా ఎత్తుపల్లాలుంటాయి. కానీ, రోహిత్, కోహ్లీ ఎవ్వరికీ ఏమీ నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. వీరి కమ్ బ్యాక్ రాబోయే తరం ఆటగాళ్లందరికీ ఒక ఉదాహరణగా నిలుస్తుంది. సుదీర్ఘమైన కెరీర్‌లను కలిగి ఉండాలంటే ఎన్నో త్యాగాలు చేయాలి. ఆట పట్ల నిబద్ధత ప్రదర్శించాలి. ఆటే అందరి కంటే ముఖ్యమైనది’ అని అశ్విన్ తెలిపాడు.


ఈ వార్తలు కూడా చదవండి..

Jio Hotstar Exit: టీ20 ప్రపంచకప్ ముందు ఐసీసీకి షాక్.. జియో హాట్ స్టార్ సంచలన నిర్ణయం

87 ఏళ్ల రికార్డు.. జాబితాలో ఒకే ఒక్క భారత ప్లేయర్!

Updated Date - Dec 09 , 2025 | 09:06 AM