Gautam Gambhir: 87 ఏళ్ల రికార్డు.. జాబితాలో ఒకే ఒక్క భారత ప్లేయర్!
ABN , Publish Date - Dec 08 , 2025 | 09:58 AM
87 ఏళ్లుగా ఓ అద్భుతమైన రికార్డు చెక్కు చెదరకుండా ఉంది. అదే వరుసగా ఆరు టెస్టుల్లో సెంచరీలు చేసి డాన్ బ్రాడ్‌మాన్ చరిత్ర సృష్టించాడు. ఈ మైలురాయికి అత్యంత చేరువైన భారత స్టార్ గౌతమ్ గంభీర్ వరుసగా ఐదు టెస్టుల్లో సెంచరీలు చేశాడు.
ఇంటర్నెట్ డెస్క్: టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఎన్నో రికార్డులు బ్రేక్ అవుతున్నా.. 87 ఏళ్ల నుంచి ఓ అరుదైన రికార్డును ఎవ్వరూ బద్దలు కొట్టలేకపోయారు. ఆస్ట్రేలియా దిగ్గజం డాన్ బ్రాడ్‌మాన్ నెలకొల్పిన ఈ రికార్డుకు సమీపంలోకి వచ్చింది ఒకే ఒక్క భారత ప్లేయర్. అతడే ప్రస్తుతం టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్(Gautam Gambhir). సచిన్, రాహుల్ ద్రవిడ్, సునీల్ గావస్కర్ వంటి దిగ్గజాలు కూడా ఈ రికార్డును అందుకోలేకపోయారు.
ఆ రికార్డు ఏంటంటే..?
టెస్టు క్రికెట్‌లో వరుసగా ఆరు మ్యాచుల్లో సెంచరీలు చేసిన ఏకైక ప్లేయర్ ఆస్ట్రేలియా లెజెండరీ బ్యాటర్ డాన్ బ్రాడ్‌మాన్. 1937 జనవరి 1న ఇంగ్లండ్‌పై మొదలైన సెంచరీల ప్రవాహం.. 1938 జులై 22 వరకు కొనసాగింది. ఈ 87 ఏళ్లలో మరే ఇతర బ్యాటర్ కూడా వరుసగా ఆరు మ్యాచుల్లో సెంచరీలు చేయలేకపోయారు. అయితే ఈ అరుదైన ఘనతకు అత్యంత చేరువలోకి వచ్చిన ఏకైక భారత ప్లేయర్ గౌతమ్ గంభీర్. 2009-2010 మధ్య కాలంలో గంభీర్ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నారు. వరుసగా 5 టెస్టు మ్యాచుల్లో 5 సెంచరీలు చేశాడు. న్యూజిలాండ్, శ్రీలంక జట్లపై ఈ ఘనత సాధించాడు. కాగా ప్రపంచ వ్యాప్తంగా గంభీర్‌తో పాటు జాక్వెస్ కల్లిస్(సౌతాఫ్రికా), మహ్మద్ యూసుఫ్(పాకిస్తాన్) కూడా వరుసగా 5 మ్యాచుల్లో సెంచరీలు చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
రిటైర్‌మెంట్ వెనక్కి తీసుకున్న స్టార్ ఆటగాడు