Virat-Arshdeep Singh: ఆ వీడియోకు 10 కోట్ల వ్యూస్
ABN , Publish Date - Dec 08 , 2025 | 06:39 AM
సౌతాఫ్రికాతో వన్డే సిరీస్ గెలిచిన తర్వాత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ, పేసర్ అర్ష్‌దీప్ సింగ్ చేసిన రీల్ సోషల్ మీడియాను ఊపేస్తుంది. ఒక్క రోజులోనే ఈ రీల్ 10 కోట్ల వ్యూస్ అందుకోవడం విశేషం.
ఇంటర్నెట్ డెస్క్: సౌతాఫ్రికాతో వన్డే సిరీస్ విజయానంతరం టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ, యువ పేసర్ అర్ష్‌దీప్(Arshdeep Singh) కలిసి చేసిన రీల్ సామాజిక మాధ్యమాలను షేక్ చేస్తోంది. ఒక్క రోజు వ్యవధిలో ఆ రీల్‌కు 10 కోట్ల వ్యూస్ రావడం విశేషం. సౌతాఫ్రికాతో వైజాగ్ వేదికగా జరిగిన మూడో వన్డేలో టీమిండియా 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ(65*) అద్భుతమైన ఫినిషింగ్ ఇచ్చాడు. తొలి రెండు వన్డేల్లో సెంచరీలు చేసిన కోహ్లీ.. మూడో మ్యాచ్‌లో టార్గెట్ సులువుగా పూర్తి చేయడంతో హ్యాట్రిక్ సెంచరీ మిస్ అయింది. టీమిండియా ఓపెనర్లు యశస్వి జైస్వాల్(116), రోహిత్(75) తొలి వికెట్‌కు 155 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పడంతో.. కోహ్లీ బ్యాటింగ్‌కి వచ్చేటప్పటికీ టార్గెట్ 116కి తగ్గిపోయాయి.
అయినా సరే చెలరేగి ఆడిన విరాట్(Virat Kohli).. 45 బంతుల్లో 65 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఈ నేపథ్యంలో అర్ష్‌దీప్.. ‘లక్ష్యం చిన్నది కావడం వల్ల సెంచరీ మిస్ అయింది కదా పాజీ’ అని కోహ్లీని అడిగాడు. బదులుగా విరాట్.. ‘టాస్ గెలిచాం కాబట్టి సరిపోయింది. లేదంలో ఈ డ్యూకి నువ్వు బౌలింగ్‌లో సెంచరీ కొట్టేవాడివి’ అనడంతో నవ్వులు విరిశాయి. ఈ రీల్‌ను అర్ష్‌దీప్ సామాజిక మాధ్యమంలో పోస్ట్ చేయగా.. భారీగా వ్యూస్, షేర్స్ వస్తున్నాయి. కాగా ఈ రీల్ చేయడం కోసం అర్ష్‌దీప్.. కోహ్లీని ఒప్పించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఈ వార్తలు కూడా చదవండి..
సిరీస్ మొత్తంలో గర్వపడింది అప్పుడే: కేఎల్ రాహుల్
రికార్డులకే ‘కింగ్’.. సచిన్ మరో రికార్డు బద్దలు!