Bangladesh Player: రిటైర్‌మెంట్ వెనక్కి తీసుకున్న స్టార్ ఆటగాడు
ABN , Publish Date - Dec 08 , 2025 | 08:11 AM
బంగ్లాదేశ్ మాజీ కెప్టెన్ షకీబ్ అల్ హసన్ తన రిటైర్‌మెంట్‌ను వెనక్కి తీసుకున్నాడు. వన్డే, టెస్ట్, టీ20ల్లో మళ్లీ ఆడాలని నిర్ణయించుకున్నట్టు ప్రకటించాడు. ఆయనపై గతంలో హత్య కేసు నమోదు అయిన విషయం తెలిసిందే.
ఇంటర్నెట్ డెస్క్: బంగ్లాదేశ్ మాజీ కెప్టెన్ షకీబ్ అల్ హసన్ రిటైర్‌మెంట్ వెనక్కి తీసుకున్నాడు. గతేడాది టెస్ట్, టీ20 క్రికెట్‌కు అతడు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. తాజాగా ఫార్మాట్ల రిటైర్‌మెంట్‌ను వెనక్కి తీసుకున్నాడు. మూడు ఫార్మాట్లలోనూ జాతీయ జట్టుకు ఆడాలని కోరుకుంటున్నట్లు వెల్లడించాడు.
‘నేను(Shakib Al Hasan) అధికారికంగా అన్ని ఫార్మాట్ల నుంచి రిటైర్ కాలేదు. ఈ విషయాన్ని మొదటిసారి వెల్లడిస్తున్నా. బంగ్లాదేశ్‌కు తిరిగి వెళ్లి వన్డే, టెస్ట్, టీ20 పూర్తి సిరీస్ ఆడి, రిటైర్ కావడమే నా ప్రణాళిక’ అని షకీబ్ ఓ పాడ్‌కాస్ట్‌లో తెలిపాడు. బంగ్లాదేశ్‌లో అవామీ లీగ్ ప్రభుత్వం అధికారం కోల్పోయిన విషయం తెలిసిందే. మే 2024 నుంచి షకీబ్ అల్ హసన్ ఆ దేశానికి తిరిగి వెళ్లలేదు. ఆ పార్టీ మాజీ ఎంపీ అయిన అతడిపై హత్య కేసులో ఎఫ్‌ఐఆర్ కూడా నమోదు అయింది. అయితే ఆ సమయంలో అతడు దేశంలో లేడు. ఆ తర్వాత షకీబ్.. బంగ్లా తరఫున పాకిస్తాన్, భారత్‌లో టెస్ట్ మ్యాచులు ఆడాడు. కాన్పూర్‌లో భారత్‌తో జరిగిన రెండో టెస్టులో అతడు చివరిసారిగా కనిపించాడు.
ఈ వార్తలు కూడా చదవండి..
సిరీస్ మొత్తంలో గర్వపడింది అప్పుడే: కేఎల్ రాహుల్
రికార్డులకే ‘కింగ్’.. సచిన్ మరో రికార్డు బద్దలు!